ఇండోర్: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 248 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ను హషీమ్ ఆమ్లా, డీ కాక్ లు ఆరంభించారు. అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. టీమిండియా ఆదిలో కీలక వికెట్లను వరుసగా చేజార్చుకుని కష్టాల్లో పడింది. 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లో పడిన టీమిండియాను కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆదుకున్నాడు.
ధోని (92 నాటౌట్: 86 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో నిలబెట్టాడు. అంతకుముందు అజింక్యా రహానే(51) మరోసారి ఆకట్టుకోడంతో టీమిండియా సముచిత స్కోరు చేసింది.