హత్యకేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్ | The six accused arrested in the murder case | Sakshi
Sakshi News home page

హత్యకేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్

Published Tue, Jul 19 2016 4:07 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

The six accused arrested in the murder case

బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం అడవుల్లో ఈ నెల 16న(శనివారం) జరిగిన హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు తెలిపిన వివరాలు..బుట్టాయిగూడేనికి చెందిన పట్నం సింగరాజు అలియాస్ టైలర్ రాజు ఈ నెల 16న మరో ఆరుగురితో కలిసి మర్లగూడెం అడవుల్లో మద్యం సేవించారు.

 

ఆ సమయంలో తలెత్తిన చిన్నపాటి ఘర్షణ టైలర్ రాజు హత్యకు దారితీసింది. రాజుతో పాటు మద్యం సేవించిన వారు కర్రతో కొట్టి రాజును హత్య చేశారు. అనంతరం తలను వేరు చేసి మర్లగూడెం అడవుల్లో పాతిపెట్టారు. మొండెంను జంగారెడ్డిగూడెం రజిక చెరువులో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అరెస్టయిన వారిలో సుంకర పవన్ కుమార్, ముక్క శ్రీను, అంబటి,అజయ్, షేక్ బాషా,తగరం అజయ్‌కుమార్, ఉసిరిక బాలాజీలు ఉన్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement