30న ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష | On 30th ed-set Entrance Exam | Sakshi
Sakshi News home page

30న ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష

Published Wed, May 28 2014 1:43 AM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM

On 30th ed-set Entrance Exam

నిమిషం ఆలస్యమైనా అనుమతించరు

 విశాఖపట్నం : ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షను ఈ నెల 30న నిర్వహించనున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ వెంకటరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 349 కేంద్రాలలో పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకూ పరీక్ష ఉంటుందని, పరీక్షకు నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించబోమని పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్‌టికెట్, పరీక్షా కేంద్రం, మెథడాలజీ వివరాలను అభ్యర్థులకు ఇదివరకే ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేశామన్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను ఠీఠీఠీ.్చఞ్ఛఛీఛ్ఛ్టి.ౌటజ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని నేరుగా పరీక్షకు హాజరు కావాలన్నారు. ఉర్దూ మీడియం అభ్యర్థులకు కర్నూలు, హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఎడ్‌సెట్‌కు ఈసారి మొత్తం 1,65,781 మంది విద్యార్థులు దరఖాస్తు చేసారని వెల్లడించారు.

30న సెట్ ఎంపిక: ఎడ్‌సెట్ 2014 పరీక్షకు సంబంధించిన సెట్ ఎంపిక కార్యక్రమం ఈ నెల 30న ఉదయం 6 గంటలకు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement