కిమ్ జోంగ్ ఉన్ తండ్రి వర్ధంతి సందర్భంగా ఉత్తర కొరియా 11 రోజుల పాటు నవ్వడాన్ని నిషేధించింది. అంతేకాదు ఉత్తర కొరియా తన పౌరుల కోసం 11 రోజుల పాటు నవ్వడం, తాగడం, షాపింగ్ చేయడంపై కఠినమైన నిషేధాన్ని విధించింది. ఈ మేరకు డిసెంబర్ 17న ఉత్తర కొరియా మాజీ నాయకుడు కిమ్ జోంగ్-ఇల్ వర్ధంతిని పురస్కరించుకుని దేశంలో 11 రోజుల సంతాప దినాలు విధించారు. అయితే ఆ వ్యక్తి ఉత్తర కొరియా ప్రస్తుత నాయకుడు కిమ్ జోంగ్-ఉన్ తండ్రి.
(చదవండి: టెస్లా కారులో పుట్టిన తొలి పాపగా రికార్డు!!)
పైగా రేడియో ఫ్రీ ఆసియా కొరియన్ సర్వీస్ నివేదిక ప్రకారం సంతాప సమయంలో పౌరులు ఏ విధమైన వేడుకలు జరుపుకోవడం లేదా పాల్గొనడం నిషేధించారు. పైగా శోక సమయంలో మద్యం సేవించకూడదు నవ్వకూడదు లేదా విశ్రాంతి కార్యక్రమాలలో పాల్గొనకూడదట. ఈ మేరకు ఇది సాధారణంగా ప్రతి ఏడాది 10 రోజుల సంతాప దినం అయితే ఈ ఏడాది 2021 నాయకుడి మరణానికి 10 సంవత్సరాలు నిండినందున సంతాపాన్ని మరో రోజు పొడిగించారు.
అంతేకాదు ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే, అతను లేదా ఆమెను అరెస్టు చేయడమే కాక నేరస్థులుగా పరిగణించడం జరుగుతుంది. అంతేకాదు ఆ సమయంలో ఎవ్వరూ పుట్టిన రోజులు కూడా జరుపుకోరట. ఒకవేళ ఎవరి ఇంటిలోనైన వారి బంధువుల చనిపోతే గట్టిగా ఏడవకూడదు, పైగా ఆ సంతాపదినాలు పూరైన తర్వాత మాత్రమే ఆ మృతునికి సంబంధిచిన కార్యక్రమాలు చేయాలి. అంతేకాదు ఈ సంతాపదినాల్లో పౌరులెవ్వరూ నియమాలను ఉల్లంఘించకుండా చూడటమే పోలీసుల ప్రత్యేక విధి.
Comments
Please login to add a commentAdd a comment