మెగాస్టార్ చిరంజీవి తన తండ్రికి నివాళులర్పించారు. చిరంజీవి(Chiranjeevi) తన తండ్రి వెంకట రావు వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మెగాస్టార్ చిరు తల్లి అంజనాదేవితో పాటు నాగబాబు దంపతులు ఆయన చిత్రపటానికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌లో షేర్ చేశారు. 'జన్మనిచ్చిన మహానీయుడిని ఆయన స్వర్గస్తులైన రోజున స్మరించుకుంటూ' అంటూ ఫోటోలు, వీడియోను పంచుకున్నారు.
కాగా.. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు మెగాస్టార్‌తో పాటు నాగబాబు, పవన్ కల్యాణ్, మాధవి, విజయ దుర్గ జన్మించారు. కాగా.. చిరంజీవి తండ్రి వెంకటరావు కానిస్టేబుల్‌గా పనిచేశారు.
కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర(vishwambhara) చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. విశ్వంభరలో చిరంజీవి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లోత్రిశూలంతో చిరంజీవి కనిపించారు. 'చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించిన సమయంలో ఒక అద్భుతమైన తార పోరాడేందుకు ప్రకాశిస్తుంది.' అని పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ తెలిపింది.
కాగా.. కోలీవుడ్ భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ వండర్‌లా ఉండబోతోందని గతంలోనే చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ… 🙏🙏 pic.twitter.com/MKxIw57pBZ
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 30, 2024
Comments
Please login to add a commentAdd a comment