ఆకులో ఆకునై.. పూవులో పువ్వునై.. అన్న సినీకవి గీతానికి కొనసాగింపుగా ప్రకృతి రంగులో పూర్తిగా కలిసిపోయిన చిరుత ఒకటి ఈ ఫొటోలో దాగుంది.
గలగలా తనముందే తిరిగి చటుక్కున చెట్టెక్కిన ఉడతను వేటాడేందుకు చెట్టుకింద నిల్చున్న చిరుతను కనిపెట్టడానికి కాస్త కష్టపడాల్సిందే. అందుకే ఈ చిత్రం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
సౌతాఫ్రికాలోని లిపాప్ ప్రావిన్స్ లో గల క్రూగెర్ జాతీయ పార్కులో గైడ్ గా పనిచేస్తోన్న ఫ్రాంకోయిస్ కొల్లిన్స్.. టూరిస్టులతో మాట్లాడుతూ యాదృశ్చికంగా.. సాధారణ ఐఫోన్ తో తీశాడీ ఫొటో. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వేలకొద్దీ షేర్లు సాధించింది. కాస్త కంటిచూపుకు పదును పెట్టి చిరుతను ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం!