Teamindia 2021-2022 Home Season Schedule: 2021-22 సీజన్‌కు సంబంధించిన టీమిండియా హోమ్ సీజన్ షెడ్యూల్‌కు బీసీసీఐ సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2020-21 సీజన్ నవంబర్ 14న జరిగే టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో ముగియనుండగా.. నవంబర్ 17 నుంచి కివీస్‌తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌తో స్వదేశంలో క్రికెట్ పండుగ సీజన్ ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది జూన్ 19న దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 మ్యాచ్‌తో ఈ ఏడాది టీమిండియా హోమ్ సీజన్ ముగుస్తుంది. షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే..
నవంబర్ 17 నుంచి డిసెంబర్ 7 వరకు టీమిండియా కివీస్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టీ20 జైపూర్ వేదికగా నవంబర్ 17న జరగనుండగా.. రాంచీ, కోల్‌కతాల్లో నవంబర్ 19, 21వ తేదీల్లో రెండు, మూడు టీ20లు జరుగుతాయి. అనంతరం కాన్పూర్ వేదికగా తొలి టెస్ట్(నవంబర్ 25 నుంచి 29 వరకు), ముంబైలో రెండో టెస్ట్(డిసెంబర్ 3 నుంచి 7 వరకు) జరుగుతుంది.
ఆతర్వాత 2022 ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి వన్డే అహ్మదాబాద్ వేదకగా ఫిబ్రవరి 6న జరగనుండగా.. 9, 12 తేదీల్లో జైపూర్, కోల్‌కతాల్లో మిగితా రెండు వన్డేలు జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 15న కటక్‌లో తొలి టీ20.. 18, 19 తేదీల్లో వైజాగ్, త్రివేండ్రం వేదికగా మిగితా రెండు మ్యాచ్‌లు జరుగుతాయి.
ఆ వెంటనే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు టీమిండియా శ్రీలంకతో 2 టెస్ట్‌లు, 3 టీ20ల సిరీస్ జరుగుతుంది. బెంగుళూరులో తొలి టెస్ట్(ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు), మొహాలీలో రెండో టెస్ట్(మార్చి 5 నుంచి 9 వరకు) జరుగుతుంది. మొహాలీ, ధర్మశాల, లక్నోల్లో మూడు టీ20లు వరుసగా 13, 15, 18 తేదీల్లో జరుగుతాయి. ఇక జూన్ 9న భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన మొదలవుతుంది. ఈ పర్యటనలో సఫారీలు టీమిండియాతో 5 టీ20లు ఆడతారు. ఈ మ్యాచ్‌లు జూన్ 9, 12, 14, 17, 19 తేదీల్లో చెన్నై, బెంగుళూరు, నాగపూర్, రాజ్‌కోట్, ఢిల్లీల్లో జరుగుతాయి.
చదవండి: ఏ ఇతర భారత క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డు.. కేవలం 71 పరుగుల దూరంలో
Comments
Please login to add a commentAdd a comment