
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ చేసే దిశగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. కీలక ముందడుగు వేశారు. డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధుల వర్చువల్ రోల్‌కాల్ ఓట్లు కోరే అర్హత సాధించారు.
బరిలో ఆమె ఒక్కరే మిగలడంతో.. పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థగా కమలా హారిస్ ఎన్నిక ఇక లాంఛనమే కానుంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థత్వాన్ని ఖాయం చేసుకునేందుకు కమలా హారిస్ నామినేషన్‌కు 3,923 మంది డెలిగేట్లు (99 శాతం) మద్దతు పలికారు.