
( ఫైల్ ఫోటో )
సాక్షి, మచిలీపట్నం: కొట్టే వెంకట్రావు దంపతులు టీడీపీకి షాక్ ఇచ్చారు. పార్టీ క్రియాశీలక పదవులకు రాజీనామా చేస్తూ అచ్చెన్నాయుడికి లేఖను పంపించారు. కొల్లు రవీంద్ర నిర్ణయాలు నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెంకట్రావ్ ప్రకటించారు.
మచిలీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో వెంకట్రావు భార్యను టీడీపీ తరపున మేయర్ అభ్యర్ధిగా నారా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మచిలీపట్నం టీడీపీలో కొల్లు వర్సెస్ కొట్టే మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కొట్టే దంపతులకు కొల్లు రవీంద్ర సహకరించకపోవడంతో వారు గతంలో కూడా పలు మార్లు పార్టీ వీడే ప్రయత్నం చేశారు. చంద్రబాబు, లోకేష్ వద్దని వారించడంతో రాజీనామా నిర్ణయాన్ని వెంకట్రావు విరమించుకున్నారు. కొల్లు రవీంద్ర వైఖరితో విసిగిపోయిన కొట్టే వెంకట్రావు దంపతులు.. పార్టీని వీడారు.
చదవండి: ఆంధ్రజ్యోతి సమర్పించు స్వర్గం నరకం
Comments
Please login to add a commentAdd a comment