Top Stories
ప్రధాన వార్తలు

ఇంకా 6 నెలలు ఎలా అడుగుతారు?.. ‘అనర్హత’పై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీం కోర్టు విచారణ జరుగుతోంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌తో కూడిన ధర్మాసనం బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు వింటోంది. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. అనర్హత పిటిషన్లపై విచారణకు మీకు ఎంత సమయం కావాలి?: జస్టిస్ బీఆర్ గవాయ్ బెంచ్ఒక్క మాటలో చెప్పాలంటే ఆరు నెలల సమయం కావాలి: న్యాయవాది సింఘ్వీఇప్పటికే 14 నెలల సమయం వృథా అయ్యింది : జస్టిస్ గవాయ్ బెంచ్మరో ఆరు నెలలు ఎలా అడుగుతారు?: జస్టిస్ గవాయ్ బెంచ్తెలంగాణలో కారు పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతరులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం ఇదివరకే వాదనలు వినిపించగా.. నిన్న(బుధవారం) తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు పూర్తి చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు శాసించలేవని.. కోర్టులకు కేవలం నిర్ణయాలను సమీక్షించే అవకాశం ఉందని.. ఈ కేసులో స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే న్యాయ సమీక్ష ఎలా వర్తిస్తుంది? అని రోహత్గి వాదించారు. అయితే.. అనర్హత పిటిషన్ లపై స్పీకర్ చర్యలు తీసుకోకుండా ఉంటే తాము చూస్తూ ఊరుకోవాలా? అని సుప్రీం ప్రశ్నించింది. అయితే.. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని పార్లమెంటు భావించలేదు కాబట్టి 10వ షెడ్యూల్ కు సవరణ చేయలేదని, ఈ అంశాన్ని శాసన వ్యవస్థకు వదిలిపెట్టాలని బెంచ్‌ను కోరారు. అయితే.. ఫిరాయింపులను నిరోధించేందుకు పదో షెడ్యూల్ తెచ్చారని... దాన్ని కాపాడడంలో కోర్టులు ముందుకెళ్లడం రాజ్యాంగబద్ధమేనని సుప్రీం కోర్టు పేర్కొంది. పార్లమెంటు పరిగణలోకి తీసుకోలేదని అప్పటిదాకా కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవాలా? అని ప్రశ్నించించింది.

ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
న్యూఢిల్లీ, సాక్షి: లిబరేషన్ డే పేరిట.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ‘సుంకాల బాంబు’ పేల్చారు. ఈ క్రమంలోనే భారత్‌పై 26శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రకటించారు. దీంతో ట్రంప్ నిర్ణయంపై భారత్‌లో విశ్లేషణ మొదలైంది. అయితే ఇదేం మన దేశానికి ఎదురుదెబ్బ కాదంట!. ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల(reciprocal tariffs) ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. అయితే, ఇక్కడో మార్గం లేకపోలేదు. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే.. ఆ దేశంపై సుంకాల (Tariffs) తగ్గింపును ట్రంప్ ప్రభుత్వం పునఃపరిశీలించే నిబంధన కూడా ఉంది. కాబట్టి ఇది మిశ్రమ ఫలితమే అవుతుంది తప్ప.. భారత్‌కు ఎదురుదెబ్బ కాదు అని కేంద్ర వాణిజ్య శాఖలోని ఓ సీనియర్ అధికారి అంటున్నారు.ఎప్పటి నుంచి అమలు.. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో..) ట్రంప్ ప్రతీకార సుంకాలపై ప్రకటన చేశారు. తాను విధించిన టారిఫ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ అన్నారు. కానీ, 26 శాతం టారిఫ్‌లో.. 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు అంటున్నాయి. మిగతా 16 శాతం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చెబుతోంది. లిబరేషన్ డే పేరిట ట్రంప్ చేసిన ప్రకటన సారాంశం.. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చు. అయితే కనీసం 10% సుంకం చెల్లించాల్సిందే. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం.. ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర విధిస్తున్నాం. భారత్ మా ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, మేం 26% సుంకం విధిస్తున్నాం. ఇదిలా ఉంటే.. ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన చేసే వేళ భారత ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు.ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనకు ముందు గతంలో భారతీయ దిగుమతులపై అమెరికా చాలా తక్కువ సుంకాలను విధిస్తూ వచ్చింది. విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై కేవలం 2.5% సుంకాలను, దిగుమతి చేసుకున్న మోటార్‌సైకిళ్లపై 2.4% సుంకాలను మాత్రమే విధించాయి. అయితే భారత్ మాత్రం అమెరికా వస్తువులపై 52% సుంకాలను వసూలు చేస్తోందన్నది ట్రంప్ వాదన.నీ క్రమంలోనే ఇప్పుడు 26 శాతం టారిఫ్‌ను ప్రకటించారు.

వివాహ వేడుకలో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశీర్వాదం
సాక్షి, తాడేపల్లి/కర్నూలు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు చేరుకున్నారు. జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో కుడా మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకులు కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధువరులు శ్రేయ, వివేకానందలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. ఈ వేడుకలు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.

ఏడేళ్లు ఆర్సీబీకి ఆడాను.. అందుకే అలా సెలబ్రేట్ చేసుకున్నా: సిరాజ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జైత్రయాత్రకు గుజరాత్ టైటాన్స్ (GT) అడ్డుకట్ట వేసింది. ఆర్సీబీని వారి సొంత మైదానంలోనే ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఫలితంగా ఐపీఎల్-2025లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన బెంగళూరు జట్టు ఖాతాలో తొలి పరాజయం నమోదు కాగా.. టైటాన్స్‌కు వరుసగా రెండో విజయం లభించింది.ఇక ఆర్సీబీపై టైటాన్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అతడు భావోద్వేగానికి లోనయ్యాడు. ఏడేళ్ల పాటు ప్రాతినిథ్యం వహించిన జట్టుపై ఇలాంటి ప్రదర్శన నమోదు చేయడం మిశ్రమ అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నాడు.భావోద్వేగానికి గురి చేసింది‘‘నేను కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. ఏడేళ్ల పాటు ఇక్కడే (ఆర్సీబీ) ఉన్నాను. రెడ్ జెర్సీ నుంచి బ్లూ జెర్సీకి మారటం నన్ను భావోద్వేగానికి గురి చేసింది. అయితే, బంతి చేతిలోకి రాగానే నా మూడ్ మారిపోయింది.చాలా రోజులుగా ఆటతో నేను బిజీగానే ఉన్నాను. అయితే, అనుకోకుండా లభించిన విశ్రాంతి కారణంగా.. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడంతో పాటు బౌలింగ్‌లో నా తప్పులను సరిదిద్దుకునేందుకు కావాల్సినంత సమయం దొరికింది. వేలంలో గుజరాత్ టైటాన్స్ నన్ను కొనుగోలు చేయగానే.. మొదట ఆశిష్ (ఆశిష్ నెహ్రా) భాయ్‌తో మాట్లాడాను.బౌలింగ్‌ను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లాలని.. ఇతర విషయాలను పట్టించుకోవద్దని ఆయన నాకు చెప్పాడు. అదే విధంగా.. ఇషూ భాయ్ (ఇషాంత్ శర్మ) కూడా లైన్ అండ్ లెంగ్త్ తప్పవద్దని నాకు సూచించాడు. వారు నాలో ఆత్మవిశ్వాసం నింపారు.పిచ్ ఎలా ఉన్నా.. పర్లేదు మనపై మనకు నమ్మకం ఉన్నపుడు పిచ్ పరిస్థితులు మన ప్రదర్శనను ప్రభావితం చేయలేవు. నేను రొనాల్డో అభిమానిని. కాబట్టే వికెట్ తీసిన ప్రతిసారీ అలా సెలబ్రేట్ చేసుకున్నా’’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.A Phil Salt orbiter 🚀followed by...A Mohd. Siraj Special \|/ 🫡It's all happening in Bengaluru 🔥Updates ▶ https://t.co/teSEWkWPWL #TATAIPL | #RCBvGT | @mdsirajofficial pic.twitter.com/a8whsXHId3— IndianPremierLeague (@IPL) April 2, 2025 సిరాజ్ పేస్ పదును.. ఆర్సీబీకి షాకులుఈ క్రమంలో ఆరంభంలోనే ఓపెనర్ విరాట్ కోహ్లి (7)ని అర్షద్ ఖాన్ వెనక్కి పంపగా.. అతడి స్థానంలో వచ్చిన దేవదత్ పడిక్కల్‌ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఫిల్ సాల్ట్ (14)ను కూడా అదే రీతిలో పెవిలియన్‌కు పంపాడు.ఇలా టాపార్డర్ కుప్పకూలడంతో ఆర్సీబీ కష్టాల్లో కూరుకుపోగా.. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రజత్ పాటిదార్ (12) కూడా తక్కువ స్కోరుకే అవుట్ కావడం ప్రభావం చూపింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో అతడు లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగగా.. లియామ్ లివింగ్ స్టోన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 40 బంతుల్లో 54 పరుగులతో లియామ్ జోరు మీదున్న వేళ సిరాజ్ మరోసారి తన పేస్ పదును చూపించి.. ఆర్సీబీని దెబ్బకొట్టాడు.ఇక వికెట కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (21 బంతుల్లో 33) వేగంగా ఆడే ప్రయత్నం చేయగా.. సాయి కిషోర్ అతడిని అవుట్ చేశాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపులు (18 బంతుల్లో 32) మెరిపించగా.. ప్రసిద్ కృష్ణ అతడి జోరుకు అడ్డుకట్ట వేశాడు. మిగతా వాళ్లలో కృనాల్ పాండ్యా (5), భువనేశ్వర్ కుమార్ (1 నాటౌట్) విఫలం కాగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.సిరాజ్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ ఒక్కో వికెట్‌తో రాణించారు. సాయి కిషోర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక లక్ష్య ఛేదనలో టైటాన్స్ ఆరంభంలోనే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (14) వికెట్ కోల్పోయింది.బట్లర్ ధనాధన్అయితే, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49)కు జతైన వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 73 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడితో పాటు షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (18 బంతుల్లో 30) వేగంగా ఆడి.. సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో 17.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి టైటాన్స్ పని పూర్తి చేసింది.రూ. 12.25 కోట్లకు కొనుగోలుఇదిలా ఉంటే.. సిరాజ్ ఏడేళ్ల పాటు ఆర్సీబీకి ఆడిన విషయం తెలిసిందే. అయితే, మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ అతడిని విడిచిపెట్టింది. వేలంపాటలోనూ సిరాజ్‌పై ఆర్సీబీ ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది.ఇక ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో సిరాజ్ విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో సెలక్టర్లు అతడికి చోటివ్వలేదు. మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు పెద్దపీట వేసి.. సిరాజ్‌ను తప్పించారు. దీంతో సిరాజ్‌కు విరామం లభించగా.. ఫిట్నెస్ మెరుగుపరచుకుని.. మరింత కఠినంగా సాధన చేశాడు. చదవండి: భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల

కంచ గచ్చిబౌలి భూములు ఎవరూ కొనద్దు: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో తెలంగాణ సర్కార్ తీరు దారుణంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు ముందుకు పోతున్నారు? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారాయన. గురువారం ఉదయం తెలంగాణ భవన్లో హెచ్‌సీయూ(HCU) భూముల ఆందోళనలపై కేటీఆర్ మాట్లాడారు. .. పేరుకే ప్రజా పాలన.. ఎక్కడా ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించడం లేదు. హైదరాబాద్ భవిష్యత్తు కోసం విద్యార్థులు కొట్లాడుతున్నారు. విద్యార్థుల ఆందోళనను సర్కార్ పట్టించుకోవడం లేదు. ప్రజా పాలన అంటే విద్యార్థులపై దాడి చేయడమా?. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ ఎక్కడున్నారు?. ఫ్యూచర్ సిటీ కోసం 14 వేల ఎకరాల భూమి ఉండగా.. హెచ్‌సీయూలో ఉన్న ఆ 400 ఎకరాలే ఎందుకు?.ఆ 400 ఎకరాల భూముల్లోమూగజీవాలు కనిపించడం లేదా? అని కేటీఆర్(KTR) ప్రశ్నించారు... ఇది హైదరాబాద్ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటం ఉధృతం చేస్తాం. కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూములు ఎవరూ కొనొద్దు. ఆ భూమి ఎవరు కొన్నా నష్టపోతారు. మేం అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాలు తిరిగి తీసుకుంటాం. మేము వచ్చాక అతిపెద్ద ఎకోపార్క్ ఏర్పాటు చేస్తాం. అద్భుతంగా తీర్చిదిద్ది హెచ్‌సీయూకి కానుకగా ఇస్తాం’’ అని కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవం చేపడితే.. అప్పుడు హైదరాబాద్‌కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది అని ఆయన గుర్తు చేశారు.

తారాస్థాయికి చేరిన గోల్డ్ రేటు: ఇదే ఆల్‌టైమ్ రికార్డ్!
దేశంలో తొమ్మిదో రోజు బంగారం ధరలు దూసుకెల్తూనే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 3) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ.540 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాంహైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 85,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 93,380 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధర.. ఈ రోజు రూ. 500 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 540 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 500, రూ. 540 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 85,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,380 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 85,750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 93,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 500, రూ. 540 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: EPFO విత్‌డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (ఏప్రిల్ 3) కేజీ సిల్వర్ రేటు రూ. 1,13,900 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,04,900 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

ఒక్క చెట్టును కూడా నరకొద్దు.. హెచ్‌సీయూ వివాదంపై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వివాదం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. పెద్ద ఎత్తున చెట్లు నరుకుతున్నారంటూ ఫిర్యాదు అందడంతో గురువారం సుప్రీం కోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై ఇవాళ మధ్యాహ్నాం 3.45 నిమిషాలకు విచారణ చేపడతామని తెలిపింది. ఈలోపు.. వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరింది. అయితే.. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన న్యాయస్థానం ప్రభుత్వం విక్రయించాలనుకున్న కంచ గచ్చిబౌలిని వెంటనే సందర్శించాలని, ఇవాళ మధ్యాహ్నాం 3.30గం. లోపు నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. అలాగే.. తమ ఆదేశాల వచ్చేదాకా ఒక్క చెట్టును కూడా నరకొద్దంటూ తెలంగాణ సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో హైకోర్టు ఆదేశాలపై కూడా స్టే ఇవ్వడం లేదని పేర్కొంది.మరోవైపు.. తెలంగాణ హైకోర్టులో హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై ఇవాళ కూడా విచారణ జరగనుంది. నగరంలోని కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై(PIL) బుధవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. వాదనలు విన్న ధర్మాసనం.. ఇవాళ్టి వరకు పనులు ఆపాలని ఆదేశించింది.

మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’ సీక్వెల్.. కథ రెడీ కానీ.. : సింగీతం శ్రీనివాసరావు
‘‘34 ఏళ్ల క్రితం విడుదలైన ‘ఆదిత్య 369’ (Aditya 369 Movie) రీ రిలీజ్ కావడం అద్భుతమైన అనుభూతి. ఈ సినిమాని ఇప్పుడు తీసుంటే బాగుండేది అనిపించిన క్షణాలు ఉన్నాయి. శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నేటి టెక్నాలజీతో కంప్లీట్‌గా అప్‌గ్రేడ్ చేసి రీ రిలీజ్ చేస్తుంటే... ప్రేక్షకులకే కాదు.. నాలాంటి వాళ్లకి కూడా సినిమా చూడాలనిపిస్తుంది. ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్’’ అని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa) పేర్కొన్నారు. బాలకృష్ణ, మోహిని జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆదిత్య 369’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఆదిత్య 369’ సీక్వెల్‌కి కథ సిద్ధం చేశాం. ఈ మూవీ ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలనుకున్నారు బాలకృష్ణ. ఈ మూవీని ప్రకటించినప్పటికీ కుదరల్లేదు. కానీ, ఆయన మాత్రం ఎప్పటికైనా సీక్వెల్ చేయాలని అంటుంటారు. అది ఎప్పుడు అవుతుందన్నది దైవ నిర్ణయం. ఇక నేను కాలేజీలో చదువుతున్నప్పుడు హెచ్. జి. వెల్స్ రచించిన ‘ది టైమ్ మిషన్’ నవల ఆధారంగా ‘ఆదిత్య 369’ తీశాను. ఈ కథలో లీనమై సంగీతం అందించారు ఇళయరాజా. పీసీ శ్రీరామ్, వీఎస్ఆర్ స్వామి, కబీర్ లాల్.. ఇలా ముగ్గురు కెమేరామెన్లు పని చేయడం దైవ నిర్ణయం. పేకేటి రంగాగారు శ్రీకృష్ణ దేవరాయలవారి సెట్‌ని, టైమ్ మెషిన్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు’’ అని తెలిపారు.

