
ప్రముఖ సింగర్ చిత్ర తన కుమార్తె నందన వర్ధంతి సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా తన కూతురి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నువ్వు నాతో భౌతికంగా లేనప్పటికీ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటావని ఎమోషనలైంది. నా చివరి శ్వాస వరకు నాతోనే ఉంటావంటూ ట్వీట్ చేసింది.
కాగా సింగర్ కేఎస్ చిత్ర ప్రముఖ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోను పాటలు పాడారు. నాలుగు దశాబ్దాల సినీ సంగీత ప్రయాణంలో దాదాపు 25 వేలకు పైగా పాటలు ఆలపించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఇళయరాజా వంటి సంగీత దిగ్గజాలతో ఆమె పనిచేశారు.
సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్ర విజయ్ శంకర్ అనే ఒక ఇంజినీర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 18 డిసెంబర్ 2002లో వీరికి నందన అనే అమ్మాయి జన్మించింది. నందనకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు 2011లో ఓ కచేరిలో పాల్గొనేందుకు చిత్ర దుబాయ్ వెళ్లారు. అదే సమయంలో నందన స్విమ్మింగ్ పూల్‌లో పడి మరణించింది.
#Nandana pic.twitter.com/mImedLHMdv
— K S Chithra (@KSChithra) April 14, 2024
Comments
Please login to add a commentAdd a comment