బీజింగ్: చైనా, సౌత్‌ఆఫ్రికాలు సమస్యలపై ఒకరికొకరు సాయం చేసుకుంటామని చైనా పేర్కొంది. ప్రపంచీకరణలో భాగంగా బ్రిక్స్ సదస్సు దేశాల మధ్య సుస్ధిరాభివృద్ధి ఉండేలా చూస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ తెలిపారు. సెప్టెంబర్‌లో ఆగ్నేయ చైనాలోని గ్జియామెన్ నగరంలో జరిగే సదస్సులో బ్రిక్స్ దేశాల సుస్ధిరాభివృద్ధిపై చర్చిస్తుందన్నారు. ఆయన దక్షిణాఫ్రికా ప్రతినిధి కోనా మాశబానేను బీజింగ్‌లో కలిశారు. వాంగ్ చైనా దక్షిణాఫ్రికాల సంబంధాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇరుదేశాల సంబంధాలు పరస్పర సహకారంతో అభివృద్ధి వైపు పయనిస్తున్నాయన్నారు. ప్రధాన సమస్యలను చర్చించుకుని ముందుకు వెళ్తామని తెలిపారు.