
దక్షిణ కరోలినాలో హిల్లరీ ఘన విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ టికెట్ కోసం బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ ముందుకు దూసుకుపోతున్నారు.
కొలంబియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ టికెట్ కోసం బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ ముందుకు దూసుకుపోతున్నారు. అయోవా, నెవడాలో గెలిచిన హిల్లరీ ఇప్పుడు దక్షిణ కరోలినా ప్రైమరీలో ఘనవిజయం సాధించారు. దక్షిణ కరోలినా డెమొక్రటిక్ పార్టీలో ఎక్కువగా ఉండే నల్లజాతి ఓటర్లలో ప్రతి పదిమందిలో 8 మంది హిల్లరీకి ఓటేశారు.
పనిలో పనిగా రిపబ్లికన్ పార్టీ టికెట్ రేసులో దూసుకెళ్తున్న డోనాల్డ్ ట్రంప్‌పై ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. గౌరవాన్ని ఇచ్చి, పుచ్చుకుందామని, అమెరికాను కొత్తగా గొప్పదేశంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఇప్పడు లేదని ట్రంప్‌ను ఉద్దేశించి అన్నారు.