ఆ విజయం నా ఒక్కడిదే కాదు: బైడెన్‌  | Im Confident That We Will Emerge Victorious Says Biden | Sakshi

ఆ విజయం నా ఒక్కడిదే కాదు: బైడెన్‌ 

Nov 5 2020 9:53 AM | Updated on Nov 5 2020 4:04 PM

Im Confident That We Will Emerge Victorious Says Biden - Sakshi

వాషింగ్టన్‌ : ‘‘మనం విజయం సాధిస్తామన్న నమ్మకం నాకుంది. ఆ విజయం నా ఒక్కడిదే కాదు. అది అమెరికా ప్రజల విజయం’’ అని డెమొక్రాటిక్‌ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ అన్నారు. తన విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించారు. అనంతరం మరో ట్వీట్‌ చేశారు ‘‘  ఎన్నికల ఫలితాలను డొనాల్డ్‌ ట్రంప్‌ కానీ.. నేను కానీ, నిర్ణయించలేము. అమెరికా ప్రజలు దాన్ని నిర్ణయిస్తారు. అందుకే మేము బైడెన్‌ ఫైట్‌ ఫండ్‌ను తీసుకొచ్చాం. ప్రతీ ఓటు పరిగణలోకి వస్తుంది. ఫండ్‌ను దేశవ్యాప్తంగా ఎన్నికల పరిరక్షణ చర్యలకోసం వినియోగిస్తాం ’’ అని పేర్కొన్నారు. ( విజయానికి ఆరు ఓట్ల దూరంలో..)

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ విజయం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం 264 ఎలక్టోరల్‌ ఓట్లను బైడెన్‌ సొంతం చేసుకున్నారు. మరో 6 ఎలక్టోరల్‌ ఓట్లు సాధిస్తే ఆయన మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకుంటారు. ట్రంప్‌ అధ్యక్ష పదవి రేస్‌ నుంచి దాదాపుగా తప్పుకున్నారు. 214 ఓట్ల వద్దే ఆగిపోయారు. కొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్‌ పూర్తవడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో బైడెన్‌ విజయంపై స్పష్టత రావటానికి మరింత సమయం పట్టనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement