
అమెరికా అధ్యక్ష‍్య ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రజల ప్రయోజనాల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు బైడెన్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్‌గా పూర్తికాలం కొనసాగుతానన్నారు.
ఇటీవల ట్రంప్‌తో జరిగిన ముఖాముఖి చర్చలో బైడెన్ నిరాశపరిచారు. రానున్న ఎన్నికలకు తదుపరి డెమొక్రాట్ అభ్యర్థిగా కమలా హారిస్‌ను జో బైడెన్ ప్రతిపాదించారు.
జో బైడెన్ సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సైతం బైడెన్ బాధపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment