అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తొమ్మిది పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు.
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తొమ్మిది పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. అమెరికాకు చెందిన ప్యూ రీచర్చ్ సెంటర్ జరిపిన ఓ భారీ సర్వేలో ప్రజలు ఈ మేరకు తీర్పు నిచ్చారు. ఇద్దరిలో ఎవరు ఉత్తమ అధ్యక్షుడు అంటే చెప్పడం కష్టమని ప్రతి పది మందిలో నలుగురు పేర్కొన్నారు. 51 శాతం మంది క్లింటన్‌ను బలపరచగా, 42 శాతం మంది ట్రంప్‌కు మద్దతు తెలిపినట్లు ప్యూ వర్గాలు గురువారం పేర్కొన్నాయి.