
డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధిగా భారత సంతతి యువతి
ఫిలడేల్ఫియా: భారత సంతతికి చెందిన స్మృతి పాలనియప్పన్ డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధిగా నియమితులయ్యారు. అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్.. ఇఓవా ప్రతినిధిగా శృతి పాలనియప్పన్‌ను నియమించారు. దీంతో ఈ పదవికి ఎంపికైన అతి పిన్న వయస్కురాలిగా శృతి(18) చరిత్ర సృష్టించారు. అరిజోనా ప్రతినిధి ఇమ్మెట్(102) అతి పెద్ద వయస్కురాలు.
తనను పార్టీ ప్రతినిధిగా నియమించిన సందర్భాన్ని పురస్కరించుకొని శృతి మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చిన హిల్లరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఒక పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్ష అభ్యర్థిగా తొలిసారి ఓ మహిళ ఎన్నికై చరిత్ర సృష్టించారంటూ హిల్లరీపై ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగం నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని, అదే స్ఫూర్తితో హిల్లరీని గెలిపించేందుకు, పార్టీ విజయం కోసం కృషి చేస్తానన్నారు.