వట్టిగుడిపాడు (ఆగిరిపల్లి): అత్తింటివారి వేధింపులను తట్టుకోలేక ఓ వివాహిత ఆత్యహత్య చే సుకున్న సంఘటన మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వట్టిగుడిపాడుకు చెందిన కొలుసు వెంకటరామారావుతో చొప్పరమెట్ల శివారు తాడేపల్లికి చెందిన నరసమ్మ(28)కు 10 సంవత్సరాల క్రితం వి వాహమైంది. అప్పుడు వరకట్నంగా రూ.20 వేల నగదు, ఎకరం పొలా న్ని ఇచ్చారు. వీరికి ఇద్దరు ఆడపిల్ల లు ఉన్నారు.
తనకు మగబిడ్డ కావాలని, అందుకోసం రెండో పెళ్లి చేసుకుంటానని వెంకట రామారావు భా ర్యను కొన్నినెలలుగా వేధిస్తున్నాడు. లేకుంటే అదనంగా కట్నం తీసుకురమ్మని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. భర్తతో పాటు మా మ ముక్కంటేశ్వరరావు, అత్త సీత మ్మ, బావ నాగేశ్వరరావు వేధిస్తున్నారని నరసమ్మ నెల రోజుల కిందట పుట్టింటివారికి ఫోన్ చేసి చెప్పింది. దీనిపై పుట్టింటి నుంచి బంధువులు వచ్చి సర్దుబాటు చేసి వెళ్లిపోయారు. అయినప్పటికీ నరసమ్మను భర్త, అత్తింటివారు వేధిస్తూనే ఉన్నారు.
వీటిని భరించలేక శనివారం సా యంత్రం ఆమె ఇంట్లో ఉరివేసుకుని మరణించింది. ఈ ఘటనపై ఆమె తండ్రి తొందురు వెంకటసుబ్బారావు ఫిర్యాదు మేరకు వెంకటరామారావు, అతని తల్లిదండ్రులు, సోదరుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి.రాజేంద్రప్రసాద్ తెలిపారు. మృతదేహానికి ఇన్‌చార్జి వీఆర్వో పాములు పంచనామా నిర్వహించారు. అనంత రం పోస్టుమార్టం కోసం మృత దేహాన్ని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
బంధువుల ఆందోళన
వట్టిగుడిపాడులో మృతురాలు నర సమ్మ బంధువులు ఆందోళన నిర్వహించారు. ఆమె ఇద్దరు ఆడపిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఎస్సై రాజేంద్రప్రసాద్ వచ్చి నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
అత్తింటి వేధింపులకు మహిళ బలి
Published Mon, Oct 20 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM
Advertisement