సాక్షి, బెంగళూరు: ఆమె ఎన్నో వేల మందికి ప్రసవాలు చేసి తల్లీబిడ్డలకు ప్రాణాలు నిలిపింది. తల్లులకే తల్లిగా ప్రసిద్ధిచెందింది. కర్ణాటక మహామాతగా పేరుగాంచిన సూలగిత్తి నరసమ్మను పద్మశ్రీ పురస్కారం వరించింది. గురువారం ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 97 ఏళ్ల నరసమ్మ స్వస్థలం తుమకూరు జిల్లా పావుగడ తాలుకాలోని కృష్ణాపురం గ్రామం. ఆమె 70 ఏళ్లుగా సుమారు 15 వేల మందికి పైగా గర్భిణిలకు కాన్పులు చేశారు. ఒక్కరి నుంచి కూడా డబ్బు తీసుకోరు.
తన చల్లని చేతులతో బిడ్డను తల్లి ఒడిలో పెట్టి మనసు నిండా సంతృప్తితో ఇంటిముఖం పడతారు. ఇటీవలే తుమకూరు విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఆమె తుమకూరు, చిత్రదుర్గం జిల్లాలతో పాటు అనంతపురం సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలకు పురుడు పోయడం గమనార్హం. మహామాత నరసమ్మ చేసిన ఘనమైన సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment