
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో తొలిసారి బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ నిరాశపరిచాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన వార్నర్ 12 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే వార్నర్‌కు చిత్రమైన పరిస్థితే ఎదురైంది. అతనికి జతగా వచ్చిన పృథ్వీ షా ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. వార్నర్‌కు కనీసం బ్యాటింగ్ అవకాశం రాకుండా బ్యాటింగ్ చేసిన పృథ్వీ షా 34 బంతుల్లో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. పృథ్వీ షా ఫిఫ్టీ సాధించినప్పుడు వార్నర్ 11 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు పృథ్వీ విధ్వంసం ఎంతలా సాగిందనేది.
అయితే పృథ్వీ షా ఔట్ అయ్యాకా ఆడతాడేమోనని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. ఎందుకంటే మరుసటి ఓవర్లోనే రవి బిష్ణోయి బౌలింగ్‌లో వార్నర్ పెవిలియన్ చేరాడు. అలా వార్నర్ కథ ముగిసింది. గతేడాది ఎస్‌ఆర్‌హెచ్ నుంచి ఘోరమైన అవమానాలు ఎదుర్కొన్న వార్నర్‌కు ఇది మంచి ఆరంభం కాదని చెప్పొచ్చు. అయితే వార్నర్‌కు ఇదే తొలి మ్యాచ్.. ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.. అప్పటివరకు మంచి ఇన్నింగ్స్‌లు ఆడతాడని ఆశిద్దాం. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
చదవండి: Prithvi Shaw: 'ఏం ఆడుతున్నావని విమర్శించారు'.. బ్యాట్‌తోనే సమాధానం
Deepak Hooda-Krunal Pandya: 'ఒకప్పుడు కొట్టుకునే స్థాయికి'.. కట్‌చేస్తే
Comments
Please login to add a commentAdd a comment