![India Most Successful Team After 100 T20 Matches - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/29/india-most-successful-team-.jpg.webp?itok=eRi4Woej)
డబ్లిన్: వరుస విజయాలతో దూసుకపోతున్న టీమిండియా మరో అరుదైన ఘనత సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో టీమిండియా 100 అంతర్జాతీయ టీ-20ల మైలురాయిని చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన ఏడో జట్టుగా టీమిండియా నిలిచింది. కాగా, ఐర్లాండ్‌తో ఆడిన 100వ టీ20 మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.
దాంతో టీ20లో టీమిండియా విజయాల సంఖ్య 63 కు చేరింది. ఫలితంగా ఒక అంతర్జాతీయ జట్టు 100 టీ20లు ఆడే సమయానికి అత్యధిక విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఆ జాబితా ప్రకారం తర్వాతి స్థానాలలో వరుసగా దక్షిణాఫ్రికా(59), పాకిస్తాన్ (59), ఆస్ట్రేలియా( 53), శ్రీలంక (52), న్యూజిలాండ్(52), ఇంగ్లండ్(48) జట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment