Venkata Rao
-
అంబరాన్నంటిన సిరిమాను సంబరం
అంబరాన్ని తాకింది. ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే అమ్మవారి సిరిమానోత్సవం ఈ ఏడాది కూడా కనులపండువగా సాగింది. మంగళవారం మధ్యాహ్నం 3.26 గంటలకు ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి చదురుగుడి నుంచి కోట వరకు మూడుసార్లు సాగిన తిరువీధి ఉత్సవం సాయంత్రం 5.21 గంటలకు ముగిసింది. నెలరోజులపాటు నిర్వహించే వేడుకల్లో కీలక ఘట్టమైన సిరిమానోత్సవం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో బారులుతీరి అమ్మను దర్శించుకున్నారు. జిల్లాతోపాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన భక్తులు తరలివచ్చారు. వేకువజామున 3 గంటల నుంచి ప్రారంభమైన దర్శనాలు మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగాయి. పైడితల్లి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు కోట బురుజుపై నుంచి తిరువీధి ఉత్సవాన్ని తిలకించారు. డీసీసీబీ కార్యాలయం నుంచి శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వీక్షించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఉండి ఎమ్మెల్యే ఆర్.రఘురామకృష్ణరాజు తదితరులు సిరిమానోత్సవాన్ని తిలకించారు.– సాక్షి ప్రతినిధి, విజయనగరం -
పురందేశ్వరి వ్యాఖ్యలకు తలారి కౌంటర్
-
మోసం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
-
సీసీటీవీలో బయటపడ్డ టీడీపీ రౌడీలు దాడి..
-
కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితులు
సాక్షి, పాడేరు: పాడేరు ఘాట్ లోయలో ఆర్టీసీ బస్సు దూసుకుపోయిన ఘటనలో గాయపడిన ప్రయాణికులు కోలుకుంటున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో 21 మందికి నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన సేవలందుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, జిల్లా ఇన్చార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్లు.. కలెక్టర్, ఇతర వైద్య శాఖ అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్పర్సన్ గదల బంగారమ్మ, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ కణితి వెంకటరావులు ఆస్పత్రికి వెళ్లి బాధిత ప్రయాణికులను పరామర్శించారు. తీవ్ర గాయాలపాలైన బోడిరాజు, చిన్నమ్మలకు విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో ఉన్నత వైద్య సేవలు అందడంతో ప్రాణాపాయం తప్పిందని పాడేరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు చెప్పారు. మెడికవర్ ఆస్పత్రిలో బాధితులను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ శంకరరావు సోమవారం పరామర్శించారు. ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన తెలిపారు. ఆయా ఆస్పత్రుల్లో బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, పౌష్టికాహారం, ఇతర సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి కలెక్టర్ సుమిత్‌కుమార్, ఇతర అధికారులు నివేదికలు పంపుతున్నారు. ప్రయాణికులు కొండన్న, నారాయణమ్మల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
టీడీపీకి షాకిచ్చిన కొట్టే వెంకట్రావు దంపతులు
సాక్షి, మచిలీపట్నం: కొట్టే వెంకట్రావు దంపతులు టీడీపీకి షాక్ ఇచ్చారు. పార్టీ క్రియాశీలక పదవులకు రాజీనామా చేస్తూ అచ్చెన్నాయుడికి లేఖను పంపించారు. కొల్లు రవీంద్ర నిర్ణయాలు నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెంకట్రావ్ ప్రకటించారు. మచిలీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో వెంకట్రావు భార్యను టీడీపీ తరపున మేయర్ అభ్యర్ధిగా నారా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మచిలీపట్నం టీడీపీలో కొల్లు వర్సెస్ కొట్టే మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కొట్టే దంపతులకు కొల్లు రవీంద్ర సహకరించకపోవడంతో వారు గతంలో కూడా పలు మార్లు పార్టీ వీడే ప్రయత్నం చేశారు. చంద్రబాబు, లోకేష్ వద్దని వారించడంతో రాజీనామా నిర్ణయాన్ని వెంకట్రావు విరమించుకున్నారు. కొల్లు రవీంద్ర వైఖరితో విసిగిపోయిన కొట్టే వెంకట్రావు దంపతులు.. పార్టీని వీడారు. చదవండి: ఆంధ్రజ్యోతి సమర్పించు స్వర్గం నరకం -
ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
సాక్షి, గన్నవరం : ఆంధ్రప్రదేశ్‌కు సంజీవనిగా భావిస్తున్న ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసి వాటిని ఆమోదింప చేయించడం అభినందనీయమని ఆ పార్టీ సీనియర్ నేతలు యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావు అన్నారు. ఆదివారం గన్నవరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. 5 కోట్ల ఆంధ్రుల హక్కు ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు తమ పదవులు తృణప్రాయంగా వదులుకున్న ఐదుగురు ఎంపీలు నిజమైన నాయకులని కొనియాడారు. టీడీపీ ఎంపీలకు హోదా సాధనపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై తాము పోరాటం చేయడం లేదనడం టీడీపీ నేతల అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి వాటిని ఆమోదింపచేసుకోవడం టీడీపీ నేతలకు కనపడడం లేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేర్చుకున్న ముగ్గురు ఎంపీలు గురించి టీడీపీ నేతలు ఏమని బదులిస్తారంటూ నిలదీశారు. వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుటు దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం వైఫల్యం కారణంగా పవిత్ర సంగమం వద్ద నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి దారుణాలు జరగకుండా తక్షణమే హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అదే ప్రదేశంలో బోటు ప్రమాదం జరిగి 22 మంది మృతి చెందినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. నీటిలో మునిగి గల్లంతైన నలుగురు విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
కల నెరవేరెను..!
► మంత్రి హోదాలో జెడ్పీలో అడుగుపెట్టిన కళా వెంకటరావు ► ఎమ్మెల్యేగా దూరంగా ఉన్న వైనం అరసవల్లి(శ్రీకాకుళం): ‘‘జిల్లాలో దశాబ్దాల పాటు రాజకీయాలు నెరిపిన నేత ఆయన. విభిన్నమైన శైలితో ఉన్నత స్థానాలను దక్కించుకోవడం అతని ప్రత్యేకత. మనసులో ఏం అనుకున్నా...అది జరిగేంత వరకు బయట పడకుండా వ్యవహారం నడిపే నాయకుడాయన... ఆయనే తాజాగా విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు. అనుకున్నది ఎట్టకేలకు సాధించుకుని కల నెరవేర్చుకున్నారు’’. ఇంతకీ విషయం ఏమిటంటే! 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా గెలుపొందిన కళా ..జిల్లా పరిషత్‌లో ఇంతవరకు ఒక్కసారి కూడా అడుగుపెట్టలేదు. దీని వెనక పెద్ద కథే ఉంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్లోనే మంత్రి పదవి ఆశించినప్పటికీ.. కళాకు కాదని, ఆయన వ్యతిరేకవర్గ నేత అచ్చెన్నాయుడికి మంత్రి పదవి వరించింది. దీంతో కళాకు ఆశాభంగమే మిగిలింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజావసరాలు, బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి నిర్ణయాలు తీసుకునే కీలకమైన జనరల్ బాడీ, స్థాయీ సంఘ సమావేశాలు, బడ్జెట్, డీఆర్సీ తదితర సమావేశాలు జరుగుతుంటాయి. వీటికి తప్పనిసరిగా జిల్లాలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతి ఎమ్మెల్యే హాజరుకావాలి. తమ నియోజకవర్గంలో సమస్యలు తెలియజేయాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే హోదాతో జెడ్పీ సమావేశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ హాజరు కాకూడదని, ఎలాగైనా మంత్రిగానే వేదికపై కూర్చోవాలనే ప్రధాన లక్ష్యంగా మనస్సులో గట్టి నిర్ణయమే పెట్టుకున్నారట..కళా...! పైగా జెడ్పీలో జరిగే సమావేశాలకు మంత్రులు మాత్రమే ప్రధాన డయాస్‌లో కూర్చొనగా, ఎమ్మెల్యేలంతా క్రింద వరుసలోనే కేటాయించిన సీట్లలోనే కూర్చోవాల్సి ఉంది. ఇదే క్రమంలో తన వైరివర్గ నేత అచ్చెన్నాయుడు మంత్రిగా డయాస్ పైన కూర్చుంటే...సీనియర్‌గా ఉన్న తాను కింద వరుసలో కూర్చుని అతడి ఆదేశాలు పాటించడమా...అనేది కళా అవమానంగా భావించారని సన్నిహితుల ద్వారా తెలిసిన సమాచారం. దీంతో ఎలాగైనా తాను కూర్చుంటే డయాస్ పైనే కూర్చుంటానని, అంతవరకు జెడ్పీలో అడుగుపెట్టనని ఆయన పంతం పట్టారని అతని సన్నిహితులు చెబుతారు. మూడేళ్ల తర్వాత .. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత.. టీడీపీ అధికారం దక్కించుకున్న తర్వాత జెడ్పీలో ఈ మూడేళ్లలో 36 సమావేశాలు జరిగాయి. అయితే ఎమ్మెల్యేగా జెడ్పీలో గానీ, జెడ్పీ సమావేశాలకు గానీ ఒక్కసారి కూడా అడుగు పెట్టని కళా...సరిగ్గా మూడేళ్ల తర్వాత తాను అనుకున్నట్లుగానే మంత్రిగానే సోమవారం తొలి అడుగు వేశారు. వ్యూహాత్మకంగా సమావేశానికి ఆలస్యంగా వచ్చి, పెద్ద సంఖ్యలో తన అనుయాయులతో జెడ్పీలో అడుగుపెట్టారు. వచ్చీ రాగానే నేరుగా ప్రధాన వేదికపైకి ఎక్కి.. నవ్వుతూ అందరినీ ఆకర్షించారు. తొలిసారి జెడ్పీలో మంత్రిగా అడుగుపెట్టడం, అధికారులు, ప్రజాప్రతినిధుల సన్మానాలతో తన కల నెరవేరిందని చెప్పకనే చెప్పారు. ఇదిలావుంటే సోమవారం జెడ్పీలో జరిగే పంచాయితీరాజ్ దినోత్సవానికి మంత్రి కళా వస్తున్నారని తెలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అప్పటికప్పుడు వేరే ప్రోగ్రాం ఎంగేజ్ చేసుకున్నారని అధికారులు, కొందరు నేతలు చర్చించుకున్నారు. -
వారసత్వ ఉద్యోగాలపై చరిత్రాత్మక నిర్ణయం
ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే.. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ రెబ్బెన : 18 ఏళ్లుగా సింగరేణి కార్మికులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగాలపై సీఎం కేసీఆర్‌ది చరిత్రాత్మక నిర్ణయమని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్‌క్లబ్‌లో టీబీజీకేరియా ఏరియా సర్వసభ్య స మావేశం నిర్వహించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకట్రావ్ మాట్లాడుతూ సింగరేణిలో వీఆర్ఎస్ ఉద్యోగాలను రద్దు చేస్తూ జాతీ య సంఘాలు ఒప్పందాలు కుదుర్చుకుందని అన్నా రు. కేవలం కార్మికులు మరణిస్తే, మెడికల్ అన్‌ఫిట్ అ యితే తప్ప కార్మికులకు ఉద్యోగాలు దొరికే పరిస్థితులు లేకుండా పోయాయి. దేశంలో ఎక్కడ లేనివిధంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ రిటైర్ అయ్యే వరకు అందుతుందని తెలిపారు. జాతీయ సంఘాలు పొగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి పునరుద్ధరణకు అంగీకారం తెలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగం కోసం దరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలని సీఎండీని ఆదేశించారని తెలిపారు. కమ్యూనిస్టు యూనియన్లను భూస్థాపితం చేయాలి : ఎమ్మెల్సీ సతీశ్ కుమార్ కార్మికులను శ్రమదోపిడీకి గురిచేసే కమ్యూనిస్టు యూ నియన్లను వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ సంఘాలు కార్మికులను ఓట్ల వేసే యంత్రాలుగా మార్చుకుని ఎన్నికల్లో గెలిచిన అనంతరం యాజమాన్యానికి తొత్తులుగా మారుతున్నాయని విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలను కాలరాసిన కమ్యూనిస్టు సంఘాలు ఏ ముఖం పెట్టుకుని కార్మికులను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ను కార్మికులు గెలిపిస్తే ప్రభుత్వ అండతో మరిన్ని హక్కులను సాధిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఏరియాకు చెందిన కార్మికులు భారీస్థాయిలో టీబీజీకేఎస్‌లో చేరారు. ఈ సమావేశంలో రెబ్బెన, తాండూర్ జెడ్పీటీసీలు అజ్మీర బాబురావు, సురేష్‌బాబు, రెబ్బెన ఎంపీపీ సంజీవ్‌కుమార్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్ పర్సన్ శంకరమ్మ, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సదాశివ్, కేంద్రకమిటీ కార్యదర్శులు శ్రీనివాస్‌రావు, సత్యనారాయణ,ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఏరియా కార్యదర్శులు శంకరయ్య, శంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్ లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు. -
‘డిపెండెంట్’ రాకుండా కుట్ర
జేబీసీసీఐ నుంచి జేసీసీ స్థాయికి దిగజారిన వెంకట్రావు కార్మిక సమస్యల పరిష్కారంలో టీబీజీకేఎస్ విఫలం మణుగూరు : సింగరేణిలో మెడికల్ బోర్డులో అడ్డగోలుగా పైరవీలు చేసి డబ్బులు దండుకునేందుకే వారసత్వ ఉద్యోగాల స్కీం పునరుద్ధరించే విషయంలో యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురాకుండా గుర్తింపు సంఘం కుట్ర పన్నుతోందని హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించారు. మణుగూరు ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కుర్చీల కుమ్ములాటలతో కాలం గడిపిన టీబీజీకేఎస్ కార్మిక సమస్యల పరిష్కారంలో, హామీల అమలులో విఫలమైందన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణవాదంతో గెలిచిందని, ఇప్పుడు ఆ అవకాశం లేక ఐఎన్టీయూసీ, ఇతర సంఘాల వారిని చేర్చుకుంటూ మైండ్‌గేమ్ ఆడుతోందని అన్నారు. నాలుగేళ్లు గుర్తింపు సంఘంగా ఉండి కీలకమైన వారసత్వ ఉద్యోగాల స్కీంను రాకుండా చేశారన్నారు. ఈ స్కీం వస్తే మెడికల్ బోర్డు పేరుతో బేరాలు చేసుకునే అవకాశం పోతుందనే ఉద్దేశంతోనే కుట్ర పన్నారని విమర్శించారు. 2012-14 వరకు కెంగర్ల మల్లయ్య, 2014-16 వరకు కనకరాజు, మిరియాల రాజిరెడ్డి మెడికల్ బోర్డు ద్వారా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పనిచేశారని, ఇక తన పదవి కాపాడుకునేందుకే వెంకట్రావు టీబీజీకేఎస్‌లోకి ఫిరాయించారని ఆరోపించారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రావు కార్మిక సమస్యలపై శాసనమండలిలో చర్చించిన సందర్భం లేదన్నారు. ఆయన జేబీసీసీఐ నుంచి జేసీసీ స్థాయికి దిగజారారన్నారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో అన్ని సంఘాలు కలిసి సమ్మె నోటీసు ఇస్తే యాజమాన్యం దిగి వస్తుందని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులను అడిగితే వ్యంగ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మిరియాల రంగయ్య, సారయ్య రూ.3.5 కోట్లు క్రెడిట్ సొసైటీ డబ్బులు మింగాారని, అది నిరూపణ అయిందని చెప్పారు. ఐఎన్టీయూసీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఏరియాల్లో లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయని, అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలేయడంతో నిజాయతీ గల అధికారులు నిరుత్సాహపడుతున్నారని అన్నారు. అధికారులతో కలిసి దోపిడీ చేసే యూనియన్లకు గుణపాఠం చెప్పి, హెచ్ఎంఎస్ను గెలిపిస్తే కార్మికులకు మేలు కలుగుతుందన్నారు. -
హత్యకేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్
బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం అడవుల్లో ఈ నెల 16న(శనివారం) జరిగిన హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు తెలిపిన వివరాలు..బుట్టాయిగూడేనికి చెందిన పట్నం సింగరాజు అలియాస్ టైలర్ రాజు ఈ నెల 16న మరో ఆరుగురితో కలిసి మర్లగూడెం అడవుల్లో మద్యం సేవించారు. ఆ సమయంలో తలెత్తిన చిన్నపాటి ఘర్షణ టైలర్ రాజు హత్యకు దారితీసింది. రాజుతో పాటు మద్యం సేవించిన వారు కర్రతో కొట్టి రాజును హత్య చేశారు. అనంతరం తలను వేరు చేసి మర్లగూడెం అడవుల్లో పాతిపెట్టారు. మొండెంను జంగారెడ్డిగూడెం రజిక చెరువులో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అరెస్టయిన వారిలో సుంకర పవన్ కుమార్, ముక్క శ్రీను, అంబటి,అజయ్, షేక్ బాషా,తగరం అజయ్‌కుమార్, ఉసిరిక బాలాజీలు ఉన్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
ఇటిక్యాల వద్ద లారీ బోల్తా..వ్యక్తి మృతి
లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామం వద్ద ప్రధానరహదారిపై కంకరలోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వెంకట్రావు(55) అనే వ్యక్తి మృతిచెందాడు. వెంకట్రావు స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ గ్రామం. కూలీ పనుల నిమిత్తం ఇటిక్యాల వచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
ఏసీబీకి చిక్కిన ఎలక్ట్రికల్ తిమింగలం
రూ. 15 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన ఏఈ కాల్‌మనీతో లింకున్నట్లు ఏసీబీ పాథమిక విచారణలో వెల్లడి విజయవాడ సిటీ: భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టిన ఎలక్ట్రికల్ ఏఈని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడ మధురానగర్ విద్యుత్ సబ్ స్టేషన్లో సహాయక ఇంజినీరుగా పనిచేస్తున్న బొడ్డపాటి వెంకటరావు (46) అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మాచవరం డౌన్ బుల్లమ్మ వీధిలోని వెంకటరావు ఫ్లాటుతోపాటు సమీపంలో ఉండే అతని మామ, గుడివాడ సమీపంలోని దోసపాడులో ఉంటున్న తండ్రి, సోదరుని ఇళ్లల్లో కూడా ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.1.50 కోట్ల స్థిర, చర ఆస్తులున్నట్టు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.15కోట్లు ఉంటుందని అంచనా. 1992లో అసిస్టెంట్ లైన్మెన్గా విద్యుత్‌శాఖలో చేరిన వెంకటరావు అంచలంచెలుగా అసిస్టెంట్ ఇంజినీరు వరకు ఎదిగారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే సమాచారంతో కేసు నమోదు చేసి కోర్టు అనుమతితో దాడులు చేసినట్లు విజయవాడ రేంజ్ ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు. వెంకటరావు తను నివసిస్తున్న అపార్టుమెంట్లోనే మరో ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చాడు. వీటితో పాటు పటమట రామాలయం వీధిలోని శ్రీరాం టవర్స్‌లో రెండు ఫ్లాట్లు, గొల్లపూడిలో జాతీయ రహదారికి సమీపంలో ఖరీదైన త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాటు ఉన్నట్టు గుర్తించారు. దోసపాడు గ్రామంలో తనతో పాటు భార్య పేరిట చెరో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వేర్వేరు వ్యక్తులకు అప్పులు ఇచ్చినట్టుగా 25 ప్రామిసరీ నోట్లు ఇంట్లో లభ్యం కాగా, బ్యాంకు లాకరులో పలు పాసు పుస్తకాలు, చెక్కులు దొరికాయి. సమీపంలోని ఇతని మామ ఇంట్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.48 లక్షల విలువైన ఐదు టైటిల్ డీడ్స్, 10 చెక్కులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవికాక బ్యాంకులో తనఖా పెట్టిన అరకిలో బంగారంతో పాటు పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో వెంకటరావు కాల్‌మనీ వ్యాపారం కూడా చేస్తున్నట్టు గుర్తించారు. బాధితులు ముందుకు వస్తే తగిన విధంగా న్యాయం చేయనున్నట్టు డీఎస్పీ గోపాలకృష్ణ చెప్పారు. -
లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి
కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పంఘటన విశాఖ జిల్లా పాడేరు మండలం పోతురాజు గుడి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. నక్కలపుట్టుకు చెందిన సంతల వ్యాపారి పప్పు వెంకటరావు(55) కుటుంబ సభ్యులతో కలిసి కారులో విశాఖపట్నం వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. పోతురాజు గుడి సమీపంలో అదుపు తప్పి లోయాలోకి దూసుకెళ్లింది. దీంతో కారు నడుపుతున్న వెంకటరావు అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన భార్య పార్వతి, చెల్లెలు కొండమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
మిల్లు యజమాని ఆత్మహత్య
ప్రకాశం జిల్లా సంతమావులూరు గ్రామానికి చెందిన వెంకటరావు(40) అనే మిల్లు యజమాని అప్పుల బాధతో ఆదివారం ఆత్మహ త్య చేసుకున్నాడు. వెంకటరావు రెండు రోజులుగా అదృశ్యమయ్యాడు. అతను పిండి మిల్లును లీజుకు తీసుకుని నడిపించేవాడు. అప్పుల బాధ ఎక్కువై సతమతమయ్యేవాడు. ఈ నేపధ్యంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం అనుమానం వచ్చి మిల్లులోని గదిని తెరిచి చూడగా ఉరివేసుకుని శవమై కనిపించాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మాయలోడు..
- ఈ నెల 5న ఔటర్‌పై ప్రమాదంలో మృతి చెందిన వెంకటరావు - పలు జిల్లాల్లో చీటింగ్ కేసులు - మృతుడు ప్రకాశం జిల్లా వాసి శంషాబాద్ రూరల్: జల్సాలకు అలవాటు పడి భార్యా, పిల్లలను వదిలేశాడు.. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను మాయమాటలతో వలలో వేసుకోవడం.. కొన్ని నెలలు వారితో సంసారం చేసి వదిలేయడం.. అంతేకాదు డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకుని వారిని మోసం చేయడం అతని ప్రవృత్తి.. షిరిడీలో దైవ దర్శనం చేసుకుని వస్తూ మండల పరిధిలో ఔటర్ రింగు రోడ్డుపై ఈ నెల 5న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అతని పూర్తి వివరాలను శంషాబాద్ పోలీసులు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సీఐ ఉమామహేశ్వర్రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా కొండేపి మండలం దాసరిపాలెంకు చెందిన గుడిపాటి వెంకటరావు(36) అలియాస్ చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్ చందుకు 18 ఏళ్ల కిందట తన అక్క రమణమ్మ కూతురు మంగమ్మతో వివాహం జరిగింది. ఇతనికి ఇద్దరు కుమారులు. జులాయిగా తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఈ క్రమంలో 11 ఏళ్ల కిందట భార్యా,పిల్లలను వదిలేసి వచ్చాడు. జల్సాలకు అలవాటు పడిన వెంకట్రావు డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకోవడం, వ్యాపారంలో భాగస్వాములు కావాలని చెప్పి వారి నుంచి డబ్బులు కాజేయడం హాబీగా పెట్టుకున్నాడు. అవసరమైతే బెదిరింపులకు పాల్పడేవాడు. అంతేకాదు పేదింటి యువతులను మాయ మాటలతో తన వలలో వేసుకునేవాడు. యువతుల కుటుంబాలను తీర్థ యాత్రలకు తీసుకువెళ్లి మంచి అభిప్రాయం కలిగేలా ప్రవర్తించేవాడు. ఒకరి తర్వాత మరొకరిని వివాహం చేసుకుని, కొన్నాళ్లు సంసారం చేసేవాడు. ఇలా యువతులను వంచించడం, డబ్బుల కోసం మోసం చేయడం, వంటి 10 కేసుల్లో వెంకట్రావు నిందితుడు. కడప జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో పోలీసులను బురిడీ కొట్టించి తప్పించుకున్న ఘనుడు. ఈ ఘటనలో నలుగురు ఆర్ముడు రిజర్వు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు కూడా. ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, కడప, గుంటూరు ప్రాంతాల్లో ఇతనిపై కేసులు ఉన్నాయి. 2005లో ఒంగోలులో మొదటి సారి ఇతనిపై చీటింగ్ కేసు నమోదయింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంజీవ రావు, తులసి దంపతులతో పరిచయం చేసుకున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరు 18న వారిని బెదిరించి బంగారు నగలు,స్విఫ్ట్ కారు ఏపీ 04- ఏఆర్ 9015( ఔటర్‌పై ప్రమాదానికి గురైన కారు)ను లాక్కున్నాడు. దీనిపై రాజమండ్రిలో కేసునమోదైంది. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి మల్కాజిగిరిలోని హోమ్‌కేర్‌లో పనిచేస్తోంది. ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. తిరుపతమ్మ ఆలయం సమీపంలోని ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుకు చెందిన గదిని అద్దెకు తీసుకున్నాడు. నాగేశ్వరరావుతో పరిచయం పెంచుకున్నాడు. సంజీవరావు నుంచి లాక్కున్న కారు నంబరును ఏపీ 20-ఏఆర్ 5959గా మార్చాడు. నాగేశ్వర్రావు కుటుంబ సభ్యులతోపాటు, తనతో ఉండే యువతిని తీసుకుని 2న షిరిడీకి వెళ్లాడు. తిరిగి వస్తూ ఈ నెల 5వ తేదీ పెద్ద గోల్కొండ వద్ద జరిగిన ప్రమాదంలో వెంకటరావు మృతి చెందాడు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన శంషాబాద్పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మృతుడికి సంబంధించి పలు ఆసక్తి కరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈ కేసు ఛేదనలో కృషి చేసిన ఎస్ఐ శివకుమార్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
అత్తింటి వేధింపులకు మహిళ బలి
వట్టిగుడిపాడు (ఆగిరిపల్లి): అత్తింటివారి వేధింపులను తట్టుకోలేక ఓ వివాహిత ఆత్యహత్య చే సుకున్న సంఘటన మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వట్టిగుడిపాడుకు చెందిన కొలుసు వెంకటరామారావుతో చొప్పరమెట్ల శివారు తాడేపల్లికి చెందిన నరసమ్మ(28)కు 10 సంవత్సరాల క్రితం వి వాహమైంది. అప్పుడు వరకట్నంగా రూ.20 వేల నగదు, ఎకరం పొలా న్ని ఇచ్చారు. వీరికి ఇద్దరు ఆడపిల్ల లు ఉన్నారు. తనకు మగబిడ్డ కావాలని, అందుకోసం రెండో పెళ్లి చేసుకుంటానని వెంకట రామారావు భా ర్యను కొన్నినెలలుగా వేధిస్తున్నాడు. లేకుంటే అదనంగా కట్నం తీసుకురమ్మని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. భర్తతో పాటు మా మ ముక్కంటేశ్వరరావు, అత్త సీత మ్మ, బావ నాగేశ్వరరావు వేధిస్తున్నారని నరసమ్మ నెల రోజుల కిందట పుట్టింటివారికి ఫోన్ చేసి చెప్పింది. దీనిపై పుట్టింటి నుంచి బంధువులు వచ్చి సర్దుబాటు చేసి వెళ్లిపోయారు. అయినప్పటికీ నరసమ్మను భర్త, అత్తింటివారు వేధిస్తూనే ఉన్నారు. వీటిని భరించలేక శనివారం సా యంత్రం ఆమె ఇంట్లో ఉరివేసుకుని మరణించింది. ఈ ఘటనపై ఆమె తండ్రి తొందురు వెంకటసుబ్బారావు ఫిర్యాదు మేరకు వెంకటరామారావు, అతని తల్లిదండ్రులు, సోదరుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి.రాజేంద్రప్రసాద్ తెలిపారు. మృతదేహానికి ఇన్చార్జి వీఆర్వో పాములు పంచనామా నిర్వహించారు. అనంత రం పోస్టుమార్టం కోసం మృత దేహాన్ని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఆందోళన వట్టిగుడిపాడులో మృతురాలు నర సమ్మ బంధువులు ఆందోళన నిర్వహించారు. ఆమె ఇద్దరు ఆడపిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఎస్సై రాజేంద్రప్రసాద్ వచ్చి నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. -
30న ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష
