the murder case
-
హత్యకేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్
బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం అడవుల్లో ఈ నెల 16న(శనివారం) జరిగిన హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు తెలిపిన వివరాలు..బుట్టాయిగూడేనికి చెందిన పట్నం సింగరాజు అలియాస్ టైలర్ రాజు ఈ నెల 16న మరో ఆరుగురితో కలిసి మర్లగూడెం అడవుల్లో మద్యం సేవించారు. ఆ సమయంలో తలెత్తిన చిన్నపాటి ఘర్షణ టైలర్ రాజు హత్యకు దారితీసింది. రాజుతో పాటు మద్యం సేవించిన వారు కర్రతో కొట్టి రాజును హత్య చేశారు. అనంతరం తలను వేరు చేసి మర్లగూడెం అడవుల్లో పాతిపెట్టారు. మొండెంను జంగారెడ్డిగూడెం రజిక చెరువులో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అరెస్టయిన వారిలో సుంకర పవన్ కుమార్, ముక్క శ్రీను, అంబటి,అజయ్, షేక్ బాషా,తగరం అజయ్‌కుమార్, ఉసిరిక బాలాజీలు ఉన్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
పథకం ప్రకారమే వరలక్ష్మీదేవి హత్య
కొలిమిగుండ్ల: బెలుంకు చెందిన సింగనపల్లె వరలక్ష్మీదేవి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. నిందితుడిని బెలుం బస్టాప్ దగ్గర అరెస్ట్ చేశారు. భర్తతోపాటు మరో నిందితుడు పరారీలో ఉన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కోవెలకుంట్ల సీఐ నాగరాజుయాదవ్ ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. వరలక్ష్మీదేవి భర్త చంద్రశేఖరరెడ్డికి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. దీనిపై దంపతుల మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ క్రమంలో భార్యను ఎలాగైనా హతమార్చాలనే పథకం పన్నాడు. తన బంధువులైన బెలుం శింగవరానికి చెందిన పేరం రాంశంకరరెడ్డి, వైఎస్ఆర్ జిల్లా పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామానికి చెందిన కోటా వెంకటేశ్వరరెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంకటేశ్వరరెడ్డికి అడ్వాన్సుగా రూ.50వేలు ఇచ్చాడు. 2014 సెప్టంబర్ 25న చంద్రశేఖరరెడ్డి ఉదయం పని నిమిత్తం నంద్యాలకు బయలు దేరాడు. అతడు వెళ్లే విషయాన్ని రాంశంకరెడ్డికి చెప్పాడు. అతడు వెంకటేశ్వరరెడ్డికి చేరవేశాడు. అనంతరం వెంకటేశ్వరరెడ్డి బెలుంలోని చంద్రశేఖరరెడ్డి ఇంటికి వెళ్లాడు. వెంకటేశ్వరరెడ్డి బంధువు కావడంతో ఆమె సాధారణంగానే మాట్లాడింది. ఈ క్రమంలో తాగడానికి నీళ్లు అడిగాడు. ఆమె నీళ్లు తీసుకొచ్చేలోగా పొయ్యి వద్దనున్న కత్తి తీసుకున్నాడు. ఆమె దగ్గరికిరాగనే గొంతు కోసి చంపేశాడు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ఆమె మెడలోని బంగారు తాళిబొట్టును తీసుకున్నాడు. ఇనుపరాడ్‌తో బీరువాను పగులగొట్టి పరారయ్యూడు. ఆ తర్వాత భర్తే తన భార్యను ఎవరో హత్యచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో ముగ్గురూ నిందితులని తేలింది. వెంకటేశ్వరరెడ్డి నుంచి బంగారు తాళిబొట్టు గొలుసు, బైక్‌ను స్వాధీనం చేసుకుఆన్నరు. మృతురాలి భర్త చంద్రశేఖరరెడ్డి, బెలుం శింగవరానికి చెందిన రాంశంకరెడ్డి పరారీలో ఉన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ రాజ్‌కుమార్,సిబ్బంది రఫీ,గురుప్రసాద్ పాల్గొన్నారు.