
ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు గుడ్‌న్యూస్. గాయం కారణంగా ఐపీఎల్-2022కు దూరం అవుతాడు అనుకున్న ఢిల్లీ స్టార్ పేసర్ ఆన్రిచ్ నోర్జే వచ్చేశాడు. అయితే గాయం కారణంగా గత కొంత కాలంగా దక్షిణాఫ్రికా జట్టుకు నోర్జే దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్‌లో పాల్గొనడంపై సందేహాలు తలెత్తాయి. కానీ నోర్జే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అతడు తన భార్యతో కలిసి ముంబైలో ఢిల్లీ జట్టు బస చేస్తున్న హోటల్‌కు చేరుకున్నాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకున్న అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించిక పోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా క్రికెట్ అతడి ఫిట్‌నెస్‌పై బీసీసీఐకు కీలక సూచనలు చేసినట్లు సమచారం. ఢిల్లీ క్యాపిటల్స్ వైద్య బృందం అతడికి మరోసారి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనుంది. నోర్జే ఫిట్ గా ఉన్నాడని ఢిల్లీ వైద్య బృందం తేల్చితేనే ఐపీఎల్‌లో ఆడనున్నాడు. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది.
చదవండి: Suresh Raina: మెగావేలంలో అవమానం.. అక్కడ మాత్రం ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment