ప్రకాశం జిల్లా సంతమావులూరు గ్రామానికి చెందిన వెంకటరావు(40) అనే మిల్లు యజమాని అప్పుల బాధతో ఆదివారం ఆత్మహ త్య చేసుకున్నాడు. వెంకటరావు రెండు రోజులుగా అదృశ్యమయ్యాడు. అతను పిండి మిల్లును లీజుకు తీసుకుని నడిపించేవాడు. అప్పుల బాధ ఎక్కువై సతమతమయ్యేవాడు.
ఈ నేపధ్యంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం అనుమానం వచ్చి మిల్లులోని గదిని తెరిచి చూడగా ఉరివేసుకుని శవమై కనిపించాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.