అమెరికా అధ్యక్ష ఎన్నికలు | United States presidential election 2016 | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్ష ఎన్నికలు

Published Sun, Aug 21 2016 1:02 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు - Sakshi

అమెరికా అధ్యక్ష ఎన్నికలు

 ప్రతి నాలుగేళ్లకోసారి అమెరికన్ ఓటర్లు తమ దేశ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటారు.2016 నవంబర్ 8 మంగళవారం జరగబోయే అధ్యక్ష ఎన్నిక ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అగ్రరాజ్యమైన అమెరికాలో జరిగే రాజకీయ ప్రక్రియ మిగిలిన దేశాలన్నింటినీప్రభావితం చేస్తుంది. ఒకవైపు డెమోక్రటిక్ పార్టీ తరఫున మొదటిసారి ఒక మహిళా అభ్యర్థి.. హిల్లరీ క్లింటన్ శ్వేత సౌధంలోకి ప్రథమ పౌరురాలిగా అడుగిడటానికిప్రయత్నిస్తుండగా, మరొకవైపు కరుడుగట్టిన మితవాద భావాలు గల డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి) హిల్లరీ ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం హిల్లరీ క్లింటన్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1992-2000 వరకు అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన బిల్ క్లింటన్ సతీమణే హిల్లరీ క్లింటన్.

అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. 50 రాష్ట్రాలు, వాషింగ్టన్ డి.సి.లో రిజిస్టర్ అయిన ఓటర్లు నియోజక గణ ( Electoral college) సభ్యులను ఎన్నుకుంటారు. వీరిని ఎలక్టర్‌‌స అంటారు. వీరు అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. నియోజక గణ సభ్యుల సంఖ్య 538. ఇందులో సగం కంటే ఎక్కువ గెలుచుకున్న అభ్యర్థులు (కనీసం 270 ఓట్లు) పై పదవులకు ఎన్నికవుతారు. ఎన్నికలో ఏ అభ్యర్థికీ సగం కంటే ఎక్కువ ఓట్లు లభించకుంటే కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు) దిగువ సభ అయిన ప్రతినిధుల సభ (House of representatives) అధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది. అలాగే ఉపాధ్యక్షుడి ఎన్నికలో ప్రతిష్టంభన ఏర్పడితే కాంగ్రెస్‌లో ఎగువ సభ అయిన సెనెట్ ఉపాధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది. ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటే ప్రతి రాష్ట్రానికి ఒక ఓటు ఉంటుంది. ఉపాధ్యక్షుడిని సెనెట్ ఎన్నుకోవాల్సి వస్తే ప్రతి సెనెటర్‌కు ఒక ఓటు ఉంటుంది. 1800, 1824 ఎన్నికల్లో ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటే, సెనెట్ 1836లో ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంది.

ఒక్కొక్క రాష్ట్రానికి కేటాయించే ఎలక్టర్ల సంఖ్య ఆ రాష్ర్టం నుంచి కాంగ్రెస్‌లోని ఉభయ సభలకు ఎన్నికయ్యే సభ్యులతో సమానంగా ఉంటుంది. ఉదాహరణకు కాలిఫోర్నియా రాష్ర్టం నుంచి 53 మంది సభ్యులు ప్రాతినిధ్య సభకు, ఇద్దరు సభ్యులు సెనెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ మొత్తం 55 మంది. ఆ రాష్ర్టం నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలో ఓటు వేసే ఎలక్టర్‌‌స సంఖ్య కూడా 55. టెక్సాస్ నుంచి 38 మంది, ఫ్లోరిడా నుంచి 29 మంది, న్యూయార్‌‌క నుంచి 29 మంది ఎలక్టర్‌‌స ఎన్నికవుతారు. జనాభాలో చిన్న రాష్ట్రాలైన వెర్మాంట్, వయోమింగ్ నుంచి ముగ్గురు ఎలక్టర్‌‌స ఎన్నికవుతారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా నుంచి ఎన్నికయ్యే ఎలక్టర్లు ముగ్గురు. ఈ సంఖ్య చిన్న రాష్ట్రాల ఎలక్టర్లతో సమానంగా ఉంటుంది.

 కాబట్టి మొత్తం ఎలక్టర్ల సంఖ్య = 50 రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికయ్యే సభ్యులు + 3 (వాషింగ్‌టన్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సభ్యులు) (535+3 = 538)అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్‌టన్. ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన తర్వాత ఎన్నికైన జాన్ ఆడమ్స్ పదవీ కాలం నుంచి (1776) అమెరికా అధ్యక్షులు రెండు ప్రధాన రాజకీయ పక్షాలకు చెందినవారే. వాటి పేర్లు కాలక్రమంలో మారుతూ ప్రస్తుతం డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలుగా వ్యవహారంలో ఉన్నాయి. అమెరికాలో ద్విపార్టీ వ్యవస్థ దృఢంగా వేళ్లూనింది. మూడో పార్టీకి చెందిన అభ్యర్థులు 1860, 1912 ఎన్నికల్లో మాత్రమే కొంత ప్రభావం కనబరిచారు.

అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవి పోటీకి అర్హతలు
అమెరికా రాజ్యాంగం రెండో ప్రకరణ ప్రకారం అధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్థి అమెరికాలో జన్మించిన పౌరుడై ఉండాలి. 35 ఏళ్ల వయసు కలిగి, కనీసం 14 ఏళ్లయినా అమెరికాలో నివసించాలి. 12వ రాజ్యాంగ సవరణ (1951) ప్రకారం ఉపాధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్థికి, అధ్యక్షుడికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి. 22వ రాజ్యాంగ సవరణ ప్రకారం అధ్యక్షుడు రెండు పర్యాయాల కంటే ఎక్కువసార్లు ఎన్నిక కాకూడదు. ఫ్రాంక్లిన్ డి.రూజ్‌వెల్ ్ట మాత్రమే నాలుగుసార్లు (1932, 1936, 1940, 1944) ఎన్నికయ్యారు.

రెండు ప్రధాన పార్టీల ఎన్నికల చిహ్నాలు
డెమోక్రటిక్ పార్టీ చిహ్నం గాడిద. రిపబ్లికన్ పార్టీ చిహ్నం ఏనుగు. ఈ చిహ్నాల వెనుక కొంత చరిత్ర ఉంది. అధ్యక్ష పదవికి పోటీ చేసిన డెమోక్రటిక్ అభ్యర్థి ఆండ్రూ జాక్సన్ (1828)ను ప్రత్యర్థులు గాడిదతో పోల్చారు. ఆయనను ఒ్చఛిజ్చుటట అని హేళన చేశారు. ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు, నినాదాలు ఆలోచనా రహితమైనవిగా చిత్రీకరించి ఆయనను తెలివిలేని గాడిదతో పోల్చారు. కానీ డెమోక్రటిక్ పార్టీ చిహ్నంగా గాడిద ప్రాచుర్యం పొందడానికి అప్పటి ప్రముఖ కార్టూనిస్టు థామస్ నాస్ట్ కారకుడు. 1860లో వచ్చిన అంతర్యుద్ధాన్ని వ్యతిరేకించిన పార్టీని గాడిదతో పోల్చారు. అప్పట్లో డెమోక్రాట్లు అంతర్యుద్ధాన్ని వ్యతిరేకించారు.

రిపబ్లికన్ పార్టీకి ఏనుగు చిహ్నం ప్రాచుర్యం పొందడానికి కూడా థామస్ నాస్ట్ కార్టూన్లే కారణం. ఓ కార్టూన్‌లో గాడిద.. పులి చర్మం కప్పుకొని మిగిలిన జంతువులను భయపెట్టినట్లు, అలా భయపడిన జంతువుల్లో ఏనుగు కూడా ఉన్నట్లు చిత్రీకరించారు. గాడిద సోమరితనం, మొండితనం ప్రతిబింబిస్తే ‘ఏనుగు’ పరిమాణంలో పెద్ద వికృతానికి మారుపేరైంది. 1828 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ ఆడమ్స్ తన ప్రత్యర్థి ఆండ్రూ జాక్సన్‌ను గాడిదగా వర్ణించాడు. కాని జాక్సన్ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని గాడిద విశ్వాసానికి, ఎక్కువ బరువు మోయడానికి మారుపేరుగా ప్రచారం చేసుకొన్నాడు. 1864 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అబ్రహం లింకన్‌కు మద్దతునిస్తున్న వార్తా పత్రిక ‘ఏనుగు’ గుర్తును ఆ పార్టీ చిహ్నంగా ప్రచారం కల్పించింది. అంతర్యుద్ధంలో యూనియన్ ప్రభుత్వ విజయాలను వర్ణిస్తూ ఏనుగుని పోరాట పటిమకు ప్రత్యామ్నాయంగా వర్ణించింది.

రెండు పార్టీల తరఫున అభ్యర్థులను ప్రతిపాదించడం
అభ్యర్థులను పార్టీ నామినేట్ చేసే ప్రక్రియలో రెండు దశలున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు, కాకస్‌లు నిర్వహిస్తారు. ప్రైమరీ ఎన్నికలను రాష్ర్ట, స్థానిక ప్రభుత్వాలు జరిపితే, కాకస్‌లను రాజకీయ పార్టీలు నిర్వహిస్తాయి. కొన్ని రాష్ట్రాలు ప్రైమరీలను మరికొన్ని కాకస్‌లను మరికొన్ని రెండు పద్ధతులను అనుసరిస్తాయి.

 ఇవి ఎన్నికల సంవత్సరంలో జనవరి - జూన్ నెలల మధ్యలో జరుగుతాయి. అయోవా రాష్ర్టం మొదటి కాకస్‌ను నిర్వహిస్తే న్యూహాంప్‌షైర్ రాష్ర్టం మొదటి ప్రైమరీ ఎన్నిక జరుపుతుంది. జూలై, ఆగస్టు నెలల్లో రెండు ప్రధాన పార్టీల కన్వెన్షన్లు జరుగుతాయి. వాటిలో అభ్యర్థులను ఖరారు చేస్తారు. రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్.. క్లీవ్ లాండ్, ఒహైవోలో జూలై 18-21న, డెమోక్రటిక్ పార్టీ కన్వెన్షన్ జూలై 25-28న ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలో జరిగాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఎన్నికల చర్చలు జరుగుతాయి.

ఇవి ముఖ్యంగా ఎవరికి ఓటు వేయాలనే సందిగ్ధంలో ఉన్న ఓటర్లను ప్రభావితం చేస్తాయి. నవంబర్ 8న ఓటర్లు ఎలక్టర్స్‌ను ఎన్నుకుంటే, డిసెంబర్‌లో ఎలక్టర్స్.. అధ్యక్ష అభ్యర్థులకు ఓటు వేస్తారు. 2017 జనవరి ప్రథమార్ధంలో కాంగ్రెస్.. ఎలక్టర్స్ ఓట్లను లెక్కించి, అధికారికంగా గెలిచిన అభ్యర్థుల (అధ్యక్ష, ఉపాధ్యక్ష) పేర్లను ప్రకటిస్తుంది. కానీ, వాస్తవానికీ నవంబర్ 8న అభ్యర్థుల జయాపజయాలు తెలిసిపోతాయి. 2017, జనవరి 20న అమెరికా 45వ అధ్యక్షుడు, 48వ ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.

మొత్తం ఎలక్టర్ల
సంఖ్య= 50 రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికయ్యే సభ్యులు + 3 (వాషింగ్‌టన్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సభ్యులు)
535+3 =538

భారత్‌లో ఎందుకు ఆసక్తి?
30 లక్షల మందికి పైగా భారత సంతతివారు అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 1,32,890 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. చైనీయుల (3,04,040) తర్వాత మన విద్యార్థులే అధికం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లకు పైగా  ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో భారతదేశం స్వేచ్ఛా వాణిజ్య విధానాన్ని అనుసరించడం అమెరికాకు హర్షదాయకం.

ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడటం సహజమని విదేశాంగ విధాన నిపుణులు వ్యాఖ్యానిస్తారు. ప్రముఖ ప్రజాభిప్రాయ సేకరణ సంస్థ ‘గాలప్’ సర్వేలో భారతదేశాన్ని అమెరికన్ ప్రజలు ఆరో ఇష్టమైన దేశంగా గుర్తించారు. 71 శాతం అమెరికన్లు భారత్‌పై అనుకూల వైఖరిని కనబరిచారు. ఐటీ రంగంలో భారతీయుల ప్రజ్ఞా విశేషాలు అమెరికన్ వాణిజ్య రంగాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటివార ప్రవాస భారతీయులు, ఐటీకి చిహ్నాలు. ఈ రంగంలో పనిచేసే విదేశీయుల్లో భారతీయులు 40 శాతానికి పైగా ఉన్నారు. వారిలో ఎక్కువ శాతం మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కావడం విశేషం.

2008లో భారత్-అమెరికా మధ్య జరిగిన పౌర అణు ఒప్పందం ఈ రెండు దేశాలను మరింత దగ్గరకు చేర్చింది. అమెరికా అధ్యక్షులు బుష్, ఒబామాల కాలంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి. 66వ భారత గణతంత్ర దినోత్సవానికి (2016) ఒబామాను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇందుకు నిదర్శనం. ఇలాంటి ఆహ్వానాన్ని అందుకున్న మొదటి అమెరికా అధ్యక్షుడు ఒబామానే. ప్రధాని మోదీ అమెరికా పర్యటన విజయవంతమైంది. ఎన్నో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి.

ముఖ్యంగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక సంభాషణలు కింది ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అవి..  వ్యూహాత్మక సహకారం;  ఇంధనం, వాతావరణ మార్పు;  విద్య, అభివృద్ధి;  ఆర్థిక, వాణిజ్య, వ్యవసాయ రంగాలు;  శాస్త్ర, సాంకేతిక, ఆరోగ్య, వినూత్న రంగాల్లో సహకారం. మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ అనుసరిస్తున్న శతృత్వ వైఖరి నేపథ్యంలో భారత్ అమెరికాకు మరింత చేరువ కావడం సహజం. ఇది విరుగుడుగా పనిచేస్తుంది. అలాగని చిరకాల మిత్ర దేశమైన రష్యాను విస్మరించడం అభిలషణీయం కాదు.

డా బి.జె.బి. కృపాదానం
సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ,
ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement