Pune Police Stop AR Rahman Live Concert, Video Viral - Sakshi
Sakshi News home page

Ar Rahman : ఏఆర్‌ రెహమాన్‌ లైవ్‌ కాన్సర్ట్‌ను ఆపేసిన పోలీసులు.. వీడియో వైరల్‌

Published Tue, May 2 2023 10:25 AM | Last Updated on Tue, May 2 2023 11:07 AM

Pune Police Stop Ar Rahman Live Concert Video Goes Viral - Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు పోలీసులు షాక్‌ ఇచ్చారు. పూణెలో నిర్వహించిన మ్యూజిక్‌షోను అర్ధాంతంరగా అడ్డుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం రాత్రి పుణెలో ఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ కాన్సర్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇక రెహమాన్‌ తన బృందంతో కలిసి హుషారైన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చదవండి: (బ్రేకప్‌ అయినా ఇంకా నేనే కావాలని కోరుకుంటున్నాడు: నటి)

ఎంతో ఉత్సాహాంగా ఈవెంట్‌ జరుగుతుండగా పోలీసులు స్టేజ్‌పైకి వెళ్లి ప్రోగ్రాంను మధ్యలోనే ఆపేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాత్రి 10గంటల వరకే షోకు అనుమతి ఉందని, సమయం మించిపోవడంతో ప్రోగ్రాంను ఆపేయాలంటూ రెహమాన్‌ టీంను కోరారు. రెహమాన్ చివరిగా ఓ పాట పాడి కార్యక్రమాన్ని ముగించారు.

కాగా ఈ విషయంపై పూణె పోలీసులు వివరణ ఇస్తూ.. రెహమాన్‌ మేం వెళ్లే సమయానికి చివరి పాట పాడుతున్నారు. డెడ్‌లైన్‌ ముగియడంతో షోను ఆపేయాలను కోరాం. ఆయన కూడా పాజిటివ్‌గా రియాక్ట్‌ అయ్యారు అంటూ పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై రెహమాన్‌ ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం షోను ఆపేయాలంటే నిర్వాహకులతో మాట్లాడాలి.. అంతేకానీ ఇలా స్టేజ్‌పైకి ఎక్కి అవమానించకూడదు అంటూ కామెంట్స​ చేస్తున్నారు. చదవండి: (రజనీకాంత్‌ సినిమాకు ఆ కండీషన్‌ పెట్టిన డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement