భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు దక్షిణాఫ్రికా అర్హత సాధించింది. చెమ్స్‌ఫోర్డ్ వేదికగా బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో దక్షిణాఫ్రికా జట్టు నేరుగా అర్హత సాధించింది. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానం కోసం ఐర్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడ్డాయి.
ఇంగ్లండ్ వేదికగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి ఉంటే ఐర్లాండ్ నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించేది. కానీ దురదృష్టవశాత్తూ తొలి వన్డే రద్దుకావడంతో దక్షిణాఫ్రికాకు అదృష్టం కలిసివచ్చింది. దీంతో ఈ మెగా టోర్నీకు నేరుగా క్వాలిఫై అయిన ఎనిమిదవ జట్టుగా ప్రోటీస్ నిలిచింది.
కాగా వన్డే ప్రపంచకప్-2023లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల ఆధారంగా 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తే.. మరో రెండు జట్లు క్వాలిఫియర్ రౌండ్లలో విజయం సాధించి ఈ మెగా ఈవెంట్‌లో అడుగుపెడతాయి. ఈ క్వాలిఫియర్ మ్యాచ్‌లు జింబాబ్వే వేదికగా జరగనున్నాయి.
చదవండి: #ManishPandey: 'నువ్వు ఆడకపోతివి.. ఆడేటోడిని రనౌట్ జేస్తివి!'
Comments
Please login to add a commentAdd a comment