నేడు ఐర్లాండ్‌తో భారత్ తొలి పోరు
పటిష్టంగా రోహిత్ బృందం
రాత్రి గం. 8 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
న్యూయార్క్: బంగ్లాదేశ్‌తో వామప్ పాస్ అయిన టీమిండియా ఇప్పుడు సిసలైన పోరాటానికి సిద్ధమైంది. టి20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం గ్రూప్ ‘ఎ’లో జరిగే తమ తొలి పోరులో ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. రోహిత్ శర్మ బృందం తమ స్థాయికి తగని ప్రత్యర్థిపై అలవోక విజయంతో ప్రపంచకప్ వేటను మొదలుపెట్టాలని పట్టుదలతో ఉంది.
ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా చిన్న జట్టయినా గట్టిగానే ఎదుర్కోవాలని భావిస్తోంది. మరోవైపు ఐర్లాండ్‌కు మాత్రం ఇది కొండను ‘ఢీ’కొట్టడమే! సూపర్ ఫామ్‌లో, రెండు నెలలుగా ఐపీఎల్‌తో టి20 మ్యాచ్‌లలో తలమునకలైన ఆటగాళ్లున్న జట్టుతో తలపడటం ఐర్లాండ్‌కు ఆషామాషీ కానేకాదు. భారత్‌లాంటి పటిష్టమైన జట్టుకే ఆడటం కష్టంగా ఉన్న డ్రాప్ ఇన్ పిచ్‌లపై ఐర్లాండ్ సంచలనాన్ని ఆశించడం కూడా ఆత్యాశే అవుతుంది.
కోహ్లినే కొండంత బలం
ఆలస్యంగా జట్టుతో కలిసిన స్టార్ బ్యాటర్, కింగ్ కోహ్లి బంగ్లాతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. అంతమాత్రాన ప్రాక్టీస్ లేదనుకుంటే పొరపాటే! ఈ సీనియర్ స్టార్ ఐపీఎల్‌లో ఎవరికీ సాధ్యంకాని రీతిలో ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడగా మెరిపించాడు. కెపె్టన్ రోహిత్ కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. వీరిద్దరు ఓపెనింగ్ చేస్తే సంజూ సామ్సన్ వన్‌డౌన్‌లో దిగుతాడు.
4, 5 స్థానాల్లో సూర్యకుమార్, రిషభ్ పంత్‌లు చెలరేగితే ఎలాంటి బౌలర్‌కైనా చుక్కలు కనబడటం గ్యారంటీ! బౌలింగ్‌లో అనుభవజు్ఞలైన బుమ్రా, సిరాజ్, స్పిన్నర్లు జడేజా, అక్షర్ పటేల్‌లు అందుబాటులో ఉండటంతో ప్రత్యర్థి జట్టు వీరిని ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డకతప్పదు. లోయర్ ఆర్డర్‌లో అదనపు బ్యాటింగ్ అవసరం లేదనుకుంటే అక్షర్ స్థానంలో కుల్దీప్ తుది జట్టులో ఉంటాడు.
ఐర్లాండ్ పోటీ ఏపాటి?
ప్రపథమ టి20 చాంపియన్ (2007) భారత్‌తో చూసుకుంటే ఐర్లాండ్ క్రికెట్ కూనే! అయితే పొట్టి పోరులో ఎవరు ఏ ఓవర్‌లో మెరిపించినా మ్యాచ్ మలుపుతిరగడం ఖాయం. కాబట్టి పాల్ స్టిర్లింగ్ బృందం భారత్ బలాబలాలను దృష్టిలో పెట్టుకొని బరిలోకి దిగుతుంది.
హిట్టర్లు, బ్యాటింగ్ ఆల్‌రౌండర్లతో కూడిన ఐర్లాండ్ టీమిండియా ఏమాత్రం ఆలసత్వం ప్రదర్శించినా వాటిని సానుకూలంగా మలచుకోవాలనే వ్యూహాలతో ఉంది. వార్ వన్‌సైడ్ కాకుండా కాస్త దీటుగా ఎదుర్కోగలిగితే చాలు పరాజయమైన సగం విజయంతో సమానమని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), కోహ్లి, సంజూ సామ్సన్/దూబే, సూర్యకుమార్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్.
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, బాల్బిర్నీ, క్యాంఫర్, టెక్టర్, డెలనీ, డాక్‌రెల్, టకెర్, జోష్ లిటిల్, మార్క్ అడైర్, యంగ్.
పిచ్, వాతావరణం
బంగ్లాదేశ్‌తో ఆడిన వార్మప్ వేదికపైనే ఈ మ్యాచ్ జరుగుతుంది. డ్రాప్ ఇన్ పిచ్. బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. పేలవమైన అవుట్ ఫీల్డ్ వల్ల బ్యాటర్లకు పరుగులు అంత సులువుగా రాకపోవచ్చు. వర్షం ముప్పు లేదు.
Comments
Please login to add a commentAdd a comment