![ICC Womens World Cup: South Africa Beat Pakistan By 6 Runs - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/11/southafrica.jpg.webp?itok=ztfHj2Gy)
మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ వరుసగా మూడో ఓటమి చూవి చూసింది. లీగ్ మ్యాచ్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 217 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో నిధా ఖాన్(40), సోహెల్(65), నిధా ధార్(55) పరుగులతో రాణించినప్పటికీ పాక్‌కు ఓటమి తప్ప లేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ మూడు వికెట్లు పడగొట్టగా.. మారిజాన్ కాప్, ఖాకా చెరో రెండు వికెట్లు సాధించారు.
ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వోల్వార్డ్ట్(75), లూస్(62) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, గులాం ఫాతిమా చెరో మూడు వికెట్లు సాధించారు. ఇక మూడు ఓటమిలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచిన పాకిస్తాన్‌కు సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి14న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇక పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. మరో స్టార్ ఆటగాడు దూరం!
Comments
Please login to add a commentAdd a comment