600 ఏళ్ల చరిత్రగల పుణ్యక్షేత్రం, అన్నీ విశేషాలే!
కలియుగ వైకుంఠంగా, తెలంగాణ తిరుపతిగా, కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది మహబూబ్‌నగర్ జిల్లాలోని పేరెన్నికగన్న శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానం. ఆర్థిక స్థోమత లేని భక్తులు మన్యంకొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నా, తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. తిరుపతిలో మాదిరిగానే మన్యంకొండలో స్వామివారు గుట్టపై కొలువుదీరగా దిగువకొండవద్ద అలమేలు మంగతాయారు కొలువుదీరి ఉన్నారు. దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేసినందువల్ల మునులకొండ అని పేరు వచ్చింది. అదే కాలక్రమేణా మన్యంకొండగా మారింది. మహబూబ్‌నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో రాయిచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన గుట్టలపై మన్యంకొండ దేవస్థానం కొలువుదీరింది. 600 సంవత్సరాల చరిత్రగల ఈ దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కల్పతరువుగా భాసిల్లుతోంది. తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని స్వామి... ఈ దేవస్థానం ప్రత్యేకం. దేవస్థానం చరిత్ర...పురాణ కథనం ప్రకారం... దాదాపు 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలోగల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీర్ర ప్రాంతంలోగల మన్యంకొండపై తాను వెలిసి ఉన్నానని, కావున నీవు వెంటనే అక్కడికి వెళ్లి నిత్య సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించి అంతర్థానం అయ్యారట. దాంతో అళహరి కేశవయ్య తమ తండ్రి అనంతయ్యతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలోగల కోటకదిరలో నివాసం ఏర్పరుచుకొని గుట్టపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించారు. కేశవయ్య దక్షిణాదిగల అన్ని దివ్యక్షేత్రాలూ తిరిగి తరించడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానునికి నమస్కరించి దోసిలితో ఆర్ఘ్యం వదులుతుండగా శిలారూపంలోగల వెంకటేశ్వరస్వామి ప్రతిమ వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషషాయి రూపంలోగల గుహలో ప్రతిష్టించి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు. వీటితోపాటు దేవస్థానం మండపంలో ఆంజనేయస్వామి, గరుడాళ్వార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఈ దేవస్థానం ఎదురుగా ఉన్న గుట్టపై అప్పట్లో మునులు తపస్సు చేసినట్లుగా చెప్పుకుంటున్న గుహ ఉంది. కీర్తనలతో ఖ్యాతి... అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. హనుమద్దాసుల వారు దాదాపు 300 కీర్తనలు రచించారు. ఈ కీర్తనలు దేవస్థానం చరిత్రను చాటిచె΄్పాయి. హనుమద్దాసుల తర్వాత ఆయన వంశానికి చెందిన అళహరి రామయ్య దేవస్థానం వద్ద పూజలు ్ర΄ారంభించారు. వంశ΄ారంపర్య ధర్మకర్తగా ఉండడంతో΄ాటు దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.విశేషోత్సవాల రోజు స్వామివారికి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి శనివారం తిరుచ్చిసేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామికి ప్రీతి పాత్రమైన నైవేద్యం దాసంగం. భక్తులు స్వామివారికి దాసంగాలు పెట్టి నైవేద్యాలు సమర్పిస్తారు. నిత్యకల్యాణం.. పచ్చతోరణం...మన్యంకొండ దిగువ కొండవద్ద శ్రీ అలివేలు మంగతాయారు దేవస్థానం ఉంది. ప్రతి సంవత్సరం అమ్మవారి సన్నిధిలో కొన్ని వందల వివాహాలు జరుగుతాయి. సుదూర ్ర΄ాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి మంటపంలో పెళ్లిళ్లు చేసుకుంటారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను చేసి పునీతులవుతారు. స్థలపురాణం... ఆళహరి రామయ్యకు స్వామివారు కలలోకి వచ్చి అమ్మవారి దేవస్థానాన్ని తిరుపతి మాదిరిగా దిగువకొండ వద్ద నిర్మించాలని సూచించారు. దీంతో 1957–58 సంవత్సరంలో అలమేలు మంగతాయారు దేవస్థానాన్ని ఆయన సొంత నిధులతో అక్కడ నిర్మాణం చేశారు. తిరుమల తిరుపతి నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. ఆగమశాస్త్రం ప్రకారం రోజూ దేవస్థానంలో పలు ఆరాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఫాల్గుణ ద్వాదశి రోజు అమ్మవారి ఉత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఎలా వెళ్లాలి..?బస్సు మార్గం: హైదరాబాద్ నుంచి నేరుగా మన్యంకొండకు ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కర్నూల్ నుంచి వచ్చే భక్తులు జడ్చర్లలో దిగి మహబూబ్‌నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. లేకుంటే భూత్పూర్లో దిగి మహబూబ్‌నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. రైలులో రావాలంటే అటు హైదరాబాద్ లేదా కర్నూల్ నుండి చేరుకోవచ్చు. మహబూబ్‌నగర్ – దేవరకద్ర మార్గమధ్యలోని కోటకదిర రైల్వేస్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంది. కేవలం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి.సీజన్లో పెళ్లిళ్ల హోరు...అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే కొలిచిన వారికి నిత్య సుమంగళిత్వం, సంతానం, సిరిసంపదలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పెళ్లి కావల్సిన వారు, సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం. మన్యంకొండ శ్రీ అలమేలు మంగతాయారు దేవస్థానం మంగళవాయిద్యాలతో హోరెత్తిపోతుంటుంది. ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దేవస్థానం ఆవరణలో పెళ్లిళ్లు చేసుకుంటారు. ఒకేరోజు 12 నుంచి 25 పెళ్లిళ్ల దాకా ఇక్కడ జరుగుతాయి. అమ్మవారికి ఆలయంలో నిత్య కళ్యాణంతోపాటు కుంకుమార్చన, ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. బస...మన్యంకొండ శ్రీ అలమేలు మంగ తాయారు దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి ఎటువంటి సత్రాలు లేవు. కాక΄ోతే దేవస్థా నానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి సత్రాలు ఉన్నాయి. భక్తులు ఆ సత్రాల వద్ద ఉండవచ్చు. దీనికిగాను దేవస్థానానికి రోజుకు కొంత చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన వారు అక్కడ ఉండొచ్చు.

ఇంత చిన్న గడ్డివామా.. ఐతే పిల్లను ఇవ్వం!
పిల్లవాడి ఇంటికి వెళ్లి ఆస్తిపాస్తులు.. వారి హోదా స్తోమత అన్నీ చూసొద్దాం అని వెళ్లిన ఆడపెళ్ళి వాళ్ళు అట్నుంచి వచ్చి పెదవి విరిచారు.. ఎందుకయ్యా అంటే ఆ చూసాములే.. ఏముంది వాళ్లకు.. ఇల్లు పొలం.. గొర్రె, మేకా కూడా ఉన్నట్లున్నాయి. కానీ, ఆ గడ్డివాము మరీ చిన్నదిగా ఉంది. ఇక వాడేం పిల్లను పోషిస్తాడు.. వద్దులే ఆ సంబంధం క్యాన్సిల్ అని చెప్పేసారు ఆడపిల్లవారు.ఈసారి కదిరి నుంచి అబ్బాయివాళ్ళు అమ్మాయిని చూస్కోవడానికి మడకశిర వచ్చారు.. అబ్బాయి భూమి.. పుట్ట.. ఇల్లు.. కల్లం వంటి వివరాలన్నీ చెప్పారు.. అమ్మాయి.. అబ్బాయి ఇద్దరూ ఒకరికి ఒకరు నచ్చారు. మళ్ళీ ఆడపిల్ల తరఫువారు అబ్బాయి ఇంటికి వెళ్లారు.. అమ్మాయి మేనమామ మహా ఘటికుడు .. అబ్బాయికి ఊళ్ళో ముందే ఓ రౌండ్ వేసి పిల్లాడికి ఆస్తిపాస్తులు.. పశువులు.. దుక్కిపశువులు ఎన్ని ఉన్నాయి.. పాడి పశువులు ఎన్ని ఉన్నాయి అనేది సర్వే చేసాడు.. మేనమామ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. దీంతో పెళ్లయింది.. అవును ఇప్పుడంటే పిల్లలకు సంబంధాలు చూసేటపుడు ప్యాకేజీ ఎంత.. పిల్లకు ఎన్ని ఎకరాలు భూమి ఉంది.. పిల్లాడికి ఎంత కట్నం ఇస్తారు. ఆడపిల్ల వారి స్థోమత ఎంత.. అబ్బాయి తరఫు వాళ్ళకు ఎంత ఆస్తి ఉంది. ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి.. సంబంధం చేసుకుంటే పిల్లకు ఎంత బంగారం పెడతారు. అబ్బాయి ఏ బ్రాండ్ కారు వాడుతున్నాడు.. జీతం ప్యాకేజీ ఎంత.. ఫారిన్ లో ఉద్యోగం ఉందా.. ఎంత సేవింగ్స్ ఉన్నాయి.. ఇదీ లెక్క.. ఇదే కాలిక్యులేషన్. కానీ, ఓ మూడు దశాబ్దాల క్రితం రోజులు అలానే ఉండేవి పిల్లాడికి.. ఎన్ని పాడి పశువులు ఉన్నాయ్.. వాటిని ఎలా చూసుకుంటున్నాడు.. వాటికి నిత్యం పోషించే స్థాయి.. బాధ్యత ఉన్నాయా.. బ్యాంకు బ్యాలెన్స్ మాదిరిగా కల్లంలో గడ్డి ఎంత నిల్వ చేసాడు. మండు వేసవిలో కూడా పశువులను చూసుకోగలడా.. అప్పుడు కూడా జీవాలకు కడుపునిండా గడ్డి పెట్టగలడా అనే సామర్థ్యం మీద ఆధారపడి పిల్లను ఇచ్చేవాళ్ళు. పశువులను కూడా నాడు రాయలసీమలో కుటుంబంలో భాగంగానే చూసేవాళ్ళు.. ఏదైనా శుభకార్యం జరిగినా పశువులతో కలిసి ఫోటోలు దిగేవాళ్ళు. వాటికి పూజలు చేసి పూలదండలు వేసి వాటికి కుటుంబ సభ్యులుగా గుర్తించి ప్రేమించి గౌరవించేవాళ్ళు.. పాడి పశువులతోబాటు దుక్కి పశువులకు ప్రత్యేక గ్రాసం వేసేవాళ్ళు. ఊళ్లలో కూడా ఎవరికీ ఎక్కువ పశుసంపద ఉంటే వారికి ప్రత్యేక గౌరవం.. గుర్తింపు దక్కేది. రాయలసీమలో.. నలభై.. యాభై.. అరవై నుంచి వందకు పైగా పశువులను తమ పెరట్లో పెంచిన కుటుంబాలు అనేకం.ఇప్పుడు రోజులు మారిపోయాయి.. అక్కడక్కడా కనిపించే పాడి పశువులు తప్ప దుక్కిటెడ్లు లేనేలేవు.. ఇక పొలాల్లో.. ఇంటి పెరడులో పెద్ద ఎత్తున గడ్డి కుప్పలు వేసే పరిస్థితి లేదు.. అంతా యాంత్రీకరణ వచ్చేసింది.. మిషన్లలో నూర్పిడి చేస్తున్నారు.. దీంతో పశువులకు గడ్డి కూడా దొరకడం లేదు. రోజులు మారిపోయాయి.. జీవాలు మనుషులకు దూరమైపోయాయి .. డబ్బు.. బంగారం.. ఆస్తిపాస్తులే ప్రజలకు గౌరవాన్ని తెచ్చే సంపదలుగా లోకం మారిపోయింది. -సిమ్మాదిరప్పన్న
ముంబై నుంచి గోవాకు?.. సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ వైరల్
అందుకే పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ పెట్టాం: నితిన్-భరత్
కొత్త నాటకానికి తెరతీసిన బాబు అండ్ కో!
600 ఏళ్ల చరిత్రగల పుణ్యక్షేత్రం, అన్నీ విశేషాలే!
ట్రంప్ టారిఫ్స్: మనుషుల్లేని దీవులపై 10 శాతం సుంకం
నాన్న.. నువ్వు మా ప్రాణం!
మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’ సీక్వెల్.. కథ రెడీ కానీ.. : సింగీతం శ్రీనివాసరావు
ఒక్క చెట్టును కూడా నరకొద్దు.. హెచ్‌సీయూ వివాదంపై సుప్రీం కోర్టు
యూఎస్ సుంకాలు.. భారత్‌పై ప్రభావం ఎంత?
Telangana: అప్పు కింద గొర్రెలు జప్తు!
ట్రంప్ మార్క్ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట
అలాంటి జోకర్లందరూ జాగ్రత్తగా ఉండండి.. 'నాని' టీమ్ పోస్ట్
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశీర్వాదం
జపాన్‌లో భారీ భూకంపం
ఒక్క చెట్టును కూడా నరకొద్దు.. హెచ్‌సీయూ వివాదంపై సుప్రీం కోర్టు
భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్మేట్ శివతో వివాహేతర సంబంధం
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
ఇంకా 6 నెలలు ఎలా అడుగుతారు?.. ‘అనర్హత’పై సుప్రీం కోర్టు
కంచ గచ్చిబౌలి భూములు ఎవరూ కొనద్దు: కేటీఆర్
ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
‘టాప్’లోనే హార్దిక్ పాండ్యా .. మిస్టరీ స్పిన్నర్‌కు ఎదురుదెబ్బ
ప్రేమోన్మాది ఘాతుకం
టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..
గుజరాత్లో ప్రమాదం.. మంటల్లో ముక్కలైన భారత యుద్ధ విమానం
హెచ్‌సీయూపై సెలబ్రిటీలు సై!
మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్! : వైఎస్ జగన్
రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్
ఇంత చిన్న గడ్డివామా.. ఐతే పిల్లను ఇవ్వం!
విడాకులు ప్లీజ్
చిరంజీవి సినిమాలో అతిథి?
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం
యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచర్ సిటీ పగ్గాలు!
అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్..
మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’ సీక్వెల్.. కథ రెడీ కానీ.. : సింగీతం శ్రీనివాసరావు
తల్లిదండ్రులైన కమెడియన్ రెడిన్ కింగ్స్లీ, సంగీత
అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్ విమర్శలు!
తారాస్థాయికి చేరిన గోల్డ్ రేటు: ఇదే ఆల్‌టైమ్ రికార్డ్!
ఇంటిమేట్ సీన్లో అతడు హద్దుమీరాడు: పోటుగాటు హీరోయిన్
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
సిటీలో దొడ్డు బియ్యమే!
సోషల్ మీడియాని మితిమీరి వాడితే...
పరిధి దాటొద్దు.. పోలీసులను హెచ్చరించిన సుప్రీంకోర్టు
హలీమ్ @ రూ.వెయ్యి కోట్లు!
బెంగళూరుకు సిరాజ్ షాక్
భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష
600 ఏళ్ల చరిత్రగల పుణ్యక్షేత్రం, అన్నీ విశేషాలే!
మావోయిస్టుల లేఖ.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
నువ్వు యాంకరింగ్ చేయడం నాకు ఇష్టం లేదు..!
గాజాలో ఆకలి కేకలు: పిండీ లేదు.. తిండీ లేదు
బర్డ్‌ఫ్లూ కలకలం.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం
కొట్టాలి టెంకాయ మళ్లీ మళ్లీ
ఈ రాశి వారికి చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి.. భూవివాదాలు పరిష్కారం
చెట్ల నరికివేత ఆపండి: హైకోర్టు
IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
అందుకే పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ పెట్టాం: నితిన్-భరత్
కొత్త నాటకానికి తెరతీసిన బాబు అండ్ కో!
ట్రంప్ టారిఫ్స్: మనుషుల్లేని దీవులపై 10 శాతం సుంకం
మంత్రి గుమ్మడి సంధ్యా రాణికి చేదు అనుభవం
Erotomania ఆ హీరోనే పెళ్లి చేసుకుంటానంటోంది!
ఏడేళ్లు ఆర్సీబీకి ఆడాను.. అందుకే అలా సెలబ్రేట్ చేసుకున్నా: సిరాజ్
వర్ధమాన దేశాల్లో భారత్ భేష్
ఆకాశవీధిలో..
యూపీఐ.. రయ్
ఏజెంటిక్ ఏఐలో భారత్ టాప్!
హద్దు మీరిన పాక్ సైన్యం... బుద్ధి చెప్పిన భారత జవాన్లు
ముస్లింలపై ఎందుకింత ద్వేషం?
‘పథకం’ ప్రకారం ప్రతినెలా కేవలం ఒక ఇంటిని సందర్శించి వస్తున్నాం సార్!
ఇకనైనా అరాచకం ఆగేనా!
దిశా పటానీ ధగధగ.. కావ్య థాపర్ గిబ్లీ ఆర్ట్!
'మ్యాడ్' హీరోతో మెగా డాటర్ కొత్త సినిమా
యూఎస్ సుంకాలు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ఎయిమ్స్‌లో లాలూకు కొనసాగుతున్న చికిత్స
టారిఫ్‌ల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
అంత స్వల్ప సమయంలో యువతినెలా నమ్మించాడు?
తయారీ రంగం.. 8 నెలల గరిష్టం
పుతిన్ మరో సంచలన నిర్ణయం.. 1.6 లక్షల మంది సైనికులు..
వరమివ్వని ఉద్యానం
శాంతి చర్చలకు మేం సిద్ధం..
మృత్యువుతో 108 గంటల పోరాటం
స్పీకర్ చర్యలు తీసుకోకున్నా చేతులు కట్టుకొని చూస్తుండాలా?: సుప్రీంకోర్టు
కొంచెం సులభమే!
బిల్లుపై ఎవరి వాదనేమిటి?
బ్యాకప్‌లో మనమే అప్
జై బోలో హనుమాన్‌కి...
బందిపోట్లలా కాంగ్రెస్ సర్కారు తీరు!: కేసీఆర్
రెండోసారి గంట సేపు విచారణ!
కుదిరితే సయోధ్య.. లేకుంటే ధర్మయుద్ధం: సీఎం రేవంత్
వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
65 నుంచి 40కు...
గువాహాటిలో తొలిసారి టెస్టు
శిఖరాన్ని వంచింది
మా ఇంటి మణిదీపం
కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
బిర్లాన్యూ రూ. 1,300 కోట్ల పెట్టుబడులు
ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్.. ఎవరీ పూనమ్ గుప్తా?
నేరుగా వాట్సాప్‌లో.. ఇన్వెస్టర్లకు సరికొత్త ఫీచర్
ఆదిత్య బిర్లా ఫైనాన్స్ విలీనం పూర్తి.. కంపెనీ ఇకపై..
నాపై ట్రోలింగ్.. ఆ ఒక్క పని చేస్తే చాలు: సారా అలీ ఖాన్
రాత్రికి రాత్రే బుల్డోజర్లు.. అసలేం జరుగుతుంది?: రష్మిక
ఆ ఐదో ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?: అంబటి
బెయిల్ కోసం హైకోర్టుకు రన్య
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
భూమికి మేలు–రైతుకు వీలు
నాన్న.. నువ్వు మా ప్రాణం!
ఎంఎంటీఎస్ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ
రెండేళ్ల క్రితం భార్య మోసం చేసి వెళ్లిపోయింది..!
ముంబై నుంచి గోవాకు?.. సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ వైరల్
అందుకే పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ పెట్టాం: నితిన్-భరత్
కొత్త నాటకానికి తెరతీసిన బాబు అండ్ కో!
600 ఏళ్ల చరిత్రగల పుణ్యక్షేత్రం, అన్నీ విశేషాలే!
ట్రంప్ టారిఫ్స్: మనుషుల్లేని దీవులపై 10 శాతం సుంకం
నాన్న.. నువ్వు మా ప్రాణం!
మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’ సీక్వెల్.. కథ రెడీ కానీ.. : సింగీతం శ్రీనివాసరావు
ఒక్క చెట్టును కూడా నరకొద్దు.. హెచ్‌సీయూ వివాదంపై సుప్రీం కోర్టు
యూఎస్ సుంకాలు.. భారత్‌పై ప్రభావం ఎంత?
Telangana: అప్పు కింద గొర్రెలు జప్తు!
ట్రంప్ మార్క్ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట
అలాంటి జోకర్లందరూ జాగ్రత్తగా ఉండండి.. 'నాని' టీమ్ పోస్ట్
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశీర్వాదం
జపాన్‌లో భారీ భూకంపం
ఒక్క చెట్టును కూడా నరకొద్దు.. హెచ్‌సీయూ వివాదంపై సుప్రీం కోర్టు
భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్మేట్ శివతో వివాహేతర సంబంధం
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
ఇంకా 6 నెలలు ఎలా అడుగుతారు?.. ‘అనర్హత’పై సుప్రీం కోర్టు
కంచ గచ్చిబౌలి భూములు ఎవరూ కొనద్దు: కేటీఆర్
ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
‘టాప్’లోనే హార్దిక్ పాండ్యా .. మిస్టరీ స్పిన్నర్‌కు ఎదురుదెబ్బ
ప్రేమోన్మాది ఘాతుకం
టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..
గుజరాత్లో ప్రమాదం.. మంటల్లో ముక్కలైన భారత యుద్ధ విమానం
హెచ్‌సీయూపై సెలబ్రిటీలు సై!
మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్! : వైఎస్ జగన్
రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్
ఇంత చిన్న గడ్డివామా.. ఐతే పిల్లను ఇవ్వం!
విడాకులు ప్లీజ్
చిరంజీవి సినిమాలో అతిథి?
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం
యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచర్ సిటీ పగ్గాలు!
అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్..
మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’ సీక్వెల్.. కథ రెడీ కానీ.. : సింగీతం శ్రీనివాసరావు
తల్లిదండ్రులైన కమెడియన్ రెడిన్ కింగ్స్లీ, సంగీత
అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్ విమర్శలు!
తారాస్థాయికి చేరిన గోల్డ్ రేటు: ఇదే ఆల్‌టైమ్ రికార్డ్!
ఇంటిమేట్ సీన్లో అతడు హద్దుమీరాడు: పోటుగాటు హీరోయిన్
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
సిటీలో దొడ్డు బియ్యమే!
సోషల్ మీడియాని మితిమీరి వాడితే...
పరిధి దాటొద్దు.. పోలీసులను హెచ్చరించిన సుప్రీంకోర్టు
హలీమ్ @ రూ.వెయ్యి కోట్లు!
బెంగళూరుకు సిరాజ్ షాక్
భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష
600 ఏళ్ల చరిత్రగల పుణ్యక్షేత్రం, అన్నీ విశేషాలే!
మావోయిస్టుల లేఖ.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
నువ్వు యాంకరింగ్ చేయడం నాకు ఇష్టం లేదు..!
గాజాలో ఆకలి కేకలు: పిండీ లేదు.. తిండీ లేదు
బర్డ్‌ఫ్లూ కలకలం.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం
కొట్టాలి టెంకాయ మళ్లీ మళ్లీ
ఈ రాశి వారికి చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి.. భూవివాదాలు పరిష్కారం
చెట్ల నరికివేత ఆపండి: హైకోర్టు
IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
అందుకే పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ పెట్టాం: నితిన్-భరత్
కొత్త నాటకానికి తెరతీసిన బాబు అండ్ కో!
ట్రంప్ టారిఫ్స్: మనుషుల్లేని దీవులపై 10 శాతం సుంకం
మంత్రి గుమ్మడి సంధ్యా రాణికి చేదు అనుభవం
Erotomania ఆ హీరోనే పెళ్లి చేసుకుంటానంటోంది!
ఏడేళ్లు ఆర్సీబీకి ఆడాను.. అందుకే అలా సెలబ్రేట్ చేసుకున్నా: సిరాజ్
వర్ధమాన దేశాల్లో భారత్ భేష్
ఆకాశవీధిలో..
యూపీఐ.. రయ్
ఏజెంటిక్ ఏఐలో భారత్ టాప్!
హద్దు మీరిన పాక్ సైన్యం... బుద్ధి చెప్పిన భారత జవాన్లు
ముస్లింలపై ఎందుకింత ద్వేషం?
‘పథకం’ ప్రకారం ప్రతినెలా కేవలం ఒక ఇంటిని సందర్శించి వస్తున్నాం సార్!
ఇకనైనా అరాచకం ఆగేనా!
దిశా పటానీ ధగధగ.. కావ్య థాపర్ గిబ్లీ ఆర్ట్!
'మ్యాడ్' హీరోతో మెగా డాటర్ కొత్త సినిమా
యూఎస్ సుంకాలు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ఎయిమ్స్‌లో లాలూకు కొనసాగుతున్న చికిత్స
టారిఫ్‌ల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
అంత స్వల్ప సమయంలో యువతినెలా నమ్మించాడు?
తయారీ రంగం.. 8 నెలల గరిష్టం
పుతిన్ మరో సంచలన నిర్ణయం.. 1.6 లక్షల మంది సైనికులు..
వరమివ్వని ఉద్యానం
శాంతి చర్చలకు మేం సిద్ధం..
మృత్యువుతో 108 గంటల పోరాటం
స్పీకర్ చర్యలు తీసుకోకున్నా చేతులు కట్టుకొని చూస్తుండాలా?: సుప్రీంకోర్టు
కొంచెం సులభమే!
బిల్లుపై ఎవరి వాదనేమిటి?
బ్యాకప్‌లో మనమే అప్
జై బోలో హనుమాన్‌కి...
బందిపోట్లలా కాంగ్రెస్ సర్కారు తీరు!: కేసీఆర్
రెండోసారి గంట సేపు విచారణ!
కుదిరితే సయోధ్య.. లేకుంటే ధర్మయుద్ధం: సీఎం రేవంత్
వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
65 నుంచి 40కు...
గువాహాటిలో తొలిసారి టెస్టు
శిఖరాన్ని వంచింది
మా ఇంటి మణిదీపం
కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
బిర్లాన్యూ రూ. 1,300 కోట్ల పెట్టుబడులు
ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్.. ఎవరీ పూనమ్ గుప్తా?
నేరుగా వాట్సాప్‌లో.. ఇన్వెస్టర్లకు సరికొత్త ఫీచర్
ఆదిత్య బిర్లా ఫైనాన్స్ విలీనం పూర్తి.. కంపెనీ ఇకపై..
నాపై ట్రోలింగ్.. ఆ ఒక్క పని చేస్తే చాలు: సారా అలీ ఖాన్
రాత్రికి రాత్రే బుల్డోజర్లు.. అసలేం జరుగుతుంది?: రష్మిక
ఆ ఐదో ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?: అంబటి
బెయిల్ కోసం హైకోర్టుకు రన్య
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
భూమికి మేలు–రైతుకు వీలు
నాన్న.. నువ్వు మా ప్రాణం!
ఎంఎంటీఎస్ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ
రెండేళ్ల క్రితం భార్య మోసం చేసి వెళ్లిపోయింది..!
సినిమా

విడాకులు ప్లీజ్
కర్ణాటక: అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడి జైలుపాలైన నటి, ఓ డీజీపీ దత్త కుమార్తె రన్య రావు కుటుంబంలో కలతలు తీవ్రమయ్యాయి. ఆమె నుంచి విడాకులు కావాలని భర్త జతిన్ హుక్కేరి కోరుతున్నారు. ఈ మేరకు బెంగళూరు హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. పెళ్లయినప్పటి నుంచి రన్య రావుతో సంసారం ఇబ్బందిగానే ఉందని ఆయన దూరంగా ఉంటున్నారు. ఇంతలో బంగారం స్మగ్లింగ్‌లో భార్య అరెస్టు కావడంతో ఇక కాపురం కుదరదని భావిస్తున్నారు. గత ఏడాది అక్టోబరు 6వ తేదీన బెంగళూరులో బాస్టిన్ రెస్టారెంట్లో రన్యా, జతిన్హుక్కేరి ఇద్దరూ ఓ పెళ్లిళ్ల పేరయ్య ద్వారా కలుసుకున్నారు. అలా పరిచయం పెరిగి పెళ్లి వరకూ వచ్చింది. అక్టోబరు 24వ తేదీన జతిన్, రన్య నిశి్చతార్థం జరిగింది. గత ఏడాది నవంబరు 27 తేదీన తాజ్‌వెస్ట్ ఎండ్హోటల్లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది, ల్యావెల్లీ రోడ్డులోని ఖరీదైన అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆది నుంచీ గొడవలు తరువాత నెలకే రన్య, జతిన్ మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇరువురి మధ్య మాటలు లేవని జతిన్ పిటిషన్లో ప్రస్తావించారు. బంధుమిత్రులు రాజీకి ప్రయతి్నంచినా ఫలితం లేదని తెలిసింది. ఆమె తరచూ దుబాయ్‌కు వెళ్లి వచ్చేది, దీనిని భర్త ప్రశ్నించడంతో గొడవలు జరిగేవి. మరోవైపు స్నేహితుడు తరుణ్ రాజుతో కలిసి బంగారం స్మగ్లింగ్ కేసుల్లో చిక్కుకుంది.

చిరంజీవి సినిమాలో అతిథి?
చిరంజీవి, వెంకటేశ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే... అవుననే సమాధానమే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక ఈ సినిమాలోని అతిథి పాత్రలో వెంకటేశ్ నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు... సో.. అతిథి పాత్ర చేస్తున్నారు కాబట్టిప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది.

సోషల్ మీడియాని మితిమీరి వాడితే...
‘‘సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి? అనే అంశంపై తీసిన చిత్రమే ‘శారీ’. ఈ సినిమాకు నేను మూల కథ అందించాను. కథ రాసినప్పుడు నేను ఊహించనదానికంటే సినిమాను బాగా తీశాడు దర్శకుడు గిరికృష్ణ కమల్. ఈ సినిమా సబ్జెక్ట్‌ను చర్చిస్తున్నప్పుడు, అతని ఆలోచనలు నచ్చి, ‘శారీ’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించాను’’ అని దర్శక–నిర్మాత–రచయిత రామ్‌గోపాల్ వర్మ అన్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘శారీ’. గిరికృష్ణ కమల్ దర్శకత్వంలో ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ పతాకాలపై రవిశంకర్ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో గిరికృష్ణ కమల్ మాట్లాడుతూ– ‘‘సత్య, ఆరాధ్య... ఇలా ప్రధానంగా రెండు పాత్రలతో సాగే ఇంటెన్స్ డ్రామా ఫిల్మ్ ఇది’’ అన్నారు. ‘‘ఇది నాకో డ్రీమ్ ప్రాజెక్ట్’’ అని పేర్కొన్నారు ఆరాధ్య దేవి. ‘‘ఈ మూవీలో ఉన్నవి తక్కువ పాత్రలే అయినా, అవి ఎఫెక్టివ్‌గా ఉంటాయి’’ అని తెలిపారు సత్య యాదు. ‘‘గులాబి’ సినిమా నుంచి రామ్‌గోపాల్ వర్మతో వర్క్ చేస్తున్నాను. ఆయన ఎప్పుడు ఏ మూవీ కోసం పిలిచినా రెడీగా ఉంటాను’’ అని చె΄్పారు ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్.

పాముతో సీన్స్ చేయడానికి భయపడ్డాను
హీరోయిన్ కేథరిన్ ట్రెసా ప్రధాన పాత్రలో, మహేశ్ శ్రీరామ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఫణి’. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్, ఏయూ అండ్ ఐ స్టూడియోల సమర్పణలో డా. మీనాక్షి అనిపిండి ఈ సినిమాను నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇతర ప్రపంచ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. బుధవారం జరిగిన ఈ చిత్రం ప్రెస్‌మీట్‌కు దర్శక–నిర్మాత కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై, ‘ఫణి’ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘వీఎన్ ఆదిత్య కొత్త వాళ్లతోనూ సినిమా చేయగలడు, స్టార్స్‌తోనూ సినిమా చేయగలడు. ‘ఫణి’ విజయం సాధించాలి’’ అని అన్నారు. ‘‘నాకు పాములంటే భయం. దీంతో పాముతో నేను చేయాల్సిన సీన్స్ అన్నీ సీజీలో చేయాలని ఆదిత్యగారిని రిక్వెస్ట్ చేస్తే, సరే అన్నారు. అయితే షూటింగ్ చివర్లో పాము కాంబినేషన్లో నాతో సీన్స్ చేయించారు. ఒకసారి సీన్ పూర్తయ్యేసరికి పాము నా ముఖానికి దగ్గరగా ఉంది. అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి. మేలో మా ‘ఫణి’ మూవీని రిలీజ్ చేస్తున్నాం’’ అని తెలిపారు కేథరిన్. ‘‘యూఎస్ వెళ్లినప్పుడు నా సోదరి మీనాక్షి–బావ శాస్త్రిగారి ఇంట్లో ఉంటాను. వారు తమ ఓ.ఎం.జీ సంస్థలో నాతో సినిమా చేస్తామన్నప్పుడు నాకు భయం వేసింది. ‘ఫణి’ చిత్రాన్ని చిన్నగా మొదలు పెట్టాం. ఆ తర్వాత కేథరిన్గారు ఒప్పుకోవడంతో మరో స్థాయికి వెళ్లింది’’ అన్నారు వీఎన్ ఆదిత్య. ‘‘ఫణి’ మూవీతో కేథరిన్గారికి జాతీయ అవార్డు వస్తుంది’’ అని తెలిపారు నిర్మాత, సంగీత దర్శకురాలు డా. మీనాక్షి అనిపిండి. ‘‘హాలీవుడ్లో మోడలింగ్, మూవీస్ చేస్తున్నాను. ఈ సినిమాలో నటించడంతో సొంత ఇంటికి వచ్చినట్లుంది’’ అన్నారు మహేశ్ శ్రీరామ్. ఈ చిత్రసమర్పకుడు పద్మనాభరెడ్డి, సహ–నిర్మాత శాస్త్రి అనిపిండి, రైటర్ పద్మ, నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్
క్రీడలు

65 నుంచి 40కు...
బెంగళూరు: గత రెండు వారాలుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెంటర్లో భారత మహిళల హాకీ ప్రాబబుల్స్‌కు శిక్షణ శిబిరం జరిగింది. ఈ తొలి విడత శిబిరంలో మొత్తం 65 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వారు కనబరిచిన ప్రతిభ ఆధారంగా రెండో దశ శిబిరం కోసం జాబితాను 40 మందికి కుదించారు. 28 మంది సీనియర్ ప్లేయర్లు కోర్ గ్రూప్ ప్రాబబుల్స్‌లో తమ చోటును నిలబెట్టుకోగా... జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో రాణించిన 12 మంది కొత్త ప్లేయర్లను ఎంపిక చేశారు. ‘కొత్తగా ఎంపికైన యువ క్రీడాకారిణులు రెండో దశ శిబిరంలో ఎలా రాణిస్తారో ఆసక్తితో ఉన్నాను. ఇందులో ఆకట్టుకుంటే వారు తమ కెరీర్లో మరో మెట్టు ఎక్కుతారు’ అని భారత మహిళల హాకీ జట్టు హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. భారత మహిళల హాకీ కోర్ గ్రూప్ ప్రాబబుల్స్: సవిత పూనియా, బిచ్చూ దేవి, బన్సారి సోలంకి, మాధురి కిండో, సమీక్ష సక్సేనా (గోల్‌కీపర్లు). మహిమా చౌధరీ, నిక్కీ ప్రధాన్, సుశీలా చాను, ఉదిత, ఇషికా చౌధరీ, జ్యోతి ఛత్రి, జ్యోతి, అక్షత ధెఖాలే, అంజన డుంగ్‌డుంగ్, సుమన్ దేవి (డిఫెండర్స్). సుజాత కుజుర్, వైష్ణవి ఫాలే్క, నేహా, సలీమా టెటె, మనీషా చౌహాన్, అజ్మీనా కుజుర్, సునెలితా టొప్పో, లాల్రెమ్సియామి, షర్మిలా దేవి, బల్జీత్ కౌర్, మహిమా టెటె, అల్బెలా రాణి టొప్పో, పూజా యాదవ్ (మిడ్ ఫీల్డర్స్). దీపిమోనిక టొప్పో, హృతిక సింగ్, దీపిక సొరెంగ్, నవ్‌నీత్ కౌర్, సంగీత, దీపిక, రుతుజా, బ్యూటీ డుంగ్‌డుంగ్, ముంతాజ్ ఖాన్, అన్ను, చందన జగదీశ్, కాజల్ అటా్పడ్కర్ (ఫార్వర్డ్స్).

SRH vs KKR: గెలుపు బాటలోకి ఎవరో!
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో తిరిగి గెలుపు బాట పట్టేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు సిద్ధమవుతున్నాయి. తొలి పోరులో భారీ బాదుడుతో రికార్డులు తిరగరాసిన రైజర్స్... ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో దాన్ని కొనసాగించలేకపోయింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను సన్‌రైజర్స్ ఢీకొంటుంది. బ్యాటింగ్ లైనప్ హిట్టర్లతో దట్టంగా ఉన్నప్పటికీ... టాపార్డర్ నిలకడలేమి హైదరాబాద్ జట్టును ఇబ్బంది పెడుతోంది. రాజస్తాన్ రాయల్స్‌తో మొదటి మ్యాచ్‌లో గెలిచిన ఆరెంజ్ ఆర్మీమ... ఆ తర్వాత వరుసగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడింది. 3 మ్యాచ్‌లాడి 2 పాయింట్లతో ఉన్న రైజర్స్ ఎనిమిదో స్థానంలో ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నా... వారంతా సమష్టిగా రాణించలేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు కోల్‌కతా జట్టు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆ జట్టు... స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమవుతోంది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లోనే గెలిచి, రెండింటిలో ఓడిన కేకేఆర్ 2 పాయింట్లతో పట్టిక అట్టడుగున ఉంది. గత సీజన్లో ఈ రెండు జట్ల మధ్యే జరిగిన ఫైనల్లో కోల్‌కతా గెలిచి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోగా... దానికి బదులు తీర్చుకోవాలని ఆరెంజ్ ఆర్మీ ప్రణాళికలు రచిస్తోంది. కలిసికట్టుగా కదంతొక్కితేనే... ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్... ఇలా చెప్పుకుంటూ పోతే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. ఎలాంటి బౌలింగ్ దాడినైనా దంచికొట్టగల సామర్థ్యం రైజర్స్ బ్యాటర్ల సొంతం. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇది నిరూపితమైంది. అయితే వీరంతా కలిసికట్టుగా రాణించాల్సిన అవసరముంది. రైజర్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్... తర్వాతి 2 మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా... ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి తొలి రెండు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించాడు. అభిషేక్ శర్మ నుంచి మెరుపులు కరువు కాగా.. క్లాసెన్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. అంచనాలు లేకుండా సీజన్ ఆరంభించిన అనికేత్ వర్మ ధాటిగా ఆడుతుండటం రైజర్స్‌కు కలిసి వస్తోంది. నైట్ రైడర్స్ ప్రధాన బలమైన స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటే మరోసారి భారీ స్కోర్లు ఖాయమే. ప్యాట్ కమిన్స్, షమీ, హర్షల్ పటేల్ బౌలింగ్ భారం మోయనున్నారు. బెంగాల్ తరఫున ఈ మైదానంలో లెక్కకు మిక్కిలి దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన షమీ కీలకం కానున్నాడు. స్పిన్నర్ల బలంతోనే... గతేడాది వేలంలో కోల్‌కతా వదిలేసుకున్న ప్రధాన ఆటగాళ్లంతా వేర్వేరు ఫ్రాంఛైజీల తరఫున రాణిస్తుంటే... కేకేఆర్ మాత్రం లయ అందిపుచ్చుకోలేక ఇబ్బంది పడుతోంది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే కెపె్టన్సీలో స్పిన్నే బలంగా నైట్‌రైడర్స్ బరిలోకి దిగుతోంది. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, మొయిన్ అలీలపై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. డికాక్, రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్‌తో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నా... వీరంతా ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన డికాక్... ముంబైతో పోరులో తేలిపోయాడు. ఇక భారీ ధర పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్ అయ్యర్ నుంచి ఆ జట్టు మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. రింకూ సింగ్, రసెల్ ఫినిషర్లుగా విఫలమవుతుండటం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. బౌలింగ్‌లో హర్షిత్ రాణా తప్ప చెప్పుకోదగ్గ పేసర్ లేకపోవడం కూడా కేకేఆర్‌కు ప్రతిబంధకమే కాగా... స్పిన్ యూనిట్ మాత్రం బలంగా ఉంది. మరి సొంతగడ్డపై కేకేఆర్ స్పిన్నర్లు చెలరేగుతారా లేక రైజర్స్ బ్యాటర్లు దుమ్మురేపుతారా చూడాలి! తుది జట్లు (అంచనా) సన్‌రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్ ), హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, షమీ, సిమర్జీత్ సింగ్, జంపా. కోల్‌కతా నైట్‌రైడర్స్: రహానే (కెప్టెన్ ), డికాక్, నరైన్, రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.28 ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు. 19 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్ గెలుపొందగా... 9 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ విజయం సాధించింది.

సాకేత్ జోడీ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: మెనోర్కా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నమెంట్లో భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సాకేత్ తమిళనాడుకు చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 6–2తో పెడ్రో కాచిన్ (అర్జెంటీనా)–ఇజాన్ కొరెత్యా (స్పెయిన్) జోడీపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 48 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్‌కుమార్ నాలుగు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశారు. తమ సర్వీస్‌లను నిలబెట్టుకొని, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. అనిరుద్‌కు నిరాశమరోవైపు ఇదే టోర్నీలో బరిలోకి దిగిన హైదరాబాద్‌కే చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ మాత్రం తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. గతవారం డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్)తో కలిసి జిరోనా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన అనిరుధ్ అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. తొలి రౌండ్లో అనిరుధ్ (భారత్)–హెర్నాండెజ్ ద్వయం 6–7 (4/7), 7–5, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ డానియల్ కుకెర్మన్ (ఇజ్రాయెల్)–జోషువా పారిస్ (బ్రిటన్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్ జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో మాత్రం అనిరుధ్ ద్వయం తడబడింది. భారత్‌కే చెందిన టాప్ సీడ్ జోడీ విజయ్ సుందర్ ప్రశాంత్–జీవన్ నెడుంజెళియన్ జోడీ 2–6, 0–6తో మాటియో–ఆండ్రియా (ఇటలీ) జంట చేతిలో ఓటమి పాలైంది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో నిక్కీ పునాచా (భారత్)– గోర్నెస్ (స్పెయిన్) ద్వయం 6–3, 6–3తో వరోనా–టబెర్నర్ (స్పెయిన్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

బెంగళూరుకు సిరాజ్ షాక్
ఏడేళ్ల పాటు బెంగళూరు ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్ సిరాజ్... తొలిసారి ఆ జట్టుకు ప్రత్యర్థిగా ఆడుతూ నిప్పులు చెరిగాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున తన పాత సహచరులపై బుల్లెట్ బంతులతో ప్రతాపం చూపాడు. ఫలితంగా ఐపీఎల్లో టైటాన్స్ రెండో విజయం నమోదు చేసుకోగా... రెండు విజయాల తర్వాత బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. సిరాజ్ ధాటికి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైన బెంగళూరు జట్టు... ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా ఎలాంటి మెరుపులు లేకుండా ఓటమిని ఆహ్వానించింది. బ్యాటింగ్‌లో బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో మరో 13 బంతులు మిగిలుండగానే గుజరాత్ గెలుపొందింది. బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఐపీఎల్ 18వ సీజన్లో తొలి ఓటమి ఎదురైంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన బెంగళూరు... బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది. గత సీజన్ వరకు ఆర్సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ సిరాజ్ (3/19) గుజరాత్ టైటాన్స్ తరఫున చెలరేగిపోగా... అతడి బౌలింగ్‌ను ఆడలేక బెంగళూరు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. మొదట బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; 1 ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... జితేశ్ శర్మ (33; 5 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (7), దేవదత్ పడిక్కల్ (4) కెప్టెన్ రజత్ పాటీదార్ (12), ఫిల్ సాల్ట్ (14), కృనాల్ పాండ్యా (5) విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిరాజ్ 3 వికెట్లు, సాయికిషోర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్), రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. సూపర్ సిరాజ్... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. అర్షద్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో అనవసర షాట్‌కు యత్నించిన కోహ్లి ఫైన్ లెగ్‌లో ప్రసిధ్ చేతికి చిక్కాడు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. తదుపరి ఓవర్లో పడిక్కల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్ టైటాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. ఇక కొన్ని మంచి షాట్లు ఆడిన సాల్ట్‌ను కూడా సిరాజ్ బుట్టలో వేసుకున్నాడు. ఈ మధ్య పాటీదార్‌ను ఇషాంత్ శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో... బెంగళూరు జట్టు 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జితేశ్ శర్మ, లివింగ్‌స్టోన్... చివర్లో డేవిడ్ ధాటిగా ఆడారు. 15 ఓవర్లు ముగిసేసరికి 105/6తో ఉన్న ఆర్సీబీ... చివరి 5 ఓవర్లలో 64 పరుగులు జోడించింది. రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో 3 సిక్స్‌లు బాదిన లివింగ్‌స్టోన్‌ను తదుపరి ఓవర్లో సిరాజ్ అవుట్ చేశాడు. చివరి ఓవర్లో డేవిడ్ 4, 6, 4 కొట్టడంతో బెంగళూరు ఆ మాత్రం స్కోరు చేసింది. అలవోకగా... ఛేదనలో గుజరాత్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదు. లక్ష్యం చిన్నది కావడంతో ఆ జట్టు ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేయలేకపోయిన ఆర్సీబీ... బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (14) త్వరగానే అవుటైనా... మరో ఓపెనర్ సాయి సుదర్శన్‌తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో చెలరేగిన ఈ జంట రెండో వికెట్‌కు 47 బంతుల్లో 75 పరుగులు జతచేసింది. అనంతరం సుదర్శన్ అవుట్ కాగా... రూథర్‌ఫోర్డ్‌తో కలిసి బట్లర్ మూడో వికెట్‌కు 32 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (బి) సిరాజ్ 14; కోహ్లి (సి) ప్రసిధ్ కృష్ణ (బి) అర్షద్ 7; దేవదత్ పడిక్కల్ (బి) సిరాజ్ 4; పాటీదార్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 12; లివింగ్‌స్టోన్ (సి) బట్లర్ (బి) సిరాజ్ 54; జితేశ్ శర్మ (సి) తెవాటియా (బి) సాయికిషోర్ 33; కృనాల్ పాండ్యా (సి అండ్ బి) సాయికిషోర్ 5; టిమ్ డేవిడ్ (బి) ప్రసిధ్ కృష్ణ 32; భువనేశ్వర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–8, 2–13, 3–35, 4–42, 5–94, 6–104, 7–150, 8–169. బౌలింగ్: సిరాజ్ 4–0–19–3; అర్షద్ ఖాన్ 2–0–17–1; ప్రసిధ్ కృష్ణ 4–0–26–1; ఇషాంత్ 2–0–27–1; సాయికిషోర్ 4–0–22–2; రషీద్ ఖాన్ 4–0–54–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) జితేశ్ శర్మ (బి) హాజల్‌వుడ్ 49; గిల్ (సి) లివింగ్‌స్టోన్ (బి) భువనేశ్వర్ 14; బట్లర్ (నాటౌట్) 73; రూథర్‌ఫోర్డ్ (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–32, 2–107. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–23–1, హాజల్‌వుడ్ 3.5–0–43–1; యశ్ దయాళ్ 3–0–20–0; రసిక్ సలామ్ 3–0–35–0; కృనాల్ పాండ్యా 3–0–34–0; లివింగ్‌స్టోన్ 1–0–12–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X హైదరాబాద్‌వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
బిజినెస్

టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించే టారిఫ్‌ల సంబంధ పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతో పాటు వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతీకార టారిఫ్‌ల పరిణామాలను ఎదుర్కొనే వ్యూహాలపై వాణిజ్య, పరిశ్రమల శాఖ కసరత్తు చేసినట్లు వివరించాయి.ప్రస్తుతం భారత్‌లో అమెరికా దిగుమతులపై సగటున టారిఫ్‌లు 7.7%గా ఉండగా, ఆ దేశానికి మన ఎగుమతులపై సగటున సుమారు 2.8 శాతమే. ప్రస్తుతం 190 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలనేది ఇరు దేశాల లక్ష్యం. ఈ దిశగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చిస్తున్నాయి.ఇదీ చదవండి: ఏడాదిలో రూ.1.33 లక్షల కోట్ల సమీకరణభారత్పై సుంకాల మోతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్ ప్రకటించారు.

ఆకాశవీధిలో..
ముంబై: పౌర విమానయానం వృద్ధి వేగాన్ని అందుకుంది. విమాన ప్రయాణికుల సంఖ్య 2024 మార్చి నుంచి ఏటా 9 శాతం చొప్పున పెరుగుతూ.. 2027 మార్చి నాటికి వార్షికంగా 48.5 కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ ‘కేర్ ఎడ్జ్’ ఒక నివేదిక రూపంలో వెల్లడించింది. 2025–26 నుంచి మరింత పెద్ద విమానాలు అందుబాటులోకి వస్తుండడంతో అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రద్దీ మరింత వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది. అదే సమయంలో దేశీ విమాన ప్రయాణికుల్లో స్థిరమైన వృద్ధి కనిపిస్తుందని తెలిపింది. కరోనా అనంతరం విమానయాన రంగం ‘వి’ ఆకారపు రికవరీని (పడిపోయినట్టుగానే పెరగడం) చూసిందని.. కరోనా ముందు నాటి ప్రయాణికులతో పోల్చితే 1.10 రెట్లకు రద్దీ చేరుకున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. విమాన ప్రయాణికుల రద్దీ 2025 మార్చి నాటికి 42.5 కోట్లకు చేరుకుంటుందని లోగడ వేసిన అంచనాలను కేర్ఎడ్జ్ సవరించింది. విమానాల డెలివరీలో జాప్యం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 4 శాతం వృద్ధితో 41 కోట్లకు చేరుతుందని పేర్కొంది. మహాకుంభ మేళా సమయంలో (2024–25 జనవరి–మార్చి) విమానయాన ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో తక్కువ వృద్ధిని భర్తీ చేస్తుందని తెలిపింది. ఏరో, నాన్ ఏరో ఆదాయాల్లో వృద్ధి.. 11 విమానాశ్రయాల ఏరో ఆదాయం (విమాన సర్వీసులు, వాటి అనుబంధ సేవలు) 2024 మార్చి నుంచి 2027 మార్చి మధ్య ఏటా 42 శాతం వృద్ధి చెందుతుందని కేర్ఎడ్జ్ నివేదిక అంచనా వేసింది. ఇదే కాలంలో నాన్‌ఏరో ఆదాయం ఏటా 12–14 శాతం చొప్పున పెరుగుతుందని పేర్కొంది. డ్యూటీ ఫ్రీ షాపులు, ఫుడ్, బెవరేజెస్ విక్రయాలు, లాంజ్ సేవల రూపంలో ఈ ఆదాయం ఉంటుందని వివరించింది. భారత ఎయిర్‌పోర్టుల్లో ఒక్కో ప్రయాణికుడి నుంచి వచ్చే నాన్ ఏరో ఆదాయం కంటే.. అంతర్జాతీయంగా విమానాశ్రయాలకు రెట్టింపు ఆదాయం వస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రకారం చూస్తే భారత విమానాశ్రయాలకు నాన్ ఏరో ఆదాయం వృద్ధికి చక్కని అవకాశాలున్నట్టు పేర్కొంది. కొన్ని ఎయిర్‌పోర్ట్‌ల్లో చార్జీల పెంపు, ప్రయాణికుల సంఖ్య పెరుగుదల రూపంలో ఈ ఆదాయం 2024–25 నుంచి వృద్ధి వేగాన్ని అందుకుంటుందని వెల్లడించింది. విస్తరణపై భారీ పెట్టుబడులు ‘‘ప్రయాణికుల రద్దీ ఏటా 9 శాతం వృద్ధికి.. విమాన ప్రయాణానికి బలమైన డిమాండ్‌కుతోడు విమానాశ్రయాలు, ఎయిర్‌లైన్స్ సంస్థలు సామర్థ్యాల విస్తరణ మద్దతుగా నిలవనుంది’’అని కేర్ఎడ్జ్ డైరెక్టర్ మౌలేష్ దేశాయ్ వివరించారు. దేశీ ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా కలసి 2020 మార్చి తర్వాత నుంచి 2024 డిసెంబర్ మధ్య రూ.80,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడాన్ని కేర్ఎడ్జ్ తన నివేదికలో ప్రస్తావించింది. ఇందులో 42 శాతం పెట్టుబడులను నాలుగు ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ల కోసం (కొత్తవి) వెచ్చించినట్టు తెలిపింది. 2025–26 నుంచి 2029–30 మధ్యకాలంలో ఈ రంగంలో మరో రూ.30,000 కోట్ల పెట్టుబడులను కేర్ఎడ్జ్ అంచనా వేసింది. ప్రధానంగా బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ల (ప్రస్తుత ఎయిర్‌పోర్టులు) విస్తరణపై ఈ పెట్టుబడులను వెచ్చించొచ్చని అంచనా వేసింది. రూ.25,000 కోట్లతో నిర్మించే రెండు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు 2025–26లో కార్యకలాపాలు ప్రారంభించొచ్చని తెలిపింది. పెట్టుబడుల్లో 18 శాతాన్ని నాన్ఏరోనాటికల్ అభివృద్ధిపై (ఎయిర్పోర్ట్ పరిసరాల్లో వాణిజ్య రియల్ ఎస్టేట్) వెచ్చించొచ్చని అంచనా వేసింది. ఈ విషయంలో సింగపూర్ ఛాంగి విమానాశ్రయాన్ని ఉదహరణగా పేర్కొంది. నాన్ ఏరోనాటికల్ సదుపాయాలపై చేస్తున్న పెట్టుబడుల నుంచి వచ్చే ప్రతిఫలం వాటి రుణ పరపతిని నిర్ణయిస్తుందని తెలిపింది.

యూపీఐ.. రయ్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ఆధిపత్యమే కొనసాగుతోంది. చెల్లింపుల్లో ఉన్న సౌకర్యంతో యూపీఐ లావాదేవీలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 2024 ద్వితీయార్ధంలో (జూలై–డిసెంబర్) 9,323 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. 2023 సంవత్సరం ద్వితీయార్ధంలోని 6,577 కోట్ల లావాదేవీలతో పోల్చి చూస్తే 42 శాతం పెరిగాయి. విలువ పరంగా పోల్చి చూసినప్పుడు 2023 ద్వితీయ ఆరు నెలల్లో రూ.99.68 లక్షల కోట్ల లావాదేవీలు జరిగితే.. 2024 ద్వితీయార్ధంలో రూ.130.19 లక్షల కోట్లకు చేరాయి. ఈ వివరాలతో వరల్డ్‌లైన్ ఇండియా సంస్థ ‘డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్’ను విడుదల చేసింది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం ఈ మూడు సంస్థలు యూపీఐ లావాదేవీల్లో అధిక వాటాను కాపాడుకుంటున్నాయి. గత డిసెంబర్ నెల యూపీఐ లావాదేవీల్లో 93 శాతం ఈ మూడు సంస్థల ప్లాట్‌ఫామ్‌ల నుంచే జరిగాయి. విలువ పరంగా 92 శాతంగా ఉంది. యూపీఐ కాకుండా ఇతర డిజిటల్ చెల్లింపుల్లో క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు ఉన్నాయి. మర్చంట్ చెల్లింపుల్లో అధిక వృద్ధి.. యూపీఐ చెల్లింపులను వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీ2పీ), వ్యక్తుల నుంచి వ్యాపారస్థులకు (పీ2ఎం) అని రెండు విభాగాలుగా వర్గీకరిస్తారు. ఇందులో పీ2పీ లావాదేవీల సంఖ్య 2023 ద్వితీయ ఆరు నెలల్లో 2704 కోట్లుగా ఉంటే, 2024 ద్వితీయ ఆరు నెలల్లో 3,521 కోట్లకు పెరిగాయి. అంటే 30 శాతం వృద్ధి కనిపించింది. ఇదే కాలంలో పీ2పీ లావాదేవీల విలువ 26 శాతం పెరిగింది. పీ2ఎం లావాదేవీల సంఖ్య 3,873 కోట్ల నుంచి 5,803 కోట్లకు పెరగ్గా (50 శాతం వృద్ధి).. విలువ పరంగా 43 శాతం వృద్ధి చెందింది. 2024 ద్వితీయ ఆరు నెలల్లో ఒక్కో యూపీఐ లావాదేవీ సగటు విలువ రూ.1,396గా ఉంది. 2023 ద్వితీయ ఆరు నెలల్లో ఉన్న రూ.1,515తో పోల్చితే 8% తగ్గింది. ‘‘భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అసాధారణ వృద్ధిని చూస్తోంది. ఎక్కువ మంది యూపీఐ వినియోగానికి మొగ్గు చూపిస్తున్నారు. పీవోఎస్ సదుపాయాల విస్తరణతోపాటు, మొబైల్ లావాదేవీలకు ప్రాధాన్యం పెరుగుతోంది’’అని వరల్డ్‌లైన్ ఇండియా సీఈవో రమేష్ నరసింహన్ తెలిపారు.

ఏజెంటిక్ ఏఐలో భారత్ టాప్!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధకు సంబంధించి ఏజెంటిక్ ఏఐ వినియోగంలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోంది. దేశీయంగా పలు వ్యాపార సంస్థలు దీనిపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. దాదాపు 80 శాతం సంస్థలు తమ అవసరాల కోసం సొంతంగా ఏఐ ఏజెంట్లను తయారు చేసుకోవడంపై ఆసక్తిగా ఉన్నాయి. భారత్‌లో జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ వినియోగం తీరుతెన్నులపై డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 80 శాతం భారతీయ సంస్థలు అటానమస్ ఏజెంట్లను తయారు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఏజెంటిక్ ఏఐ విషయంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకోవడాన్ని ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. 70 శాతం కంపెనీలు జెన్ఏఐని ఆటోమేషన్ కోసం ఉపయోగించుకోవడంపై ఆసక్తి కనపర్చగా, సగానికి పైగా కంపెనీలు దాదాపు పది జెన్ఏఐ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి.మనిషి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా, స్వతంత్రంగా నిర్దిష్ట పనులను పూర్తి చేసేందుకు ఉపయోగపడే ఏఐ సిస్టమ్‌లను అటానమస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. వివిధ పనులు, ప్రక్రియలను ఆటోమేట్ చేసేందుకు వీటిని వినియోగించుకునే విధానాన్ని ఏజెంటిక్ ఏఐగా పరిగణిస్తారు. ఈ సాంకేతికతపై ఆసక్తి పెరుగుతుండటమనేది .. కొత్త ఆవిష్కరణలు, సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు ఏఐని ఉపయోగించుకునే విధానంలో వస్తున్న మార్పులను సూచిస్తోందని నివేదిక పేర్కొంది. సవాళ్లూ ఉన్నాయి.. ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ కొన్ని సవాళ్లూ ఉంటున్నాయి. తప్పిదాలు (36 శాతం), పక్షపాతం (30 శాతం), డేటా నాణ్యత (30 శాతం)లాంటివి భారీ స్థాయిలో వినియోగానికి సమస్యగా ఉంటున్నాయి. వెంటనే వినియోగించుకోవడానికి వీలుగా ఉండే రెడీమేడ్ ఏఐని ఎక్కువగా కంపెనీలు ఎంచుకుంటూ ఉండటంతో అవసరాలకు తగ్గట్లుగా వాటిలో పెద్దగా మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశాలు ఉండటం లేదు. పైపెచ్చు కొన్నాళ్లకు కొరగాకుండా పోయేలా ఉంటున్నాయి. తాము ప్రస్తుతం ఉపయోగిస్తున్న సొల్యూషన్స్ రెండేళ్లలోపే పనికి రాకుండా పోయే అవకాశం ఉందని 28 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఆశాభావంతో కంపెనీలు.. ఏఐని విస్తృతంగా వినియోగించుకోవడంపై సవాళ్లు నెలకొన్నప్పటికీ వచ్చే రెండేళ్లలో వాటిని అధిగమించగలమని దేశీ కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్న ఈ రంగంలో వృద్ధి చెందేందుకు, అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ మౌమితా సర్కార్ తెలిపారు. కొన్ని దేశీ సంస్థలు సొంతంగా తయారు చేసుకోవడం కాకుండా ఏఐ సొల్యూషన్స్‌ను కొనుక్కోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా మల్చుకోగలిగేలా వాటిని తీర్చిదిద్దాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ పురోగమనంలో ముందంజలో ఉండేందుకు, దీర్ఘకాలంలో అధిక ప్రయోజనాలను పొందేందుకు, పరిస్థితులకు తగ్గట్లుగా మల్చుకోగలిగే ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సర్కార్ చెప్పారు. ఇటు వినియోగం వేగవంతం కావడం అటు దీర్ఘకాలంలో నిలబడగలిగే వ్యూహాలను అమలు చేయడం మధ్య సమతూకం పాటించడమే ఏఐపై పెట్టుబడులకు కీలకమని వివరించారు.
ఫ్యామిలీ

పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..
ఉరుకుల పరుగుల జీనవ విధానంలో అందరూ తమ కెరీర్ లక్ష్యాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే జీవిత పరమావధి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తలకు మించిన పనిభారానికి తోడు పోటీ వాతావరణానికి తగ్గట్లు దూసుకుపోవాలన్న ఒత్తడి కలగలసి శారీరక మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసున్నాయి. కొందరూ నిద్రను కూడా త్యాగం చేస్తూ ఎక్కువ గంటల కంప్యూటర్ స్క్రీన్లపైనే పనిచేస్తుంటారు. పాపం ఇలానే చేసి ఓ సీఈవో ఎంతటి పరిస్థితి కొని తెచ్చుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వుతారు. అంతేగాదు ఆరోగ్యం విషయంలో నాలాగా అంతా అయిపోయాక ఇప్పుడే తెల్లారిందన్నట్లుగా మేల్కోవద్దు అంటూ హితువు పలుకుతున్నారు.బెంగళూరుకి చెందిన డేజీఇన్ఫో మీడియా అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్ మిశ్రా లింక్డ్ఇన్లో తాను ఎదుర్కొన్న విషాదకర ఆరోగ్య పరిస్థితిని గురించి షేర్ చేసుకున్నారు. అతను తన ల్యాప్‌టాప్‌లో పనిచేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఒక విధమైన ఆయాసంతో కూడిన వైద్య అత్యవసర పరిస్థితి ఎదురైంది. ముందస్తుగా ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుంగా జరిగిన ఈ హఠాత్పరిణామం కారణంగా మిశ్రా ఆస్పత్రిపాలయ్యారు. వైద్యులు అతడిని ఐసీయూకి తరలించి సత్వరమే చికిత్స అందించారు. అప్పుడే ఆయన రక్తపోటు అనుహ్యంగా 230కి పెరిగిపోయి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. వైద్యులు సైతం అమిత్ మిశ్రా పరిస్థితిని చూసి షాకయ్యారు. ఇంతలా రక్తపోటు ఎందుకు పెరిగిపోయిందని తెలియక వైద్యులు కూడా కాస్త గందరగోళానికి గురయ్యారని పోస్ట్‌లో తెలిపారు మిశ్రా. "అయితే దీనంతటికీ కారణం.. పనికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నా.. విషయాన్ని విస్మరించడమే. పనే ముఖ్యం అనుకుంటాం. కానీ అది చేయాలంటే ముందు మన ఆరోగ్యం అంతే ముఖ్యం అని అనుకోం. ఆఖరికి శరీరం ఇచ్చే సంకేతాలను కూడా పట్టించుకోం. బాగానే ఉన్నామనే ధీమాతో ఉండిపోతాం. ప్లీజ్ మిత్రమా..ఈ పోస్ట్‌ని గనుక చదువుతుంటే మనం శరీరం చెప్పేది వినండి..దాని బాధను గుర్తించండి." అని పోస్ట్‌లో రాసుకొచ్చారు మిశ్రా. నెటిజన్లు ఆ పోస్ట్‌కి స్పందిస్తూ..వృత్తిపరమైన జీవితం కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ తమ అనుభవాలనే షేర్ చేయడమే గాక మిశ్రా త్వరితగతిన కోలుకోవాలని పోస్టులు పెట్టారు.(చదవండి: 40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?)

టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా?
అమెరికాలో మీజిల్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్లు , ఆటిజం మధ్య సంబంధంపై విస్తృత చర్చ జరుగుతోంది. సీడీసీ(CDC), WHO చేసిన విస్తృతమైన అధ్యయనాలతో సహా పరిశోధనలు వ్యాక్సిన్లు , ఆటిజం మధ్య ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించాయి. ఆటిజం ప్రధానంగా జన్యు, పర్యావరణ కారణాలుగా వస్తోందని భావిస్తున్నారు. టీకాలు నిజంగా ఆటిజానికి కారణం కానపుడు, సైన్స్ ప్రకారం దానికి కారణమేమిటి? World Autism Awareness Day డే సందర్బంగా అటిజానికి నివారణ, చికిత్స తదితర వివరాలు తెలుసుకుందాం. టీకాల కారణంగా ఆటిజం వస్తుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే. టీకాలకూ, ఆటిజంకు సంబంధం లేదు. పిల్లలందరికీ ఏ వయసులో ఇప్పించాల్సిన టీకాలు యథావిధిగా ఆవయసులో ఇప్పించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రవర్తనకు అనుగుణంగా మందులు ఇవ్వడమే...ఆటిజంకు ఎలాంటి మందులూ అందుబాటులో లేవు. విటమిన్లు, గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డైట్లు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వీళ్లలో ఫిట్స్ (మూర్ఛ) వంటి అనుబంధ సమస్యలు లేదా ఇతర తీవ్రమైన ప్రవర్తనకు సంబంధించిన మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) ఉన్నప్పుడు వాటికి సంబంధించి మాత్రమే మందులు వాడాల్సి ఉంటుంది. - డా. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్ బుద్ధిమాంద్యం అనే అపోహ ఉందిఆటిజం అంటే అది ఒక రకమైన బుద్ధిమాంద్యత అని కొందరు అపోహ పడుతుంటారు. చాలా కేసుల్లో మిగతా అందరు పిల్లల్లా అందరితోనూ కమ్యూనికేట్ చేయలేకపోవడమే వీరిలో ఉండే లోపం. నిజానికి చాలామంది నార్మల్ చిన్నారుల కంటే చాలా ఎక్కువ ఐక్యూను ప్రదర్శించేవారూ ఈ పిల్లల్లో ఉంటారు. మెదడు వికాసం లేకపోవడం అన్నది.. సమçస్య తీవ్రత ఎక్కువగా ఉన్న దాదాపు మూడోవంతు పిల్లల్లో మాత్రమే ఉంటుంది. వీరి విషయంలో ఏ అంశంలో వికాసం కొద్దిగా ఆలస్యం జరుగుతోందో ఆ అంశంలో శిక్షణ ఇస్తే వాళ్లు నార్మల్ పిల్లల్లానే పెరగగలుగుతారు. -డా.ప్రభ్‌జ్యోత్ కౌర్ సీనియర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ఎంత త్వరగా సమస్య గుర్తిస్తే అంత మంచిదిఆటిజం ఫలానా కారణం వల్ల వస్తుందని చెప్పలేం. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలకు సమాధానాలను పరిశోధకులు ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. అయితే ఆటిజం పిల్లలను గుర్తించి, వారికి సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సమస్య పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఉంది. పట్టణాల్లో తమ పిల్లలకు ఆటిజం సమస్య ఉందని తెలిస్తే పరువు పోతుందేమో అనుకునేవారూ ఉన్నారు. పిల్లలు చూడటానికి బాగానే ఉన్నారు కదా, మనస్తత్వంలో మార్పు అందే వస్తుందిలే అని సరిపెట్టుకునేవారూ ఉన్నారు. కానీ, ఆటిజం సమస్య ఉన్న పిల్లలను చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. వారికి అర్ధమయ్యే విధంగా ఒక్కో అంశాన్ని పరిచయం చేయాలి. అందుకు చాలా ఓర్పు, శిక్షణ ఇచ్చే టీచర్లు అవసరం. ప్లే స్కూల్స్, ప్రైమరీ స్కూళ్ల నుంచే అవగాహన తరగతులు నిర్వహించాలి. టీచర్లు, తల్లిదండ్రులూ ఈ సమస్యను ఎంత త్వరగా గుర్తించి, శిక్షణ ఇస్తే అంత మంచిది. -పి. హారికారెడ్డిబిహేవియర్అనలిస్ట్, యాధా ఏబీఏ సెంటర్,అత్తాపూర్,హైదరాబాద్ఓపికగా నేర్పాలిఆటిజం అనేది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. దీని బాధిత పిల్లల్లో కమ్యూనికేషన్ సమస్య ఉంటుంది. సమస్య ఉన్న పిల్లల్లో స్టీరియోటైపిక్ బిహేవియర్ (ఒకే పనిని పదేపదే చేయడం) ఉంటుంది. ఇలాంటివారిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోపగించుకోవడం, వేరుగా చూడడం చేయకూడదు. ఇతరులతో ఎలా మాట్లాడాలి, ప్రవర్తించాలో ఓపికగా నేర్పాలి. -డాక్టర్ వై.ప్రదీప్చిన్న పిల్లల వైద్యులు, డైక్ సెంటర్ తిరుపతి3 స్థాయిల్లో ఆటిజమ్పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత ఆధారంగా దీనిని ప్రధానంగా మూడు స్థాయిలుగా విభజించారు. మైల్డ్ ఆటిజం: పిల్లల వికాసంతక్కువగా (30% వరకు) ప్రభావితం అవుతుంది. మాడరేట్ ఆటిజం : వీరిలో వికాసం 30% నుంచి 60% లోపు ప్రభావితమవుతుంది. సివియర్ ఆటిజం: వికాసం చాలాఎక్కువగా ప్రభావితమవుతుంది.అంటే 60 శాతానికి పైగా.నేర్చుకోవడానికి సంబంధించి కొన్ని సమస్యలు» ఈ చిన్నారుల్లో నేర్చుకోవడానికి సంబంధించిరకరకాల సమస్యలు కనిపించవచ్చు. వాటిల్లో కొన్ని.. » జ్ఞానేంద్రియాల నుంచి లభ్యమయ్యే సమాచారాన్ని సరిగావిశ్లేషిoచుకోలేకపోవడం (సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ – ఎస్పీడీ). » నేర్చుకునే ప్రక్రియ సరిగా జరగకపోవడం (లెర్నింగ్ డిజార్డర్–ఎల్డీ). » కొంతమంది చిన్నారుల్లో ప్రవర్తనకు సంబంధించిన రుగ్మతలు(బిహేవియరల్ డిజార్డర్స్) ఉంటాయి. అంటే నలుగురితో కలవలేరు. అకారణంగా ఏడుస్తూ ఉంటారు. » కొందరిలో ఆటిజంతో పాటు మూర్ఛ వంటి నాడీ సంబంధిత రుగ్మతలుండవచ్చు. ఎందుకుఇలాంటి సమస్యలు?ఆటిజంకు కారణాలుతెలుసుకోడానికి ఇప్పటికీపెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ నిర్దిష్టమైన కారణాలేమీ ఇంకా తెలియరాలేదు. అయితే కొన్ని అధ్యయనాల్లో ఆటిజంకు గురికావడానికి కారణాలను కొంతవరకు తెలుసుకున్నారు. అవి... » కొంతమేరకు జన్యుపరమైన కారణాల వల్ల దీని బారిన పడుతున్నారు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, మెదడులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు సంబంధిత అంశాల్లో లోపాల వల్ల.. » బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి జెస్టేషనల్ డయాబెటిస్‌కు, హార్మోన్ల అసమతుల్యతకు లోను కావడం, గర్భధారణకు ముందు ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్లకు గురికావడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనుకావడం వల్ల..» గర్భంతో ఉన్నప్పుడు వాడిన, వాడకూడని కొన్ని మందుల వల్ల.. ఆ అధ్యయనాల్లోదేశంలో ఆటిజంతో బాధపడే చిన్నారుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం.. తొమ్మిదేళ్ల వయస్సులోపు చిన్నారుల్లో 1 నుంచి 1.5 శాతం పిల్లలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని ఐఏపీ స్పష్టం చేస్తోంది. తెలంగాణలో ఎంతమంది ఉంటారనే దానిపై గణాంకాలు అందుబాటులో లేవు. అయితే తెలంగాణలో 0–9 ఏళ్ల వయస్సు చిన్నారులు 60 లక్షల వరకు ఉంటారని అర్ధ గణాంక శాఖ నివేదికను బట్టి తెలుస్తోంది. ఇందులో ఒక శాతాన్ని లెక్కిస్తే 60 వేల మంది, 1.5 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే 90 వేల మంది వరకు చిన్నారులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. సాధారణంగా ఈ సమస్య మగపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆటిజంలోని రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.ఏం చేయాలి మరి.. ?దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాలి. పిల్లల్లో సమస్యను గుర్తించిన వెంటనే చికిత్సకు తీసుకెళ్లాలి. ఎంత త్వరగా చికిత్స చేయిస్తే అంత త్వరగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. 2 ఏళ్ల వయస్సు లోపు గనుక గమనిస్తే సులభంగా బయటపడే చాన్స్ ఉంటుందని అంటున్నారు. ఆటిజం లక్షణాలు కనబరచే పిల్లలకు.. కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలూ సమాధానాల ఫార్మాట్లో నిర్వహించే పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారించవచ్చు. ఈ జబ్బు ఉన్నవారిలో ఫిట్స్ వంటి న్యూరలాజికల్ సమస్యలు ఉన్నప్పుడే ఎమ్మారై, ఈఈజీ, మెటబాలిక్ డిజార్డర్ స్క్రీనింగ్ వంటివి అవసరం.ఎలాంటి మందులూ లేవు.. ఈ రుగ్మతకు ఎలాంటి మందులూ లేవు. విటమిన్లు, గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డైట్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఫిట్స్ లేదా ఇతర తీవ్రమైన ప్రవర్తనకు సంబంధించిన మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) ఉన్నప్పుడు మాత్రమే మందులు వాడాల్సి ఉంటుంది. రకరకాల థెరపీలతోనే చికిత్సచిన్నారుల వ్యక్తిగత లక్షణాలూ, భావోద్వేగ పరమైన అంశాలను బట్టి న్యూరో స్పెషలిస్టులు, సైకాలజిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, బిహేవియరల్ థెరపిస్టులు ఇలా అనేక మంది స్పెషలిస్టుల సహాయంతో, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ వంటి ప్రక్రియలతో సమీకృత చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు అవసరమైన విద్య అందించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సికింద్రాబాద్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్’(ఎన్ఐఈపీఐడీ) వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ చిన్నారుల కనీస స్వావలంబన కోసం పలు సామాజిక సంస్థలు, ఎన్జీవోలు కూడా పనిచేస్తున్నాయి. అటిజమ్ ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారుతోంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావడం, పిల్లలతో గడిపే తీరిక లేకపోవడం, ఎక్కువగా స్క్రీన్కు అడిక్ట్ కావడం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.పుట్టగొడుగుల్లా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్...ఆటిజంకు థెరపీ పేరిట నగరాల్లో ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లు, చైల్డ్ రిహాబిలేటేషన్ సెంటర్లు వెలుస్తున్నాయి. వీటి నిర్వాహకులు అర్హత కలిగిన థెరపిస్ట్‌లు కాకపోయినా..కేవలం ఆయాలను నియమించుకుని ఇలాంటి సెంటర్లు నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ఎన్జీవో సంస్థలు నిబద్ధతతో పనిచేస్తుంటే.. కొందరు పూర్తిస్థాయి వ్యాపారంలా నిర్వహిస్తున్నారు. ఒక్కో పిల్లాడిపై నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించకపోవడం, నిర్వహణ, నియంత్రణ లేకపోవడం వల్ల స్పీచ్ థెరపీ కేంద్రాలు ఇష్టానుసారం వెలుస్తున్నాయి. ఒక ఆసుపత్రి ఏర్పాటు చేయాలంటే ఆసుపత్రి భవనం, అందులో అర్హతగల డాక్టర్లు, నర్సులు, ఆయాలు, పడకలు తదితర సౌకర్యాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటాయి. కానీ ఈ పునరావాస కేంద్రాలకు ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు..» ఆటిజం ఒక వైకల్యంగా గుర్తింపు.. » పునరావాస కేంద్రాలు నడిపించే ఎన్జీవోలకు ఆర్థిక సాయం » వైకల్యంతో బాధపడేవారికి సంబంధించిన హక్కుల చట్టాన్ని వీరికి కూడా వర్తింపచేయడం ద్వారా విద్యలో, పునరావాసంలో సహాయం » ఆటిజం బాధితులకు ఉన్నత విద్య అభ్యాసానికి ఆర్థికసాయం » వీరికి యూనిక్ డిజెబిలిటీ (విశిష్ట వైకల్యం) గుర్తింపు కార్డు ఇవ్వడం » రూ 2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించడం » ఆటిజం తగ్గింపునకు అవసరమైన పరికరాలు కొనుగోలుకు ఆర్థిక సాయం.» పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, స్వయం ఉపాధికి రుణాలు మంజూరు, నైపుణ్య శిక్షణ. » ప్రాంతాల వారీగా సంగీత, నృత్య కచేరీలు ఏర్పాటు » రాష్ట్రంలో ఇప్పటివరకు ఆటిజంతో బాధపడుతున్న వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు లాంటి చర్యలు చేపట్టక పోవడం గమనార్హం.

40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎలాంటి దీర్ఘవ్యాధుల బారినపడకుండా సాగే చక్కటి వృద్ధాప్య జీవితం కొనసాగించడం ఎలా అనేది శాస్తవేత్తలను వేధిస్తున్న చిక్కు ప్రశ్న. మనం తినే ఆహారం వృద్ధాప్యానికి ఏమైనా లింక్ ఉందా? అనే దిశగా విస్తృతమైన పరిశోధనలు చేశారు. అయితే దానికి తాజాగా చేసిన పరిశోధనల్లో సరైన సమాధానం దొరికిందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఆహారం వృద్ధాప్యాన్ని ఎలా డిసైడ్ చేస్తుందో నిర్థారించామని చెప్పారు. కేవలం ఎక్కువ కాలం జీవించడమే లక్ష్యం కాదని మెరుగ్గా జీవించడమనేది అత్యంత ప్రధానమంటూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అవేంటో చూద్దామా..!.నిపుణుల అభిప్రాయం ప్రకారం..సమతుల్య ఆహారం, దీర్ఘాయువు, మెదడు పనితీరుతో సహా మొత్తం ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుందని అన్నారు. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు మంటను తగ్గించడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, శారీరక విధులకు మద్దతు ఇవ్వడానికి సహాపడతాయని చెప్పారు. అందుకోసం 30 ఏళ్ల లోపు వయసున్న దాదాపు ఒక లక్ష మందికి పైగా వ్యక్తుల ఆహారపు అలవాట్లను ట్రాక్ చేశామని చెప్పుకొచ్చారు. వారంతా తీసుకున్న ఆహారం..అది వారి 70 ఏళ్ల వయసులోని ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిర్థారించామని చెప్పారు. ఆ క్రమంలోనే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం తీసుకోవాల్సిన సరైన ఎనిమిది ఆహార విధానాలను కూడా గుర్తించామని తెలిపారు. దాన్ని ఆరోగ్యకరమైన సూచిక(AHEI)గా వర్గీకరించారు. ఈ విధమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా నొక్కి చెప్పారు శాస్త్రవేత్తలు.ఆ ఆహారాలు ఏంటంటే..పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, చిక్కుళ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు(ఆలివ్ నూనె, చేప కొవ్వు) తదితరాలు మంచివని చెప్పారు. అదే సమయంలోఎరుపు మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాలు(జంక్‌ఫుడ్), శుద్ధిచేసిన ధాన్యాలు, అధిక సోడియం తదితరాలను నివారిస్తే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని అన్నారు. ఈ ఆహారపు అలవాట్లకు కాస్త దగ్గరగా ఉన్నవారు.. 70లలో మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్నట్లు వివరించారు. ఇలాంటి కొన్ని ఆరోగ్య సూత్రాలు ఆరోగ్యకరమైన జీవతానికి మద్దుతిస్తాయని చెప్పారు. అందుకోసం వివిధ రకాల రంగురంగుల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అసంతృప్త కొవ్వులు తదితర ఆహారపు అలవాట్లు ప్రాధాన్యత ఇస్తే..70లలో ఏ చీకు చింతా లేకుండా హాయిగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించగలుగుతారని అన్నారు పరిశోధకులు.(చదవండి: పొట్ట ఫ్లాట్‌గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత ఆ ఆరు ఆహారాలను నివారించండి!)

35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!
అంబానీ ఫ్యామిలీకి చెందిన 'చోటి బహు' రాధిక మర్చంట్ అందంలోనూ, ష్యాషన్ స్టైల్లోనూ ఎప్పుడూ స్పెషల్‌గా నిలుస్తుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధిక తన ట్రెండీ ఫ్యాషన్ లుక్స్‌తో అభిమానులను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆమె ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా చందేరీ చీరతో తన డ్రెస్‌ను వినూత్నంగా తీర్చి దిద్దిన వైనం ఆకర్షణీయంగా నిలిచింది. 35 ఏళ్ల వింటేజ్ కార్సెట్‌ను చందేరి చీరతో అందంగా స్టైల్ చేయడం హైలైట్‌గా నిలిచింది.అనంత్ అంబానీతో పెళ్లి సందర్భంగా రాధిక మర్చంట్ తన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు, అత్యంత ఘనంగా జరిగిన వెడ్డింగ్‌లో ఆమె ధరించిన ఒక్కో డ్రెస్ ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. హల్దీ వేడుకలు, మెహిందీ మొదలు సాంప్రదాయ దుస్తుల్లో కొత్త వధువుగా ఆమె లుక్స్ వరకు ప్రతీ వస్త్రాలంకరణలో అందరి హృదయాలను గెలుచు కుంది. తాజాగా రాధిక తనకు ఇష్టమైన స్టైలిస్ట్ రియా కపూర్ స్టైల్ చేసిన వింటేజ్ కార్సెట్నురీ మోడల్ చేసి కార్సెట్-సారీ ట్రెండ్ సృష్టించింది. సల్వార్-కమీజ్‌కు కూడా స్టైల్‌తో కనిపించేలా చందేరీ చీరతో 35 ఏళ్ల కార్సెట్‌ను రీ స్టైల్ చేసి ధరించడం ద్వారా మరోసారి ఫ్యాషన్ ముద్రను చాటుకుంది.ఏప్రిల్ 1న జరిగిన వివియన్నే వెస్ట్ వుడ్ షోకు హాజరైనప్పటి రాధిక ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో సందడి చేశాయి. వివియన్నే వెస్ట్ వుడ్ తయారు చేసిన పోర్ట్రెయిట్ కలెక్షన్ నుండి పురాతన కార్సెట్, స్కార్ఫ్ ధరించి కనిపించింది. ఇందులో ఫ్రెంచ్ కళాకారుడు ఫ్రాంకోయిస్ బౌచర్ రాసిన 'డాఫ్నిస్ అండ్ క్లో' (1743-174) పెయింటింగ్ కూడా ఉండటం విశేషం. వివియన్నే ఒక దుస్తులపై పెయింటింగ్‌ను పునరుత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఈ డ్రెస్ పద్దెనిమిదవ శతాబ్దపు ఆయిల్ పెయింటింగ్ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది అంటున్నారు ఫ్యాషన్ రంగ నిపుణులు చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!ఈ లుక్కు ముత్యాల చోకర్, మ్యాచింగ్ స్టడ్ చెవిపోగులతో స్టైల్ చేయడం మరో హైలైట్. ఈ గతంలో తన మంగళసూత్రాన్ని స్టైల్ చేసిన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మెడలో ధరించాల్సిన మంగళసూత్రాన్ని బ్రాస్లెట్గా ధరించిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన వివియన్ వెస్ట్‌వుడ్ ష్యాషన్ ఈవెంట్‌కు రాధికా మర్చంట్ అక్క అంజలి మర్చంట్ మరో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. స్టార్-స్టడెడ్ ఈవెంట్లో ఎమరాల్డ్ గ్రీన్ గౌనులో ఆమె అందంగా కనిపించారు. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s)
ఫొటోలు


స్టన్నింగ్ లుక్స్‌తో మైమరిపిస్తున్న సప్తమి గౌడ (ఫోటోలు)


కూతురు 'శివియా'తో హీరోయిన్ సంగీత.. వైరల్ ఫోటోలు చూశారా..?


ఖరీదైన అపార్ట్ మెంట్ అమ్మేసిన హీరో షారూక్ భార్య (ఫొటోలు)


Sharwanand : కుటుంబంతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శర్వానంద్ పూజలు (ఫోటోలు)


ఆ హెలికాప్టర్ షాట్‌కు 14 ఏళ్లు.. సిక్స్ కొట్టి ప్రపంచకప్ గెలిపించిన ధోని..! (ఫొటోలు)


ప్రముఖ కమెడియన్ రెడిన్ కింగ్స్లే భార్యకు సీమంతం (ఫొటోలు)


జాన్వీకే తలనొప్పిగా మారిన తమన్నా, ఎవరీమె (ఫోటోలు)


గ్రాండ్‌గా దిల్ రాజు కూతురు హన్సిత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)


తిరుమలలో ఆకాశ్ అంబానీ.. గోమాతకు విశేష పూజలు (ఫొటోలు)


బాంధవి శ్రీధర్ వాటే గ్లామర్... మతిపోగొడుతోన్న మసూద బ్యూటీ (ఫోటోలు)
అంతర్జాతీయం

ఏనుగు–డ్రాగన్ ‘ట్యాంగో’ చేయాలి
బీజింగ్: భారత్, చైనా దేశాలు కలిసికట్టుగా పని చేయాలని చైనా అధినేత జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి లక్ష్యాల సాధనకు మనమంతా చేతులు కలపాలని సూచించారు. ప్రాథమిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏనుగు–డ్రాగన్ కలిసి ‘ట్యాంగో’డ్యాన్స్ చేయాలని ఆకాంక్షించారు. భారత్–చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏళ్లవుతున్న సందర్భంగా భారత్‌కు ఆయన మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జిన్‌పింగ్ ఒక సందేశం పంపించారు. భారత్, చైనాలు ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాలని గుర్తుచేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశాలుగా, గ్లోబల్ సౌత్‌లో ముఖ్యమైన సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆధునీకరణ ప్రయత్నాల్లో ఇరుదేశాలూ ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు జిన్‌పింగ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవడానికి, భారత్–చైనా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి భారత్‌లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.కీలక రంగాల్లో పరస్పర సహకారం మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. జిన్‌పింగ్ సందేశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిస్పందించారు. స్థిరమైన సేŠన్హ సంబంధాలు, ద్వైపాక్షిక భాగస్వామ్యం మన రెండు దేశాలతోపాటు మొత్తం ప్రపంచానికి మేలు చేస్తాయని వివరించారు. భారత్–చైనా సంబంధాలను మరింత ఉన్నత స్థానానికి చేర్చడానికి ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా ఉపయోగించాలని పేర్కొన్నారు. మరోవైపు చైనా ప్రధాని లీ ఖెకియాంగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సైత పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఐస్లాండ్లో మళ్లీ బద్దలైన అగ్ని పర్వతం
లండన్: అట్లాంటిక్ సముద్ర ద్వీప దేశం ఐస్లాండ్లో మరోసారి అగ్ని పర్వతం బద్దలైంది. రెక్జానెక్ ద్వీపకల్పంలోని గ్రిండావిక్ పట్టణ సమీపంలోని అగ్ని పర్వతం నుంచి భారీగా లావా, పొగలు చిమ్ముతుండటంతో మంగళవారం అధికారులు అక్కడున్న 40 నివాసాలను ఖాళీ చేయించారు. ఐస్లాండ్లో అతిపెద్ద పర్యాటక ఆకర్షణగా ఉన్న బ్లూ లగూన్ జియోథర్మల్ స్పాను మూసివేశారు. దాదాపు 800 ఏళ్ల పాటు నిద్రాణంగా ఉన్న ఈ అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా లావా పెల్లుబకడంతో గతేడాదే ఇక్కడున్న వారందరినీ వేరే చోటుకు తరలించారు. ఉదయం 6.30 గంటలకు లావా ప్రవాహం మొదలై గ్రిండావిక్‌కు ఉత్తరంగా ఏర్పాటు చేసిన రక్షణ బారియర్‌ను దాటుకుని 500 మీటర్ల పొడవున ప్రవహిస్తోందని వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తర అట్లాంటిక్‌లోని అగ్ని పర్వతాలకు కేంద్రమైన ప్రాంతంలో ఐస్లాండ్ ఉంది. 2010లో ఇక్కడి అగ్ని పర్వతం విస్ఫోటంతో భారీగా వాతావరణంలోకి వెదజల్లిన బూడిద మేఘాలు కొన్ని నెలలపాటు అట్లాంటిక్ మీదుగా విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగించాయి.

మాండలే.. మరుభూమి
మాండలే: మయన్మార్ భూకంపం దేశంలో రెండో అతి పెద్ద నగరమైన మాండలేను మరుభూమిగా మార్చేసింది. నగరంలో మూడొంతులకు పైగా భవనాలు కుప్పకూలాయి. అవన్నీ క్రమంగా శవాల దిబ్బలుగా మారుతున్నాయి. మౌలిక సదుపాయాల లేమితో శిథిలాల వెలికితీత నత్తనడకన సాగుతోంది. వాటికింద వేలాదిమంది చిక్కుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. భూకంపం సంభవించి ఐదు రోజులు కావస్తుండటంతో వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు దాదాపుగా సన్నగిల్లుతున్నాయి. కుళ్లుతున్న శవాలతో మాండలే వీధుల్లో ఇప్పటికే భరించలేనంతటి దుర్గంధం వ్యాపించింది.దీనికితోడు మంగళవారం సాయంత్రం కూడా మాండలేను మరో భూకంపం వణికించింది. 5.1 తీవ్రత భూమి కంపించడంతో ఇప్పటికే దెబ్బతిని పగుళ్లిచ్చిన చాలా భవనాలు కుప్పకూలాయి. దాంతో జనం హాహాకారాలు చేస్తూ రోడ్లపైకి పరుగులు తీశారు. రాత్రంతా ఆరుబయటే జాగారం చేస్తూ గడిపారు. దేశవ్యాప్తంగా భూకంప మృతుల సంఖ్య 2,700, క్షతగాత్రుల సంఖ్య 5,000 దాటాయి. వారి స్మృత్యర్థం మంగళవారం మధ్యాహ్నం దేశవ్యాప్తంగా ప్రజలు నిమిషం పాటు మౌనం పాటించారు. మయన్మార్‌లో 10 వేలకు పైగా భవనాలు కూలిపోయినట్టు ఐరాస పేర్కొన్న నేపథ్యంలో మృతుల సంఖ్య అపారంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రతికూల వాతావరణం కూడా సహాయక చర్యలకు పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. మంగళవారం దాకా విపరీతమైన ఎండ కాయగా బుధవారం నుంచి భారీ వర్ష సూచనలు ఆందోళనగా మారాయి. బ్యాంకాక్‌లో 21 మంది...థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భూకంపానికి 21 మంది బలైనట్టు ఇప్పటిదాకా తేలింది. కుప్పకూలిన నిర్మాణంలోని 30 అంతస్తుల భవనం వద్ద శిథిలాల తొలగింపు ఇంకా కొనసా గుతోంది. అందులో పని చేస్తున్నవారిలో 78 మంది ఆచూకీ తేలడం లేదని అధికారులు తెలిపారు. దానికింద చిక్కినవారి సంఖ్య 300 దాకా ఉంటుందని అనధికారిక అంచనాలు చెబుతున్నాయి.పాపం పసివాళ్లు!మాండలేకు 40 కి.మీ. దూరంలోని క్యౌక్సే పట్టణంలో ఓ ప్రీ స్కూల్లో 70 మంది చిన్నారుల్లో అత్యధికులు భూకంపానికి నిస్సహాయంగా బలయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. జరిగిన దారుణాన్ని తలచుకుంటూ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ గుండెలవిసేలా రోదిస్తున్నారు. మాండలే సమీపంలో కుప్పకూలిన ఓ బౌద్ధారామం శిథిలాల నుంచి ఇప్పటిదాకా 50 మందికి పైగా సన్యాసుల మృతదేహాలను వెలికితీశారు. వాటికింద నలిగి కనీసం మరో 150 మంది మరణించి ఉంటారని చెబుతున్నారు.మృత్యుంజయులుమయన్మార్ రాజధాని నేపిడాలో భవన శిథిలాల నుంచి ఓ 63 ఏళ్ల వృద్ధురాలు, ఆమె మనవరాలు ఏకంగా 91 గంటల తర్వాత మంగళవారం ప్రాణాలతో బయటపడ్డారు. మరోచోట ఓ ఐదేళ్ల చిన్నారిని, గర్భిణిని కూడా సహాయక బృందాలు కాపాడాయి.

టారిఫ్‌లకు వేళాయె
న్యూయార్క్/వాషింగ్టన్/రోమ్/టోక్యో: ప్రపంచ వాణిజ్య యుద్ధానికి వేళైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పగా ప్రకటించుకుంటూ వస్తున్న ‘విముక్తి దినం’ రానే వచ్చింది. ప్రపంచ దేశాలపై అగ్ర రాజ్యం ప్రతీకార సుంకాల బాదుడు బుధవారం నుంచే మొదలవనుంది. ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతోంది. అమెరికాతో పాటు చాలా దేశాల్లో స్టాక్‌మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. భారత్‌కు కూడా భారీ వడ్డింపులు తప్పవని వైట్‌హౌస్ తాజాగా స్పష్టం చేసింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘అమెరికా వ్యవసాయోత్పత్తులు తదితరాలపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తోంది. మా పాడి ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ దేశాలు 50 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తున్నాయి. జపాన్ అయితే మా బియ్యంపై ఏకంగా 700 శాతం టారిఫ్‌లు విధించింది. మా బటర్, చీజ్ తదితరాలపై కెనడా 300 శాతం టారిఫ్‌లు వడ్డిస్తోంది. ఈ దేశాలన్నీ నడ్డి విరిచే టారిఫ్‌లతో అమెరికాను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఆయా దేశాలకు మా ఎగుమతులను అసాధ్యంగా మార్చేశాయి’’ అంటూ ఆక్షేపించారు. ‘‘ఇక ప్రతీకారానికి వేళైంది. వాళ్లకు అంతకు అంతా వడ్డించబోతున్నాం.అమెరికా ప్రజల సంక్షేమం దిశగా అధ్యక్షుడు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి రానుంది’’ అని పునరుద్ఘాటించారు. ఏయే దేశాలపై ఏ రంగంలో ఎంత సుంకాలు విధించబోయేదీ అధ్యక్షుడే స్వయంగా ప్రకటిస్తారని ఆమె తెలిపారు. ఈ టారిఫ్‌లు ఆరంభం మాత్రమేనని, వాటిని త్వరలో భారీగా పెంచుతామని ట్రంప్ ఇప్పటికే పేర్కొనడం తెలిసిందే. ‘‘అమెరికాపై టారిఫ్‌లను భారత్ భారీగా తగ్గిస్తోంది. చాలా దేశాలు కూడా అదే బాటన నడుస్తున్నాయి’’ అని సోమవారం ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు. మా ప్లాన్లు మాకున్నాయి: ఈయూ అమెరికా టారిఫ్‌లకు బెదిరేది లేదని యూరోపియన్ యూనియన్ స్పష్టం చేసింది. వాటిని ఎదుర్కోవడానికి తమ వద్ద గట్టి ప్రణాళికలున్నాయని ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ చెప్పారు. మంగళవారం ఆమె ఈయూ పార్లమెంటులో మాట్లాడారు. అమెరికావి తప్పుడు చర్యలని ఆక్షేపించారు. ‘‘మేం మొదలు పెట్టిన యుద్ధం కాదిది. అగ్ర రాజ్యానికి దీటుగా బదులిస్తాం. టారిఫ్‌ల బారినుంచి మా ప్రజలను, ఆర్థిక వ్యవస్థలను అన్నివిధాలా కాపాడుకుని తీరతాం’’ అని ప్రకటించారు. ‘‘మేం ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్.ఎలాంటి బేరసారాలకైనా కావాల్సినన్ని శక్తియుక్తులు మాకున్నాయి’’ అన్నారు. ‘‘కొన్ని అంశాల్లో అమెరికాకు అన్యాయం జరుగుతోందని ట్రంప్ భావిస్తుంటే, పలు అంశాల్లో మా విషయంలోనూ అదే జరుగుతోందన్నది మా అభిప్రాయం. వీటిపై చర్చలకు మేం సిద్ధమే. ఎందుకంటే టారిఫ్‌ల రగడ అంతిమంగా ప్రజలపైనే భారం వేస్తుంది. వారి జీవన వ్యయం పెరుగుతుంది’’ అని చెప్పారు. టారిఫ్ బాదుడు నుంచి జపాన్ను మినహాయించాలని ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబా మరోసారి ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే వాషింగ్టన్ వెళ్లి ఆయనతో చర్చించేందుకు కూడా సిద్ధమన్నారు.దేశీయ మార్కెట్ల పరిరక్షణకే టారిఫ్‌లపై కేంద్రం ప్రకటనన్యూఢిల్లీ: భారత్‌కు అమెరికాయే అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ నేపథ్యంలో టారిఫ్‌ల పెంపుతో పడే ప్రభావాన్ని కేంద్ర వాణిజ్య శాఖ నిశితంగా గమనిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. వాణిజ్య నియంత్రణ, దేశీయ మార్కెట్ల పరిరక్షణే లక్ష్యంగా భారత్ సుంకాలు విధిస్తుందని స్పష్టం చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద మంగళవారం లోక్‌సభలో ఈ మేరకు ప్రకటన చేశారు.హెచ్చు టారిఫ్‌లు దేశానికి మేలు చేయడం లేదని, ఆర్థిక వృద్ధి కోసం వాటిని తగ్గించడం తప్పనిసరని నీతీ ఆయోగ్ ఇటీవల చేసిన ప్రకటనపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. ఆర్థిక వృద్ధికి మరింత ఊతమివ్వడం ద్వారా ప్రపంచ మార్కెట్లో భారత్‌ను ప్రబల శక్తిగా తీర్చిదిద్దాలన్నది తమ దీర్ఘకాలిక లక్ష్యమని వెల్లడించారు. ‘‘పలు దేశాలతో టారిఫ్‌ల సమతుల్యత సాధించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం పలు దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి’’ అని గుర్తు చేశారు. ప్రస్తుతం 13 దేశాలతో భారత్ ఎఫ్‌టీఏలు చేసుకుంది. అమెరికా, ఈయూ, బ్రిటన్, న్యూజిలాండ్, ఒమన్, పెరు వంటి దేశాలతో ఎఫ్‌టీఏపై చర్చలు జరుగుతున్నాయి.ఇదీ పరిస్థితి!అమెరికా వస్తువులు, ఉత్పత్తులపై భారత్ ప్రస్తుతం సగటున 18 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తోంది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా టారిఫ్‌లు సగటున 2.8 శాతం మాత్రమే. భారత వ్యవసాయ ఎగుమతులపై అమెరికా 5.3 శాతం సుంకాలు విధిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయోత్పత్తులపై మాత్రం భారత్ 37.7 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. ఇరు దేశాల మధ్య దాదాపు 30 రంగాల్లో వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయి. దాదాపుగా ప్రతి రంగంలోనూ భారతే అమెరికాపై హెచ్చు సుంకాలు విధిస్తోంది.దాంతో ఇరు దేశాల మధ్య టారిఫ్‌ల అంతరం ఆటోమొబైల్స్ రంగంలో 23.1 శాతం, వజ్రాలు, బంగారం, ఆభరణాల్లో 13.3, కెమికల్, పార్మా రంగంలో 8.6, ఎలక్ట్రానిక్స్‌పై 7.2, ప్లాస్టిక్స్‌పై 5.6, కంప్యూటర్లు, యంత్రాలపై 5.3, ఇనుము, స్టీల్‌పై 2.5, టెక్స్టైల్స్, క్లా్లతింగ్లో 1.4 శాతంగా ఉంది. భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికాదే 18 శాతం వాటా. ఆ దేశం నుంచి మాత్రం దిగుమతులు 6.22 శాతమే. ద్వైపాక్షిక వాణిజ్యంలో ఈ 10.73 శాతం లోటుపైనా అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
జాతీయం

ఊహించని విషాదం.. రిటైర్మెంట్ రోజే అనంతలోకాలకు
ఇది మాటలకందని విషాదం.. ఊహించని ఘటన ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రెండు గూడ్స్ ట్రైన్ల డ్రైవర్లు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో మృతి చెందిన లోకో పైలట్ గంగేశ్వర్ ఏప్రిల్ 1న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. అదే రోజే ఆయన అనంత లోకాలకు పయనమయ్యారు.ఇక తమ కుటుంబంతో ఆనందంగా గడపొచ్చనే ఆయన కలలు ఆవిరైపోవడంతో పాటు కుటుంబ సభ్యులకు ఊహించని విషాదమే మిగిలింది. రిటైర్మెంట్ రోజు ఆయనతో కలిసి విందు చేసుకోవాలని ఎదురు చూస్తున్న కుటుంబానికి కన్నీరే మిగిలింది.విధి నిర్వహణలో చివరి రోజున తోటి ఉద్యోగులతో సరదాగా గడిపి.. ఎన్నో జ్ఞాపకాలతో తిరిగి వస్తాడనుకున్న తన తండ్రి ఇంకెప్పటికీ రాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ ఆయన కూతురు విలపించింది. రేపటి నుంచి ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటానని ఆనందంగా చెప్పి వెళ్లిన తండ్రి.. ప్రమాదంలో మృతి చెందడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Heatwave Alert: భానుడి భగభగ .. మారిన ప్రభుత్వ కార్యాలయాల ఆఫీస్ టైమింగ్స్
బెంగళూరు,సాక్షి: మార్చి తొలి వారం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మాడు పగిలే ఎండలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఈ తరుణంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీస్ టైమింగ్స్ మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరో తరుముకొచ్చినట్టు ఈసారి చాలాముందుగానే ఎండాకాలం వచ్చిపడింది. ఫిబ్రవరి నుంచే సెగలూ పొగలూ ఎగజిమ్మిన సూరీడు అంతకంతకూ తన ప్రతాపాన్ని పెంచుతూ పోతున్నాడు. రోజూ నమోదవుతున్న ఉష్ణోగ్రతలను చూస్తుంటే భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించినట్టు నిరుటికన్నా వేసవితాపం మరింత అధికంగా వుంటుందని అర్థమవుతోంది. ఇంచుమించు రోజూ 39–41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలుంటున్నాయి.ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కలబురగి డివిజన్లోని ఏడు జిల్లాల్లో, బెళగావి డివిజన్లోని విజయపుర, బాగల్కోట్ జిల్లాల్లో వేడిగాలుల కారణంగా 2025 ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వ కార్యాలయ సమయాలను ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. The Karnataka government has issued an order to change the government office timings from 8 am to 1.30 pm in April and May 2025 in 7 districts of Kalaburagi division and Vijayapura and Bagalkot districts of Belagavi division due to heatwave. Earlier proposal was kept by the… pic.twitter.com/5E6CkvfvPV— ANI (@ANI) April 2, 2025

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలు మారినా ఉప ఎన్నికలు రావు అని రేవంత్ చేసిన వ్యాఖ్యలను బుధవారం విచారణలో ప్రత్యేకంగా ప్రస్తావించిన జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలే చేసింది.పవిత్రమైన చట్టసభలో ఈ వ్యాఖ్యలు చేయడం... రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అపహాస్యం చేయడం కిందకే వస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా సీఎంకు హితవు చెప్పండి. ఎట్టిపరిస్థితుల్లో ఈ తరహా వ్యాఖ్యలను ఉపేక్షించబోం. అవసరమైతే కోర్టు ధిక్కారంగా భావించాల్సి వస్తుంది’’ అని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఉద్దేశించి జస్టిస్ గవాయ్ అన్నారు.మేం అన్నీ ఆలోచించే కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తున్నాం. అంతమాత్రాన మాకు అధికారాలు లేవని కాదు. అసెంబ్లీలో నాయకులు చేసే ప్రకటనలకు ఒక విలువ ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడే అంశాలను కోర్టులు కూడా తీసుకుంటాయి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ఊదరగొడుతున్నారు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. స్పీకర్ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయి. ఏవీ మారలేదు. అలాంటప్పుడు అప్పుడు పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని వ్యాఖ్యానించారు.

బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగిరావాలి, లేకుంటే..: రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఆమోదిస్తే.. గుజరాత్‌కు వచ్చిన నష్టమేంటని ప్రధాని మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ఆలోచనా విధానం.. బీసీలకు వ్యతిరేకమన్న ఆయన.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జంతర్ మంతర్‌లో జరిగిన బీసీ సంఘాల పోరు గర్జనలో పాల్గొని ఆయన ప్రసంగించారు. బీసీల లెక్క తేలకుండా రిజర్వేషన్లు ఇవ్వలేమని కోర్టులు చెబుతున్నాయి. లెక్కలు పక్కగా తీస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుంది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. అందరి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అందుకే అధికారంలోకి వస్తే కులగణన చేయిస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. జనగణనతోనే కులగణన చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానం. అందుకే కేంద్రం కుట్రపూరితంగా జనగణన కూడా చేయడం లేదు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కులగణన చేయడం లేదు. మండల్ కమిషను కు వ్యతిరేకంగా.. కమండల్ తెచ్చిన చరిత్ర బీజేపీది. దేశ రాజకీయాలకు తెలంగాణ ఓ వెలుగు. రాహుల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. తెలంగాణలో 56.36 శాతం అని పక్కాగా తేల్చాం. ఫిబ్రవరి 4వ తేదీన సోషల్ జస్టిస్ డే జరుపుకుంటున్నాం. బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం. రిజర్వేషన్ల పెంపు కేంద్ర పరిధిలోని అంశం. అందుకే కేంద్రానికి పంపాం. మేం తెలంగాణలో రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాం. గుజరాత్లో ఇవ్వాలని కాదు. తెలంగాణలో రిజర్వేషన్లు ఆమోదిస్తే గుజరాత్‌కు వచ్చిన నష్టమేంటి?. విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అమలైతేనే బీసీలకు న్యాయం జరుగుతుంది.బీసీల రిజర్వేషన్లు పెంచాలనే కోరిక అసంబద్ధమైంది కాదు. అందుకు పలు పార్టీలు కూడా మద్దతు ఈ వేదికపై ప్రకటించాయి. ఎవరేం అనుకున్నా బీసీలకు మేం అడగా నిలబడతాం. మా రాష్ట్రంలో మేం పెంచుకుంటే.. మీకేంటి నష్టం. మేమంతా మద్దతు ఇస్తున్నా మీకు వచ్చిన నష్టమేంటి?. మీ కుర్చీ.. ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం అని మేం అనడం లేదు. మాకు మీ ప్రాణాలొద్దు.. 42 శాతం రిజర్వేషన్లు కావాలి. ప్రధాని మోదీ మా గుండె చప్పుడు వినాలి. రిజర్వేషన్లకు అనుమతిస్తే పది లక్షల మందితో మోదీకి సన్మానం చేస్తాం. మాకు అనుమతి ఇవ్వకపోతే దేశమంతా కార్చిలా ఉద్యమిస్తాం. అధికారం, చట్టం మీ చేతుల్లో ఉందని మాపై ఆధిప్యతం చెలాయించాలని చూడకండి. బలం లేకపోయినా వక్ఫ్ బిల్లు తెచ్చారు...మరి బీసీ బిల్లుకు అభ్యంతరం ఏమిటి?. మేం సయోధ్యకు వచ్చాం. గల్లీలో వినిపించుకోవడం లేదని.. ఢిల్లీలో గళం వినిపించేందుకు వచ్చాం. యుద్ధభేరి మోగించే ముందు ఢిల్లీకి రావాలని వచ్చాం. రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపాలి. ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం. చెప్పిన మాట వినకపోతే మా సత్తా చూపిస్తాం. తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వని తండ్రీకొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టాం. రిజర్వేషన్లపై దిగి రావాలి.. లేదంటే దిగిపోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలు వీళ్ల సంగతి తేల్చాలి అని రేవంత్ పిలుపు ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లు బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలనే డిమాండ్‌తో హస్తినలో బీసీ గర్జన జరగ్గా.. దేశవ్యాప్తంగా పలు పార్టీల అధినేతలు, ప్రతినిధులు హాజరై మద్ధతు ప్రకటించారు.
ఎన్ఆర్ఐ

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో ఫౌండేషన్, హోఫ్ ఫర్ లైఫ్ సంస్థలతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లలు సమాజంలో మానవ మృగాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలనేది ఈ సదస్సులో వివరించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరిష అన్నారు. అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా అది కచ్చితంగా తల్లితో చెప్పాలని సూచించారు. మేం ఏం చేయలేం అని నిస్సహాయ స్థితి నుంచి మేం ఏదైనా చేయగలమనే ధైర్యం ఆడపిల్లల్లో రావాలని హోఫ్ ఫర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకులు హిమజ అన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హోఫ్ ఫర్ సంస్థ ప్రతినిధులు ఆశాజ్యోతి, సైకాలజిస్టులు డాక్టర్ సంగీత, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై ఆడపిల్లలకు పూర్తి అవగాహన కల్పించేలా ఈ సదస్సు జరిగింది.

Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇకలేరు. వారి కుటుంబ సభ్యులకు మనసారా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, మహానుభావుడైన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. వారి గానం యుగయుగాల పాటు మనలో జీవించే ఉంటుందంటూ నాట్స్ నివాళులర్పించింది. గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతంఆచార్య తాడేపల్లి పతంజలికొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఒక గొప్ప రహస్యంఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.సంగీత ప్రస్థానంశ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్‌లు లెక్కకు అందనివి.కొత్త పద్ధతిసాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.నేదునూరి నోట – అన్నమయ్య మాటఅప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్ అందించిన సేవలు సాటిలేనివి.పురస్కారాలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.శివపదం కూడా...గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.అన్నమయ్య స్వరసేవ‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’చిరస్మరణీయంతెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.ప్రసూన బాలాంత్రపుమంద్రస్థాయిలోని మధుర స్వరం భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది.1948 నవంబర్ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్ స్కాలర్‌షిప్‌తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్ గారికి స్ఫూర్తి. ఇక అన్నమయ్య పాట పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్ గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి.అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానం 150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు.400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్ అటువంటి మహనీయుడు.

ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్‌కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్‌మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025).

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు.
క్రైమ్

ఎంఎంటీఎస్ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ
హైదరాబాద్: సికింద్రాబాద్–మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో లైంగిక దాడి యత్నం ఘటన నుంచి బైటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పూర్తిగా కోలుకుంది. దీంతో ఆమెను ఈ నెల 1న సాయంత్రం డిశ్చార్జి చేయించి కడప జిల్లాలోని తన సొంత ఊరికి పంపించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మార్చి 22న రాత్రి ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న బాధితురాలిపై ఓ దుండగుడు దాడిచేయటంతో, తప్పించుకునే ప్రయత్నంలో ఆమె నడుస్తున్న రైలు నుంచి కిందకుదూకిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం తొలుత గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, దంతాలకు శస్త్ర చికిత్సలు చేయించారు. పది రోజులపాటు చికిత్స పొందిన బాధితురాలు పూర్తిగా కోలుకున్నట్టు డాక్టర్లు ధృవీకరించటంతో సొంత ఊరికి పంపించినట్టు పోలీసులు తెలిపారు.

ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
తమిళనాడు: పల్లావరం సమీపంలో ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలితీసుకుంది. ప్రియురాలు మరొకరితో సంబంధం కలిగి ఉందనే కారణంతో ప్రియుడు ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. లొంగిపోయిన కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై శివారు పల్లావరం సమీపంలోని అనకాపుత్తూరు గౌరీ ఎవెన్యూ 2వ వీధికి చెందిన జ్ఞానసిద్ధన్ (40). నితను తాంబరం కార్పొరేషన్లో లారీ డ్రైవర్. ఇతను అవివాహితుడు. అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అనకాపుత్తూరు అరుల్ నగర్ 3వ వీధికి చెందిన భాగ్యలక్ష్మి(33)తో ఇతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భాగ్యలక్ష్మి అప్పటికే భర్తకు విడాకులు ఇచ్చి, తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. ఇద్దరూ తరచూ కలుసుకుని సరదాగా గడుపుతూ వచ్చారు. ఈక్రమంలో భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని జ్ఞానసిద్ధన్ నిర్ణయించుకున్నాడు. భాగ్యలక్ష్మికి జ్ఞానసిద్ధన్‌తో పాటు మరొకరితో సంబంధం ఉందని తెలిసింది. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ బుధవారం ఉదయం భాగ్యలక్ష్మితో గొడవపడ్డాడు. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ పెద్ద బండరాయితో భాగ్యలక్ష్మి తలపై వేశాడు. భాగ్యలక్ష్మి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. జ్ఞానసిద్ధన్ శంకర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నువ్వు యాంకరింగ్ చేయడం నాకు ఇష్టం లేదు..!
విశాఖపట్నం: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త కొట్టడంతో తీవ్రంగా గాయపడిన భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలివి.. వెంకటేశ్వరమెట్టకు చెందిన పోలిపల్లి రమాదేవి, భీమ్‌నగర్‌కు చెందిన బంగార్రాజు భార్యాభర్తలు. ఇద్దరూ వృత్తిరీత్యా డ్యాన్సర్లు. రమాదేవి యాంకరింగ్ కూడా చేస్తుంటుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రమాదేవి యాంకరింగ్ చేయడం బంగార్రాజుకు ఇష్టం లేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని బంగార్రాజు అనుమానించడంతో గొడవలు మరింత పెద్దవయ్యాయి. ఈ క్రమంలో గత నెల 31న గొడవ జరగడంతో.. రమాదేవి పిల్లలను తీసుకుని వెంకటేశ్వరమెట్టలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అదే రోజు బంగార్రాజు అక్కడికి వెళ్లి, తిరిగి ఇంటికి రమ్మని భార్యను పిలిచాడు. ఆమె అందుకు నిరాకరించడంతో.. ఆగ్రహంతో ఆమెను ఇంటి నుంచి బయటకు లాగి చెంపపై కొట్టాడు. ఈ ఘటనలో ఆమె పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తలకు బలంగా గాయమైంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. మృతురాలి బంధువులు బంగార్రాజుపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. బంగార్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది.

రెండేళ్ల క్రితం భార్య మోసం చేసి వెళ్లిపోయింది..!
యశవంతపుర: భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి రెండేళ్లవుతోంది. పాఠశాలలో కూతురిని మీ అమ్మ ఎక్కడని అడుగుతున్నారు. ఈ పరిణామాలతో శాడిస్టుగా మారిన ఓ వ్యక్తి.. తుపాకీతో మారణహోమం సృష్టించాడు. భార్యను అంతమొందించాలని వెళ్లాడు, ఆమె లేకపోవడంతో తల్లి, మరదలుతో పాటు కూతురిని కూడా తూటాలకు బలి చేశాడు. ఈ కర్కశ సంఘటన చిక్కమగళూరు జిల్లా ఖాండ్యా సమీపంలోని మాగలు గ్రామంలో చోటుచేసుకొంది. సమాజంలో క్షీణించినపోతున్న కుటుంబ బాంధవ్యాలకు మరోసారి అద్దం పట్టింది. వివరాలు.. జిల్లాలోనే కడబగెరె సమీపంలో ఓ పాఠశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్న రత్నాకర్ (35) ఈ రక్తపాతానికి పాల్పడ్డాడు. అతనికి మాగలుకు చెందిన యువతిలో సుమారు పదేళ్ల కిందట పెళ్లయింది. స్కూలు బస్సు డ్రైవర్‌గా పనిచేవాడు. వీరికి కూతురు మౌల్య ఉంది. అయితే కుటుంబ కలహాలతో భార్య రెండేళ్ల కిందట భర్తను వదిలేసి వెళ్లిపోయింది. బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. పాఠశాలలో తన స్నేహితులు మీ అమ్మ ఎక్కడని అడుగుతున్నట్లు కుతూరు మౌల్య రోజు తండ్రి వద్ద చెప్పుకునేది. దీంతో ఆక్రోశానికి గురైన రత్నాకర్ భార్యతో తాడేపేడో తేల్చుకోవాలనుకున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా మౌల్య అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. భార్య కూడా వచ్చి ఉంటుందని రత్నాకర్ భావించాడు. విచ్చలవిడిగా కాల్పులు ఆమెతో మాట్లాడాలని, కుదరకపోతే హత్య చేయాలని ప్లాన్ వేసుకొని మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో మాగలులో అత్తవారింటికి వెళ్లాడు. భార్య లేదని తెలిసి అగ్గిమీద గుగ్గిలమయ్యాడు, సింగల్ బ్యారెల్ తుపాకీ తీసి అత్త జ్యోతి (50), మరదలు సింధు (26), కూతూరు మౌల్య (7)ను కాల్చిచంపాడు. అడ్డుకోబోయిన సింధు భర్త మీద కాల్పులు జరపగా స్వల్ప గాయాలు తగిలి తప్పించుకున్నాడు. తరువాత మృతదేహాలను ఇంటి నుంచి కొంతదూరం లాక్కువెళ్లి అక్కడ తుపాకీతో కాల్చుకుని హంతకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మోసం చేసింది.. అందుకేనంటూ..చంపడాటానికి ముందు రత్నాకర్ సెల్ఫీ వీడియోలో బాధలను చెప్పుకున్నారు. భార్య వదిలి వెళ్లిన తరువాత బాధతో ఈ అమానుషమైన ఘటనకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. రెండేళ్ల క్రితం భార్య మోసం చేసి వెళ్లిపోయింది. కూతురి సంతోషం కోసం ఏమైనా చేస్తానన్నాడు. స్కూలులో స్నేహితులు మీ అమ్మ ఎక్కడ అని అడిగితే ఫోటోను చూపిస్తుంది అని వివరించాడు. ఘటనాస్థలిని చిక్కమగళూరు ఎస్పీ విక్రమ్ అమటె పరిశీలించారు. బాళెహొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించారు.
వీడియోలు


HCUలో భూముల వేలంపై నేడు తెలంగాణ హైకోర్టులో మళ్లీ విచారణ


టీడీపీ మంత్రికి బిగ్ షాక్


చంద్రబాబు చేతకానితనమే..


మావోయిస్టుల శాంతి చర్చల లేఖపై ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ స్పందన


సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో చిన్నారుల మృతి కేసులో పురోగతి


పరిధి దాటొద్దని పోలీసులను హెచ్చరించిన సుప్రీం కోర్టు


నా కూతుర్లపై అసభ్యమైన పోస్టులు.. అంబటి సీరియస్ వార్నింగ్..


ఉపఎన్నికల్లో మీరు చూపిన తెగువకు, ధైర్యానికి హ్యాట్సాఫ్: జగన్


Big Question: ఏడుకొండల్ని రాజకీయాల గుట్టగా మార్చిన బాబు


వరుసగా రెండో విజయాన్ని దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్