candidacy
-
కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైంది. శుక్రవారం పార్టీ డెలిగేట్ల ఆన్లైన్ పోలింగ్ మొదలైన నేపథ్యంలో ఆమె మెజారిటీ ఓట్లను గెల్చుకున్నారు. దాంతో అభ్యర్థిత్వం ఖరారైంది. ‘‘పార్టీ నామినీగా ఎన్నికవడం గౌరవంగా భావిస్తున్నా. వచ్చే వారం నా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తా. దేశంమీద ప్రేమతో ఏకమైన ప్రజల కోసం ఇకపై ప్రచారం చేస్తా’’ అన్నారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష అభ్యర్థిత్వం సాధించిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా, తొలి భారతీయ అమెరికన్‌గా కమల చరిత్ర సృష్టించారు. ఆగస్ట్ 22న షికాగో జరిగే డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో కమల తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా అంగీకరిస్తారు. అభ్యర్థిత్వం స్వీకరించాక కొద్దిరోజులకు ఆమె తన రన్నింగ్‌మేట్ పేరును ప్రకటిస్తారు. -
‘అరోరా ఆకాంక్ష’.. రికార్డు సృష్టించనుందా?!
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి అధ్యక్ష పదవి కోసం భారత సంతతికి చెందిన మహిళ బరిలో నిలిచారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఆడిట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న అరోరా ఆకాంక్ష(34) అధ్యక్ష బరిలో నిలిచినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్న ఆంటోనియో గుటెరస్ పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యున్నత దౌత్యవేత్త పదవికి తాను పోటీ చేస్తున్నట్లు అరోరా గత నెలలోనే తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెలలో ‘‘అరోరాఫర్ఎస్జీ’’ పేరిట ఆమె ప్రచారం సైతం ప్రారంభించారు. ఇక అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించిన అరోరా ఆకాంక్ష ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. తాజాగా రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ప్రచార వీడియోను విడుదల చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం లోపల నడుస్తూ అరోరా ఈ వీడియోను తీశారు. గడిచిన 75 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి ప్రపంచానికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని.. శరణార్థులను రక్షించలేదని ఆమె ఆరోపించారు. అందుకే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌గా తాను పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ అరోరా గనక ఈ పదవి చేపడితే.. ఐక్యరాజ్య సమితి 75 ఏళ్ల చరిత్రలో సెక్రటరీ జనరల్ పదవి చేపట్టిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టిస్తారు. కాగా, ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మరోసారి అధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తున్నారు. ఆయన మొదటి విడత పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగుస్తుంది. కొత్త సెక్రటరీ జనరల్ 2022 జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. 2017 జనవరి 1న గుటెరస్ సెక్రటరీ జనరల్‌గా ప్రమాణం చేశారు. మరోసారి అధ్యక్షుడిగా పని చేయాలని గుటెరస్ ఆశిస్తున్నారు. ఇక అరోరా ఆకాంక్ష విషయానికి వస్తే ఆమె టొరంటోలోని యార్క్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టడీస్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు. భారతదేశంలో జన్మించిన అరోరా ఆకాంక్షకు ఓసీఐ కార్డ్ వుంది. అలాగే కెనడా పౌరురాలిగా ఆ దేశ పాస్‌పోర్ట్ కలిగివున్నారు. చదవండి: భారత్ సేవలకు సెల్యూట్: యూఎన్ చీఫ్ డ్యాషింగ్ అడ్వైజర్ -
ఆశావహుల్లో ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ అభ్యర్థిత్వాల కసరత్తు ప్రారంభం కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. శని వారం ఢిల్లీలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమవడంతో టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) ప్రతిపాదించిన జాబితా పీసీసీ ఎన్నికల కమిటీకి వెళ్లింది. మరోవైపు టిక్కెట్ల కోసం కొందరు నాయకులు నేరుగా పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా బోథ్, ఆదిలాబాద్ వంటి నియోజకవర్గాలకు నాయకులు నేరుగా పీసీసీ అధ్యక్షుడిని కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. డీసీసీ నుంచి పంపిన జాబితాతోపాటు, తెలంగాణ పీసీసీ రూపొందించిన మరో జాబితాలోని పేర్లను ఈ స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తోంది. రాహుల్‌గాంధీ నిర్వహించిన సర్వేలు, పలు ప్రత్యేక సర్వేల ద్వారా తేలిన గెలుపు గుర్రాల పేర్లను కూడా ఈ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుందని కాంగ్రెస్ ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. అభ్యర్థిత్వాల ఎంపికలో ఒక్క డీసీసీ ప్రతిపాదిత జాబితానే పరిగణలోకి తీసుకోమని, అన్ని అంశాలను పరిశీలిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటించిన విషయం విధితమే. అన్ని కోణాల్లో పరిశీలించాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ అయ్యే వరకు ఏకాభిప్రాయం లేని స్థానాలపై ప్రకటన చేసే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్దగా అభ్యంతరాలు లేని ఒకటీ రెండు సిట్టింగ్ స్థానాల నుంచి అభర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. ఢిల్లీకి పయనమైన జిల్లా నాయకులు టిక్కెట్ల కేటాయింపు కసరత్తు ముమ్మరం కావడంతో జిల్లా నాయకులు ఢిల్లీ పయనమవుతున్నారు. ఎవరికి వారే తమ నేతలతో కలిసి హస్తినకు వెళ్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న నరేష్ జాదవ్ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ప్రేంసాగర్‌రావు వర్గం నేతలు కొందరు ఆదివారం ఉదయం బయలుదేరి వెళ్తున్నట్లు సమాచారం. ఎవరికి వారే టిక్కెట్ల ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు టిక్కెట్లు ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. డీసీసీ ప్రతిపాదిత జాబితా ఇదే? జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదిత జాబితాను ఇప్పటికే తెలంగాణ పీసీసీకి అందజేసిన విషయం విధితమే. విశ్వసనీయ సమాచారం మేరకు నియోజకవర్గాలవారీగా ఈ జాబితాలో ఉన్న పేర్లను పరిశీలిస్తే..