చంద్రబాబు మోసగించారు: నరసమ్మ | Woman Fire On Chandrababu Naidu Elections Meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మోసగించారు: నరసమ్మ

Published Mon, Apr 1 2019 8:05 AM | Last Updated on Mon, Apr 1 2019 8:12 AM

Woman Fire On Chandrababu Naidu Elections Meeting - Sakshi

సీఎం సభలో హల్‌ చల్‌ చేసిన అవ్వ నరసమ్మ

పుట్టపర్తి అర్బన్‌: పుట్టపర్తిలో మార్చి 28న జరిగిన సీఎం ఎన్నికల ప్రచార సభలో హల్‌చల్‌ చేసిన కొత్తచెరువు మండలం మీర్జాపురం అవ్వ నరసమ్మను ఆదివారం  ‘సాక్షి’ కలిసింది. టీడీపీదీ అంతా మోసమని.. తాను కూడా మోసపోయానని నరసమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సీఎం సభకు వస్తే మాకు రూ.5 వేలు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వాపోయింది.            

కాస్త వదులు ‘బాబూ’.. దిగిపోతా..!

ఏదో డబ్బులు వస్తాయని పోయాను తప్ప నాకు జగన్‌ అంటే అభిమానమని, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేస్తానని చెప్పింది. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో టీడీపీ నాయకుల గుట్టు రట్టయింది. డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించారని , అన్ని గ్రామాల నుండి డ్వాక్రా మహిళలను తరలించడంతో అంతమంది కనిపించారని ప్రజలు అంటున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి నామినేషన్‌కు అశేష జనవాహిని రావడం చూసిన టీడీపీ అభ్యర్థి .. సీఎం సభకు జనం రాకపోతే జనంలోకి చెడుగా మెసేజ్‌ పోతుందని భావించే డబ్బు విపరీతంగా వెదజల్లి జనాన్ని తరలించారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement