Live Updates
US Elections: కొనసాగుతున్న పోలింగ్.. రిజల్ట్ ఎప్పుడంటే?
అమెరికా ఎన్నికలు.. ఓటర్లకు కమల విజ్ఞప్తి
- అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
- పలు చోట్ల ఓటర్లు.. క్యూలైన్‌లలో ఓటు వేసేందుకు నిల్చున్నారు.
- ఓటు వేయాలని ఓటర్లకు కమల విజ్ఞప్తి చేశారు.
- ‘‘ఎన్నికల రోజు( నవంబర్ 5) వచ్చింది. ఈ రోజు మనం మన దేశాన్ని ప్రేమిస్తున్నాం. అమెరికా వాగ్దానాన్ని నమ్ముతాం. కాబట్టి ఓటు వేసి.. మీ గళాన్ని వినిపించండి’’ అని అన్నారు.
అమెరికా ఎన్నికలు.. ఫలితాల వెల్లడి ఎప్పుడు?
- అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది
- పలు రాష్ట్రాలో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.
- అమెరికా ఎన్నికల విధానం ప్రకారం.. పోలింగ్ బూత్‌లు మూసివేసిన వెంటనే ఎన్నికల ఫలితాలు, ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
- భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం ఫలితాలు వెల్లడికానున్నాయి.
అమెరికా ఎన్నికలు.. సరిగ్గా ఇదే తేదీన విషాదం
- అమెరికాలో కొనసాగుతున్న 47వ అధ్యక్ష ఎన్నికల పోలింగ్
- 150 ఏళ్ల కిందట ఇదే తేదీన విషాద ఘటన
- అమెరికాలో 1872 నాటి అధ్యక్ష ఎన్నికలు సైతం నవంబర్ 5వ తేదీన జరిగాయి.
- ఈ రోజు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో ఓ ప్రధాన అభ్యర్థి మృతిచెందారు.
కొనసాగుతున్న పోలింగ్
- గత ఎన్నికల్లో కేవలం 66 శాతమే నమోదైన పోలింగ్
- ఈసారి ఎన్నికల్లో నిలబడ్డ ఆరుగురు అభ్యర్థులు
- ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరి మధ్యే నెలకొన్న పోటీ
- ట్రంప్-హారిస్ మధ్య పోటీతో అమెరికన్ల తీర్పు ఎలా ఉండనుందనే ఉత్కంఠ
- కనెక్టికట్, ఇండియానా, కెంటకీ, న్యూజెర్సీ, మెయినే, న్యూహాంప్సైర్, న్యూయార్క్ వర్జీనీయాలో కొనసాగుతున్న పోలింగ్
- పోలింగ్ స్టేషన్ల వద్దకు భారీగా చేరుకుంటున్న ఓటర్లు
- రేపు ఉదయం కూడా కొనసాగనున్న పోలింగ్
- పోలింగ్ అయిన వెంటనే ప్రారంభం కానున్న కౌంటింగ్
- రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి కల్లా ఫలితంపై రానున్న స్పష్టత
బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ ప్రక్రియ
- బ్యాలెట్ పేపర్ విధానంలోనే జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్
- హ్యాండ్‌మార్క్‌డ్ పేపర్ బ్యాలెట్స్ ద్వారా కొందరు, బ్యాలెట్ మార్కింగ్ డివైజ్(BMD)లతో కూడిన పేపర్‌బ్యాలెట్‌తో మరికొందరు ఓటేసే ఛాన్స్
- బీఎండీ డిజిటల్ బ్యాలెట్.. ఓటేసి అప్పటికప్పుడే ప్రింట్ తీసుకునే వెసులుబాటు
- ఈవీఎంల తరహా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్(DRE) ద్వారా కేవలం ఐదు శాతం ఓటేసే ఛాన్స్
- హ్యాకింగ్ ఆరోపణలు, ట్యాంపరింగ్ అనుమానాల నేపథ్యంలోనే డీఆర్‌ఈలకు అమెరికా ఓటర్లు దూరం
ప్రారంభమైన అధ్యక్ష ఎన్నికల పోలింగ్
- అమెరికాలో ప్రారంభమైన అధ్యక్ష ఎన్నికల పోలింగ్
- పలు రాష్ట్రాల్లో పోలింగ్ స్టేషన్ల ముందు బారులుతీరిన ఓటర్లు
- భారత కాలమానం ప్రకారం.. బుధవారం వేకువజాము వరకు పోలింగ్ జరిగే అవకాశం
- డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లిక్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
- ఎలక్టర్లకు ఓటేయనున్న ఓటర్లు
- ఇద్దరిలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోనున్న ఎలక్టర్లు
ఒకవేళ టై అయితే గనుక
- అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అభ్యర్థుల్లో ఒకరికి 270 ఓట్లు(ఎలక్టోరల్ ఓట్లు) రావాలి. అలాగే.. ఇద్దరికీ చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)పై పడుతుంది.
- దిగువ సభ అయిన ప్రతినిధుల సభ(House Of Representatives) అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకోసం జనవరి 6న సమావేశమవుతుంది. ఈ విధానంలో.. ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26 లేదంటే అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్షుడవుతారు.
- ఇక.. ఉపాధ్యక్ష ఎన్నికలో ఫలితం తేలని పక్షంలో ఎగువ సభ అయిన సెనేట్ ఉపాధ్యక్షున్ని ఎన్నుకుంటుంది. 100 సెనేట్ ఓట్లలో కనీసం 51 లేదా అంతకంటే ఎక్కువ సాధించేవారు విజేత అవుతారు.
- రెండు శతాబ్దాల కింద, అంటే 1800లో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. థామస్ జెఫర్సన్, ఆరన్ బ్లర్ ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో ప్రతినిధుల సభ ఓటింగ్‌లో జెఫర్సన్ విజేతగా నిలిచారు.
ఎవరు గెలిచినా సరే.. భారత్ రియాక్షన్ ఇది
- అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రపంచం
- అగ్రరాజ్య ఎన్నికలపై స్పందించిన భారత్
- ట్రంప్-హారిస్‌లలో ఎవరు గెలవొచ్చనే అంతటా చర్చా
- ఎవరు గెలిచినా.. ఫలితం ఎలా ఉన్నా.. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని భారత్ విశ్వాసం
- ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయని ఉద్ఘాటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్
- అమెరికాలో ట్రంప్‌తో సహా గత ఐదు ప్రభుత్వాల హయాంలో భారత్ సత్సంబంధాలు కొనసాగించింది
- ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇరుదేశాల మధ్య స్నేహబంధం పురోగతి సాధిస్తుందని ఆశిస్తున్నా
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఎప్పుడంటే..
- యూఎస్‌ఏ కాలమానం ప్రకారం.. రాష్ట్రాలవారీగా మంగళవారం ఉదయం 7–9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగుతుంది
- భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 9.30 మధ్య పోలింగ్ మొదలై.. బుధవారం ఉదయం దాకా
కొనసాగుతుంది - భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక.. పోలింగ్ జరుగుతున్న టైంలోనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి అవుతాయి
- ఎన్నికల ఫలితాలు.. మంగళవారం పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే, బుధవారం ఉదయం నుంచే తెలిసే అవకాశం ఉంది. లేదంటే నెల.. వారాలు పట్టే అవకాశమూ లేకపోలేదు.
- అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొత్తం జాతీయ ఓట్ల ద్వారా కాకుండా ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల వ్యవస్థ ద్వారా జరుగుతాయి.
- ప్రజలు ఎలక్టర్లకు ఓటేస్తే.. వాళ్లు అధ్యక్షుడ్ని తమ ఓటేసి ఎన్నుకుంటారు
- ఎలక్టర్‌లు అధ్యక్ష అభ్యర్థికి ఓటేసేది డిసెంబర్ 16వ తేదీన!
- జనవరి 6వ తేదీన ఫలితం, 20వ తేదీన ప్రమాణస్వీకారం ఉండనుంది.
ముందస్తు ఓటింగ్‌కు సగం ఓటర్లు!
- అమెరికాలో మొత్తం 24.4 కోట్ల మంది ఓటర్లు
- ఓటింగ్‌కు నమోదు చేసుకుంది కేవలం 16 కోట్ల మంది మాత్రమే
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ దఫా ముందస్తు ఓటింగ్‌కు వెల్లువెత్తిన ఓటర్లు
- ముందస్తు ఓటింగ్‌లో ఇప్పటికే న్యూయార్క్ రికార్డు సృష్టించిందని బోర్డు ఆఫ్ ఎలక్షన్స్ కార్యాలయం ప్రకటన
- ఇప్పటికే 8.2 కోట్ల మంది మెయిళ్ల ద్వారా, పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటు హక్కు వినియోగం
- భారీ క్యూ ఉండొచ్చనే అంచనాలు, ఇతరత్రా పోలింగ్ తిప్పలు తప్పించుకునేందుకు ముందస్తు ఓటు హక్కు వినియోగించుకున్న అమెరికన్లు
- మిగిలిన సగం కాసేపట్లో మొదలుకానున్న పోలింగ్ ద్వారా ఓటేయనున్నారు
తొలి ఫలితం వచ్చేసింది!
- న్యూహ్యాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం వెల్లడి
- న్యూహ్యాంప్‌షైర్ ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఇక్కడ అర్థరాత్రి మొదలైన పోలింగ్
- డిక్స్‌విల్లే నాచ్‌లో ఆరుగురు ఓటర్లు
- కమలా, ట్రంప్‌నకు మూడు చొప్పున ఓట్లు
- 2020లో జో బైడెన్ వైపు మొగ్గుచూపిన డిక్స్‌విల్లే నాచ్ ఓటర్లు
చివరి సర్వేల్లో.. పుంజుకున్న కమలా హారిస్
అమెరికా ఎన్నికల్లో తుది ప్రచారం ముగిసింది. న్యూహాంప్‌షైర్ వంటి రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే పోలింగ్ మొదలైంది. చివరి సర్వేల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. డొనాల్ట్ ట్రంప్ నిన్నటిదాకా ఆధిక్యంలో ఉన్న కొన్ని చోట్ల.. ఇప్పుడు కమలా హారిస్ తెలుస్తోంది.