వాషింగ్టన్: 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల నుంచి డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లు పోటీ పడవచ్చని సీఎన్‌ఎన్-ఓఆర్సీ పోల్‌లో వెల్లడైంది. ‘సూపర్ ట్యూజ్‌డే’ నేపథ్యంలో నిర్వహించిన ఈ పోల్‌లో వారిద్దరు సమీప ప్రత్యర్థుల కంటే ఎంతో ముందంజలో ఉన్నారని తేలింది.
రిపబ్లికన్లలో 49 శాతం ట్రంప్‌కు అనుకూలంగా ఉండగా, 16 శాతం మార్కో రూబియోకు, 15 శాతం టెడ్ క్రూజ్‌కు, 10 శాతం బెన్ కార్‌సన్‌కు, 6 శాతం జాన్ కసిచ్‌కు అనుకూలంగా ఉన్నారు. ట్రంప్ 30 పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. డెమొక్రటిక్ పార్టీలో బెర్నీ శాండర్స్ కంటే హిల్లరీ 20 పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారని పోల్‌లో వెల్లడైంది. 55 శాతం హిల్లరీ వైపు, 38 శాతం శాండర్స్ వైపు మొగ్గుచూపారు. ‘సూపర్ ట్యూజ్‌డే’ ఓటింగ్‌లో రిపబ్లికన్లు 11 రాష్ట్రాల్లో పోటీపడుతుండగా, డెమొక్రటిక్ అభ్యర్థులు 12 రాష్ట్రాల్లో తలపడుతున్నారు.
సీఎన్‌ఎన్ పోల్‌లో ట్రంప్, హిల్లరీలకే మొగ్గు
Published Tue, Mar 1 2016 1:18 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
Advertisement