వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఆసక్తికర పోటీ నడుస్తోంది. ప్రచారంలో కమలా హారీస్ దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు ట్రంప్‌పై కమల పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆగస్టులో ట్రంప్‌నకు వచ్చిన విరాళాల కంటే హారిస్ రెట్టింపు విరాళాలు సేకరించడం విశేషం.
కాగా, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక, తాజాగా ఆగస్టులో ట్రంప్‌నకు వచ్చిన విరాళాల కంటే హారిస్ రెట్టింపు విరాళాలు సేకరించడం గమనార్హం. ఇందులో భాగంగా కమలా హారీస్ ఆగస్టులో 30లక్షల మంది దాతల నుంచి 36.1కోట్ల డాలర్ల విరాళాలను సేకరించారు. ఇదే ఊపులో సెప్టెంబర్‌లో న్యూయార్క్, అట్లాంటా, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు హారిస్ బృందం ఏర్పాట్లు చేస్తోంది.
మరోవైపు.. ట్రంప్ మాత్రం కమలా హారీస్‌తో పోల్చుకుంటే కొంత వెనుకంజలో ఉన్నారు. ట్రంప్ ఆగస్టులో కేవలం 13కోట్ల డాలర్లను మాత్రమే సేకరించినట్లు ఆయన బృందం వెల్లడించింది. ఈ క్రమంలో ట్రంప్ కంటే కమలకు.. దాదాపు మూడు రెట్లు ఎక్కువ విరాళాలు వచ్చాయి. ఇక, డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కమలా హారీస్ పూర్తి స్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment