narasamma
-
చంద్రబాబు మోసగించారు: నరసమ్మ
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తిలో మార్చి 28న జరిగిన సీఎం ఎన్నికల ప్రచార సభలో హల్చల్ చేసిన కొత్తచెరువు మండలం మీర్జాపురం అవ్వ నరసమ్మను ఆదివారం ‘సాక్షి’ కలిసింది. టీడీపీదీ అంతా మోసమని.. తాను కూడా మోసపోయానని నరసమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సీఎం సభకు వస్తే మాకు రూ.5 వేలు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వాపోయింది. కాస్త వదులు ‘బాబూ’.. దిగిపోతా..! ఏదో డబ్బులు వస్తాయని పోయాను తప్ప నాకు జగన్ అంటే అభిమానమని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తానని చెప్పింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ నాయకుల గుట్టు రట్టయింది. డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించారని , అన్ని గ్రామాల నుండి డ్వాక్రా మహిళలను తరలించడంతో అంతమంది కనిపించారని ప్రజలు అంటున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి నామినేషన్‌కు అశేష జనవాహిని రావడం చూసిన టీడీపీ అభ్యర్థి .. సీఎం సభకు జనం రాకపోతే జనంలోకి చెడుగా మెసేజ్ పోతుందని భావించే డబ్బు విపరీతంగా వెదజల్లి జనాన్ని తరలించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
పదిహేను వేల కాన్పుల నర్స్‌అమ్మ
మొదట నరసమ్మ. తర్వాత డా‘‘ సులగట్టి నరసమ్మ. ఇటీవలి వరకు దాదాపు పదిహేను వేల సుఖ ప్రసవాలు చేశారు. డెబ్బయ్ ఎనిమిదేళ్ల క్రితం మొదటి ప్రసవం చేశారు. గ్రామానికి ప్రధాన మంత్రసాని అయ్యారు. ఏడు దశాబ్దాలుగా అదే వృత్తిలో కొనసాగారు. ఆవిడ హస్తవాసి మంచిదన్న పేరుంది. ఆ పేరును ఇక్కడే వదిలేసి, నరసమ్మ మూడు రోజుల క్రితం డిసెంబరు 25, 2018న నిండు వయసులో 98 సంవత్సరాలు పూర్తిచేసుకుని ఆ భగవంతుడి సన్నిధికి చేరుకున్నారు. నరసమ్మ పురుడు పోస్తే, సుఖప్రసవం కావడమే కాదు, ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారని గ్రామంలోని వారి నమ్మకం. నరసమ్మ దగ్గర ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఇన్నివేల పురుళ్లు పోసినా, ఒక్కరిదగ్గరా ఒక్క పైసా తీసుకోలేదు. స్వచ్ఛంద సేవ చేయడానికే ఇష్టపడ్డారు వృద్ధురాలైన నరసమ్మ. ఇన్ని సేవలు చేసినందుకే ఆవిడను ‘సులగట్టి’ బిరుదుతో సత్కరించారు. ఈ కన్నడ పదానికి ‘పురుడు పోయడం’ అని తెలుగు అర్థం. అయితే ఆమె జీవితాన్ని సరిగ్గా నిర్వచించాలంటే, ‘ఎన్నో కుటుంబాలో సంతోషాన్ని తీసుకువచ్చిన వ్యక్తి’. నరసమ్మ అమ్మమ్మ మార్గమ్మ కూడా ఆ రోజుల్లో మంత్రసానిగా పని చేశారు. ఆవిడ నుంచే ఈ విద్యను నేర్చుకున్నారు నరసమ్మ. సులువుగా పురుడు పోయడం కూడా అమ్మమ్మ దగ్గర నుంచే అబ్బింది. టుంకూరు జిల్లా పావ్‌గడ్ గ్రామంలో జన్మించారు నరసమ్మ. 2014లో కర్ణాటక టుంకూర్ విశ్వవిద్యాలయం నరసమ్మను డా. సులగట్టి నరసమ్మగా గౌరవించింది. ప్రసవాలు చేయడమే కాదు, చాలామందికి తన గుడిసెలో ఆశ్రయం కూడా ఇచ్చారు. అనేక సంచార జాతుల వారు ఈ గ్రామానికి వచ్చి ఆమె దగ్గర సేదతీరి వెళ్లేవారట. వారికి సహాయం చేయడమంటే నరసమ్మకు పరమానందమని ఆమె కుటుంబ సభ్యులు చెప్పుకుంటారు. గర్భిణుల కోసం ఆకులతో మందులు తయారు చేసేవారు నరసమ్మ. ఈ మందులే ఆమె విజయానికి కారణం అయ్యాయి. గర్భంలో ఉండే బిడ్డకు తల భాగం ఎక్కడ ఉంది, లోపల బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో కూడా చేతితో ముట్టుకుని చెప్పేవారు నరసమ్మ. ఈ ఏడాది ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఆరోగ్య రహస్యం నరసమ్మకు 12 మంది పిల్లలు, 22 మంది మనవలు. తాను ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాకుండా, అందరికీ సుఖప్రసవం చేశారు నరసమ్మ. చిరుధాన్యాలు మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. 90 సంవత్సరాల వయసులో కూడా ఆవిడకు కళ్లజోడు లేదు. శరీర భాగాలన్నీ ఆరోగ్యంగా పనిచేశాయి. బంగారంలాంటి మనసు ఆవిడది. తనకున్న పరిజ్ఞానంతో 180 మంది విద్యార్థులను పరీక్షలో ఉత్తీర్ణులను చేశారు. ఆఖరి అమ్మాయి జయమ్మను కూడా మిడ్‌వైఫ్‌ను చేశారు. – జయంతి -
మహామాతకు పద్మశ్రీ
సాక్షి, బెంగళూరు: ఆమె ఎన్నో వేల మందికి ప్రసవాలు చేసి తల్లీబిడ్డలకు ప్రాణాలు నిలిపింది. తల్లులకే తల్లిగా ప్రసిద్ధిచెందింది. కర్ణాటక మహామాతగా పేరుగాంచిన సూలగిత్తి నరసమ్మను పద్మశ్రీ పురస్కారం వరించింది. గురువారం ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 97 ఏళ్ల నరసమ్మ స్వస్థలం తుమకూరు జిల్లా పావుగడ తాలుకాలోని కృష్ణాపురం గ్రామం. ఆమె 70 ఏళ్లుగా సుమారు 15 వేల మందికి పైగా గర్భిణిలకు కాన్పులు చేశారు. ఒక్కరి నుంచి కూడా డబ్బు తీసుకోరు. తన చల్లని చేతులతో బిడ్డను తల్లి ఒడిలో పెట్టి మనసు నిండా సంతృప్తితో ఇంటిముఖం పడతారు. ఇటీవలే తుమకూరు విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఆమె తుమకూరు, చిత్రదుర్గం జిల్లాలతో పాటు అనంతపురం సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలకు పురుడు పోయడం గమనార్హం. మహామాత నరసమ్మ చేసిన ఘనమైన సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. -
కానుగ కాయల కోసం వెళ్లి..
లేపాక్షి (హిందూపురం) : కానుగ కాయల కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు చివరకు కానరాని లోకాలకు వెళ్లిన విషాదకర సంఘటన ఇది. లేపాక్షి మండలం నాయనిపల్లికి చెందిన నరసమ్మ(70) పొట్ట కూటి కోసం మూడ్రోజుల కిందట కానుగకాయలు తెచ్చి అమ్ముకునేందుకు వెళ్లిందని ఏఎస్ఐ సుబ్బరామ నాయక్ తెలిపారు. అయితే రాత్రైనా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారన్నారు. శిరివరం చెరువులో వృద్ధురాలి మృతదేహం తేలియాడుతుండగా బుధవారం రాత్రి గ్రామస్తులు కొందరు గమనించారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. గురువారం మృతదేహాన్ని వెలికితీశారు. నాయనిపల్లికి చెందిన నరసమ్మగా గుర్తించారు. కానుగకాయల కోసం వెళ్లిన ఆమె ఎండవేడిమికి తట్టుకోలేక కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ట్రాక్టర్ బోల్తా.. పెళ్లింట్లో విషాదం
కర్నూలు: మూడు ముళ్ల బంధం కోసం బయల్దేరిన పెళ్లి కూతురి తరఫు వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నరసమ్మ(55) అనే వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో పెళ్లింట్లో విషాదం అలముకుంది. జిల్లాలోని అస్పరి మండలం ములుగుందం గ్రామానికి చెందిన తిక్కయ్య కూతురు లక్ష్మికి పత్తికొండ మండలం అటికెలగుండు నాగేష్ కొడుకు రాజుతో వివాహం నిశ్చయమైంది. ఆదివారం పెళ్లి కొడుకు ఇంటికి తలంబ్రాలు తీసుకెళ్లాల్సివుండటంతో అమ్మాయి తరఫు వారు 40 మంది ట్రాక్టర్లో అటికెలగుండుకు బయల్దేరారు. ములుగుందం దాటిన తర్వాత కైరుప్పల పాఠశాల వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నరసమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పెళ్లి కూతురితో పాటు మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్ధితి విషమంగా ఉంది. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ ఆత్మహత్య
శింగనమల : అప్పుల బాధ తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆనందరావుపేటలో ఆదివారం చోటు చేసుకుంది. ఆనందరావుటకు చెందిన నారాయణ, నరసమ్మ(45) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులకు వివాహమైంది. వేరుగా కాపురం ఉంటున్నారు. మూడవ కుమారుడు చదువుకుంటున్నాడు. కుమార్తెకు 5 నెలల క్రితం వివాహం చేశారు. కుమార్తె వివాహంతో పాటు కుమారుల చదువు, పోషణ నిమిత్తం రూ. 2 లక్షల వరకు అప్పులు చేశారు. వీటితో పాటు వీరికి ఉన్న రెండు ఎకరాల పొలం మీద తరిమెల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లోనూ రుణం తెచ్చుకున్నారు. అప్పుల వాళ్లు ఒత్తిడి ఎక్కువవడంతో అప్పుల్లో పాలు పంచుకునేలా చూడాలంటూ రెండు రోజుల క్రితం శింగనమల పోలీసు స్టేషన్లో నరసమ్మ ఫిర్యాదు చేసింది. పోలీసులు పిలిపించి విచారించకనే శనివారం మధ్యాహ్నం విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఇంటి వద్ద నున్న భర్త నారాయణ పొలం వద్దకు వెళ్లడంతో రాత్రి ఎవరూ గుర్తించలేకపోయారు. ఆదివారం ఉదయం నరసమ్మ ఇంటి తలుపులు తీయకపోవడంతో చుట్టు పక్కల వారు ఇంటి తలుపులు తీయగా ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. ఏఎస్ఐ ఇక్బాల్ సంఘటన స్థలంకు వెళ్లి పరిశీలించి, పోస్టుమార్టం నిమితం శవాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
అత్తింటి వేధింపులకు మహిళ బలి
వట్టిగుడిపాడు (ఆగిరిపల్లి): అత్తింటివారి వేధింపులను తట్టుకోలేక ఓ వివాహిత ఆత్యహత్య చే సుకున్న సంఘటన మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వట్టిగుడిపాడుకు చెందిన కొలుసు వెంకటరామారావుతో చొప్పరమెట్ల శివారు తాడేపల్లికి చెందిన నరసమ్మ(28)కు 10 సంవత్సరాల క్రితం వి వాహమైంది. అప్పుడు వరకట్నంగా రూ.20 వేల నగదు, ఎకరం పొలా న్ని ఇచ్చారు. వీరికి ఇద్దరు ఆడపిల్ల లు ఉన్నారు. తనకు మగబిడ్డ కావాలని, అందుకోసం రెండో పెళ్లి చేసుకుంటానని వెంకట రామారావు భా ర్యను కొన్నినెలలుగా వేధిస్తున్నాడు. లేకుంటే అదనంగా కట్నం తీసుకురమ్మని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. భర్తతో పాటు మా మ ముక్కంటేశ్వరరావు, అత్త సీత మ్మ, బావ నాగేశ్వరరావు వేధిస్తున్నారని నరసమ్మ నెల రోజుల కిందట పుట్టింటివారికి ఫోన్ చేసి చెప్పింది. దీనిపై పుట్టింటి నుంచి బంధువులు వచ్చి సర్దుబాటు చేసి వెళ్లిపోయారు. అయినప్పటికీ నరసమ్మను భర్త, అత్తింటివారు వేధిస్తూనే ఉన్నారు. వీటిని భరించలేక శనివారం సా యంత్రం ఆమె ఇంట్లో ఉరివేసుకుని మరణించింది. ఈ ఘటనపై ఆమె తండ్రి తొందురు వెంకటసుబ్బారావు ఫిర్యాదు మేరకు వెంకటరామారావు, అతని తల్లిదండ్రులు, సోదరుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి.రాజేంద్రప్రసాద్ తెలిపారు. మృతదేహానికి ఇన్చార్జి వీఆర్వో పాములు పంచనామా నిర్వహించారు. అనంత రం పోస్టుమార్టం కోసం మృత దేహాన్ని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఆందోళన వట్టిగుడిపాడులో మృతురాలు నర సమ్మ బంధువులు ఆందోళన నిర్వహించారు. ఆమె ఇద్దరు ఆడపిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఎస్సై రాజేంద్రప్రసాద్ వచ్చి నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.