శింగనమల : అప్పుల బాధ తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆనందరావుపేటలో ఆదివారం చోటు చేసుకుంది. ఆనందరావుటకు చెందిన నారాయణ, నరసమ్మ(45) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులకు వివాహమైంది. వేరుగా కాపురం ఉంటున్నారు.
మూడవ కుమారుడు చదువుకుంటున్నాడు. కుమార్తెకు 5 నెలల క్రితం వివాహం చేశారు. కుమార్తె వివాహంతో పాటు కుమారుల చదువు, పోషణ నిమిత్తం రూ. 2 లక్షల వరకు అప్పులు చేశారు. వీటితో పాటు వీరికి ఉన్న రెండు ఎకరాల పొలం మీద తరిమెల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లోనూ రుణం తెచ్చుకున్నారు. అప్పుల వాళ్లు ఒత్తిడి ఎక్కువవడంతో అప్పుల్లో పాలు పంచుకునేలా చూడాలంటూ రెండు రోజుల క్రితం శింగనమల పోలీసు స్టేషన్‌లో నరసమ్మ ఫిర్యాదు చేసింది.
పోలీసులు పిలిపించి విచారించకనే శనివారం మధ్యాహ్నం విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఇంటి వద్ద నున్న భర్త నారాయణ పొలం వద్దకు వెళ్లడంతో రాత్రి ఎవరూ గుర్తించలేకపోయారు. ఆదివారం ఉదయం నరసమ్మ ఇంటి తలుపులు తీయకపోవడంతో చుట్టు పక్కల వారు ఇంటి తలుపులు తీయగా ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. ఏఎస్‌ఐ ఇక్బాల్ సంఘటన స్థలంకు వెళ్లి పరిశీలించి, పోస్టుమార్టం నిమితం శవాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మహిళ ఆత్మహత్య
Published Sun, Oct 2 2016 11:59 PM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement
Advertisement