వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైంది. శుక్రవారం పార్టీ డెలిగేట్ల ఆన్‌లైన్ పోలింగ్ మొదలైన నేపథ్యంలో ఆమె మెజారిటీ ఓట్లను గెల్చుకున్నారు. దాంతో అభ్యర్థిత్వం ఖరారైంది. ‘‘పార్టీ నామినీగా ఎన్నికవడం గౌరవంగా భావిస్తున్నా. వచ్చే వారం నా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తా.
దేశంమీద ప్రేమతో ఏకమైన ప్రజల కోసం ఇకపై ప్రచారం చేస్తా’’ అన్నారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష అభ్యర్థిత్వం సాధించిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా, తొలి భారతీయ అమెరికన్‌గా కమల చరిత్ర సృష్టించారు. ఆగస్ట్ 22న షికాగో జరిగే డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో కమల తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా అంగీకరిస్తారు. అభ్యర్థిత్వం స్వీకరించాక కొద్దిరోజులకు ఆమె తన రన్నింగ్‌మేట్ పేరును ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment