Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నార్ట్జే లక్నోతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. గత ఐదు నెలల నుంచి గాయంతో బాధపడుతున్న నార్ట్జే పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభంలోనే జట్టుతో చేరినప్పటికీ.. తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. మరో వైపు పాకిస్తాన్ పర్యటన కారణంగా ఐపీఎల్-2022 ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ దృవీకరించాడు.
"డేవిడ్ వార్నర్ తన క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నాడు. కాబట్టి మా తదుపరి మ్యాచ్‌కు అతడు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడు. ఇది మాకు నిజంగా గుడ్‌న్యూస్. అదే విధంగా అన్రిచ్ నార్ట్జే కూడా ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కాబట్టి అతడు కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు అని" షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ఇక డివై పాటిల్ స్టేడియం వేదికగా గురువారం(ఏప్రిల్7)న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.
తుది జట్లు (అంచనా)
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, కైల్ మైయర్స్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై/దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మన్‌దీప్ సింగ్, రిషబ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్
చదవండి: IPL 2022: దటీజ్ "జూనియర్ ఏబీ".. బంతిని చూడకుండానే భారీ సిక్సర్
Your tweet was quoted in an article by Insidesport https://t.co/dQauRxA14Y
— Recite Social (@ReciteSocial) April 6, 2022
The smile says it all 💙
— Delhi Capitals (@DelhiCapitals) April 6, 2022
📹 | This season's first interview with @davidwarner31 👉🏼 He is excited and ready to ROAR for Delhi again 🤩🔥#YehHaiNayiDilli | #IPL2022 | #TATAIPL | #IPL | #DelhiCapitals | #CapitalsUnplugged | @TajMahalMumbai | #OctaRoarsForDC pic.twitter.com/gYfSVj1TWH
Comments
Please login to add a commentAdd a comment