గజరాజు ఫన్నీ ఫీట్‌.. వైరల్‌ | Elephant Stands on Legs for Tree Leaves | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 2 2018 7:21 PM | Last Updated on Thu, Aug 2 2018 7:21 PM

Elephant Stands on Legs for Tree Leaves - Sakshi

సఫారీలో సంచరించే ఓ ఏనుగు చేసిన ఫీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. జిరాఫీలను ఆదర్శంగా తీసుకుని రెండు కాళ్లపై నిల్చుని చెట్ల కొమ్మలను అందిపుచ్చుకుని ఆహారాన్ని ఆరగించింది. డంకెన్‌ టేలర్‌ అనే ఫోటోగ్రాఫర్‌ తన కుటుంబంతో క్రూగర్‌ నేషనల్‌ పార్క్‌(సౌతాఫ్రికా)కు వెళ్లగా.. అక్కడ ఓ ఏనుగు ఆయన కెమెరా కంటికి చిక్కింది. 

‘సాధారణంగా సర్కస్‌ ఏనుగుల్లో ఇలాంటి ప్రవర్తన సహజం. కానీ, ఓ అడవి ఏనుగు ఇలా ప్రవర్తించటం మాత్రం చాలా అరుదు. ప్రతీ రోజూ జిరాఫీలను చూసి చూసి దానికి అలా చేయాలన్న ఆలోచన కలిగింది. వారంపైగానే అది యత్నించింది. ఏదైతేనేం చివరకు సాధించింది’ అని సఫారీ పర్యవేక్షకుడు డెన్ని బోనియెల్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement