
Courtesy: IPL Twitter
భారత గడ్డపై తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న అన్‌రిచ్ నోర్ట్జేకు డికాక్ చుక్కలు చూపించాడు. 150 కిమీ వేగంతో విసిరిన బంతిని డికాక్ కళ్లు చెదిరే సిక్స్ కొట్టడంతో ఆశ్చర్యపోవడం నోర్ట్జే వంతైంది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. 14వ ఓవర్ తొలి బంతిని నోర్ట్జే 150 కిమీ వేగంతో బీమర్ (హై ఫుల్‌టాస్ బంతి) వేశాడు. అసలు ఆడేందుకు కష్టంగా ఉండే బంతిని డికాక్ సూపర్‌గా హిట్ చేశాడు.
తన మొహానికి డికాక్ బ్యాట్ అడ్డుపెట్టగానే బంతి బ్యాట్ ఎడ్జ్ తగిలి నేరుగా బౌండరీ అవతల పడింది. తాను కొట్టింది సిక్సర్ అని బహుశా డికాక్ కూడా ఊహించి ఉండడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత అంపైర్ దానిని బీమర్‌గా ప్రకటించి నోబాల్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనూ నోర్ట్జే దీపక్ హుడాకు ఇదే తరహాలో బీమర్ వేయడంతో అంపైర్లు నోర్ట్జేను బౌలింగ్ చేయకుండా అడ్డుకున్నారు.
డికాక్ కళ్లు చెదిరే సిక్స్ కోసం క్లిక్ చేయండి
చదవండి: IPL 2022: నోర్ట్జేకు చేదు అనుభవం.. బౌలింగ్ వేయకుండా అడ్డుకున్న అంపైర్లు
Comments
Please login to add a commentAdd a comment