నిమిషం ఆలస్యమైనా అనుమతించరు విశాఖపట్నం : ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షను ఈ నెల 30న నిర్వహించనున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ వెంకటరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 349 కేంద్రాలలో పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకూ పరీక్ష ఉంటుందని, పరీక్షకు నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించబోమని పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్‌టికెట్, పరీక్షా కేంద్రం, మెథడాలజీ వివరాలను అభ్యర్థులకు ఇదివరకే ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేశామన్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను ఠీఠీఠీ.్చఞ్ఛఛీఛ్ఛ్టి.ౌటజ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్షకు హాజరు కావాలన్నారు. ఉర్దూ మీడియం అభ్యర్థులకు కర్నూలు, హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎడ్‌సెట్‌కు ఈసారి మొత్తం 1,65,781 మంది విద్యార్థులు దరఖాస్తు చేసారని వెల్లడించారు. 30న సెట్ ఎంపిక: ఎడ్‌సెట్ 2014 పరీక్షకు సంబంధించిన సెట్ ఎంపిక కార్యక్రమం ఈ నెల 30న ఉదయం 6 గంటలకు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నిర్వహిస్తారు. -
ఉత్సాహంగా ఐక్య క్రిస్మస్
=కుంభా రవిబాబు ఆధ్వర్యంలో గద్యగుడలో నిర్వహణ =పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ చొక్కాకుల అరకులోయ, న్యూస్‌లైన్: మతం కన్నా మానవత్వం గొప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కుంభా రవిబాబు చెప్పారు. మానవత్వాన్ని ప్రబోధించిన క్రైస్తవ మతానికి అందుకే విశేష ఆదరణ లభించిందని తెలిపారు. మండలంలోని గద్యగుడ గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఐక్య క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. క్రైస్తవం మానవాళికి మంచి జీవన విధానాన్ని బోధించే మార్గమని తెలిపారు. మన్యంలో క్రైస్తవ మతం అభివృద్ధి చెందడం వల్ల చెడు వ్యసనాల నుంచి అనేక మంది బయట పడి తమ జీవితాలను చక్కదిద్దు కున్నారని ఆయన తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మన్యవాసులకు దైవ సందేశాన్ని వినిపిస్తున్న మత బోధకులకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం కేక్ కట్ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖ రూరల్ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావుకు, దైవ సేవకులకు తినిపించారు. సభలో చొక్కాకుల ప్రసంగిస్తూ క్రైస్తవులంతా ఒకే వేదికపైకి వచ్చి క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం అభినందనీయమని తెలిపారు. ఏటా రవిబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐక్య క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం ఆనందాయకమని చెప్పారు. పాస్టర్స్ ఫొలోషిఫ్ అధ్యక్షుడు జాన్ ప్రకాష్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విశాఖకు చెందిన మత బోధకుడు ప్రసంగికుడు స్టీవెన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన, రెవరెండ్ సంజీవ్ కుమార్, కొర్రా శెట్టి బాబురావు దైవ సందేశాన్ని అందించారు. ఎస్.కోట వైఎస్సార్ కాంగ్రెస్ నేత రాంనాయుడు, డాక్టర్ అజయ్, ఏయూ ప్రొఫెసర్లు అప్పారావు, అరుణ్ కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బి.బి జగ్గన్న, పాంగి చిన్నారావు, పల్టాసింగ్ విజయ్ కుమార్, పొద్దు అమ్మన్న, కొండలరావు, సొన్నాయి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్ మండలాల నుంచి పాస్టర్లు, క్రైస్తవులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.