
నా కేబినెట్‌లో సగం మహిళలే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీచేస్తున్న హిల్లరీ క్లింటన్ తాను అధికారంలోకి వస్తే కేబినెట్‌లో సగం మహిళలే ఉంటారని అన్నారు. అమెరికాలో 50 శాతం మంది మహిళలే ఉన్నారు, కనుక నా కేబినెట్‌లో కూడా 50 మంది మహిళలు ఉంటారని ఆమె ఎంఎస్‌ఎన్‌బీసీ టౌన్ హాల్‌లో చెప్పారు.
మేరీల్యాండ్, డెలావర్, పెన్సిల్వేనియా, కనెక్టికట్, రోడే ఐలాండ్ ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ ప్రచార మేనేజర్ జాన్ పోడేస్ట భారతీయ అమెరికన్ నీరా టాండెన్‌ను ఆమె కేబినెట్‌లో చూడాలని ఒక సందర్భంలో అన్నారు. నీరా ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగెస్‌లో పనిచేస్తున్నారు.