
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ వస్తున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్.. అధ్యక్ష పదవికి అర్హురాలు అంటూ బైడెన్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో, అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకుంటున్నారనే చర్చ మొదలైంది.
కాగా, తాజాగా అధ్యక్షుడు జో బైడెన్ నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్స్(NAACP) అన్వాల్ కన్వేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. కమలా హారీస్ కేవలం గొప్ప ఉపాధ్యక్షురాలు మాత్రమే కాదు. ఆమె అమెరికా ప్రెసిడెంట్ కూడా కావచ్చు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు విన్న డెమోక్రాట్స్ ఆనందం వ్యక్తం చపట్లు కొట్టారు. ఇక, బైడెన్ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ మొదలైంది.
మరోవైపు.. అంతకుముందు కూడా కమలా హారీసే డెమోక్రటిక్ పార్టీకి భవిష్యత్ అని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇక, కొన్ని సందర్భాల్లో మాత్రం బైడెన్.. తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకునే ఛాన్స్ లేదని చెప్పిన విషయం తెలిసిందే. పోటీలో తానే ఉంటానని చెప్పుకొచ్చారు. ట్రంప్‌ను ఓడిస్తానని వ్యాఖ్యలు కూడా చేశారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్‌తో భేటీ సందర్భంగా బైడెన్ తేలిపోయాలి. దీంతో, బైడెన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమోక్రటిక్ పార్టీలోనే కొందురు నేతలు కామెంట్స్ చేశారు. బైడెన్ స్థానంలో కమలా హారీస్‌కు అవకాశం ఇవ్వాలని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. ఇక, పలు సర్వేల్లో ట్రంప్‌కు పోటీగా కమలా హారీస్ బెటర్ అనే ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. సీఎన్‌ఎన్ సర్వేల్లో కమలా హారీస్‌కు 45 శాతం ఓట్లు రాగా ట్రంప్‌కు మాత్రం 47 శాతం ఓటింగ్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment