28న మలివిడత ఎన్నికలు
మాలె: మాల్దీవుల అధ్యక్ష పదవికి శనివారం జరిగిన తొలివిడత ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అధినేత మహమ్మద్ నషీద్ గెలుపు సాధించారు. అయితే, అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో ఎవరికీ నిర్ణీత మెజారిటీకి అవసరమైన 50 శాతం ఓట్లు లభించకపోవడంతో మలివిడత ఎన్నికలు అనివార్యంగా మారా యి.
మాల్దీవుల ఎన్నికల కమిషన్ ఆదివారం ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థుల్లో ఎవరికీ మెజారిటీ లభించకపోవడంతో ఈనెల 28న మలి విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మాల్దీవుల ఎన్నికల నిబంధనల ప్రకారం, అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులెవరికీ 50 శాతం ఓట్లు లభించకుంటే, తొలి రెండు స్థానాల్లో ఉన్న అభ్యర్థుల నడుమ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు.
మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో నషీద్ గెలుపు
Published Mon, Sep 9 2013 2:29 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement
Advertisement