SA Vs ENG: ఇంగ్లండ్‌ను 131 పరుగులలోపు ఆలౌట్‌ చేయలేకపోయింది... | Restrict England below a score of 131 South Africa can make it through the semis | Sakshi
Sakshi News home page

SA Vs ENG: ఇంగ్లండ్‌ను 131 పరుగులలోపు ఆలౌట్‌ చేయలేకపోయింది...

Published Sat, Nov 6 2021 10:12 PM | Last Updated on Sun, Nov 7 2021 9:51 AM

Restrict England below a score of 131 South Africa can make it through the semis - Sakshi

update: ఇంగ్లండ్‌ను దక్షిణాఫ్రికా 131 పరుగులలోపు ఆలౌట్‌ చేయలేకపోయింది.  ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ సెమిస్‌కు చేరలేకపోయింది.

T20 World Cup 2021 ENG Vs SA:  టీ20 ప్రపంచకప్‌-2021లో గ్రూపు-1లో ఇంగ్లండ్‌ ఇది వరకే సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నవంబర్‌6 న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా నాలుగు విజయాలతో గ్రూపు-1లో రెండో స్ధానంలో నిలిచింది. దీంతో సెమిస్‌కు ఒక్క అడుగు దూరంలో ఆస్ట్రేలియా నిలిచింది.

అయితే గ్రూపు-2లో మూడు విజయాలతో దక్షిణాఫ్రికా మూడో స్ధానంలో ఉంది. అయితే నవంబర్‌6న ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తే  దక్షిణాఫ్రికా సెమిస్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 189 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ ముందు ఉంచింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ను 131 పరుగులలోపు ఆలౌట్‌ చేస్తే దక్షిణాఫ్రికా రన్‌రేట్‌ ఆధారంగా సెమిస్‌కు చేరుతుంది.

చదవండి: Harbhajan Singh: 'చెత్త వాగుడు ఆపండి'.. భజ్జీ వార్నింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement