
మహిళల వన్డే ప్రపంచకప్‌ను పాకిస్తాన్ ఓటమితో ముగించింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 71 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులకే పరిమితమైంది. పాకిస్తాన్ బ్యాటర్లలో నిదా ధార్(50), బిస్మా మరూఫ్(38) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. ఇక న్యూజిలాండ్ బౌలర్ హన్నా రోవ్ ఐదు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ను దెబ్బతీసింది.
అదేవిధంగా ఫ్రాన్సిస్ మాకే రెండు వికెట్లు, రోజ్మేరీ మెయిర్, కేర్ చెరో వికెట్ సాధించారు. కాగా అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో బేట్స్ 126 పరుగులతో రాణించింది. పాకిస్తాన్ బౌలర్లలో నిదా ధార్ మూడు వికెట్లు, ఫాతిమా, ఆమీన్ చెరో వికెట్ సాధించారు. కాగా ప్రపంచకప్‌లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఒకే ఒకే మ్యాచ్‌లో విజయం సాధించింది. అదే విధంగా న్యూజిలాండ్ కూడా సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది.
చదవండి: IPL 2022: తొలి సమరానికి సై.. చెన్నైపై కోల్‌కతా ప్రతీకారం తీర్చుకుంటుందా!
Comments
Please login to add a commentAdd a comment