హిల్లరీ అధ్యక్ష అభ్యర్థిత్వం సాధించడంపై ఆమె భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్(69) హర్షం వ్యక్తం చేశారు. ‘1971 వసంతకాలంలో హిల్లరీని కలిశాను. పాలిటిక్స్, సివిల్ రైట్స్ క్లాస్‌లో తొలిసారి ఆమెను చూశాను. చూడగానే ఈమే నాకు సరైన జోడీ అనిపించింది. అందమైన ఒత్తై జుట్టు.. పెద్ద కళ్లద్దాలు.. మేకప్ లేదు.. ఆమె తెలివితేటలు, వ్యక్తిత్వం అమితంగా ఆకర్షించాయి.