home series
-
స్వదేశంలో టీమిండియా వరుస సిరీస్ లు.. షెడ్యూల్ ఇదే..!
-
భారత్‌లో క్రికెట్ పండుగ.. కివీస్‌తో మొదలై దక్షిణాఫ్రికాతో ముగింపు
Teamindia 2021-2022 Home Season Schedule: 2021-22 సీజన్‌కు సంబంధించిన టీమిండియా హోమ్ సీజన్ షెడ్యూల్‌కు బీసీసీఐ సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2020-21 సీజన్ నవంబర్ 14న జరిగే టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో ముగియనుండగా.. నవంబర్ 17 నుంచి కివీస్‌తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌తో స్వదేశంలో క్రికెట్ పండుగ సీజన్ ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది జూన్ 19న దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 మ్యాచ్‌తో ఈ ఏడాది టీమిండియా హోమ్ సీజన్ ముగుస్తుంది. షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే.. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 7 వరకు టీమిండియా కివీస్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టీ20 జైపూర్ వేదికగా నవంబర్ 17న జరగనుండగా.. రాంచీ, కోల్‌కతాల్లో నవంబర్ 19, 21వ తేదీల్లో రెండు, మూడు టీ20లు జరుగుతాయి. అనంతరం కాన్పూర్ వేదికగా తొలి టెస్ట్(నవంబర్ 25 నుంచి 29 వరకు), ముంబైలో రెండో టెస్ట్(డిసెంబర్ 3 నుంచి 7 వరకు) జరుగుతుంది. ఆతర్వాత 2022 ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి వన్డే అహ్మదాబాద్ వేదకగా ఫిబ్రవరి 6న జరగనుండగా.. 9, 12 తేదీల్లో జైపూర్, కోల్‌కతాల్లో మిగితా రెండు వన్డేలు జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 15న కటక్‌లో తొలి టీ20.. 18, 19 తేదీల్లో వైజాగ్, త్రివేండ్రం వేదికగా మిగితా రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ వెంటనే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు టీమిండియా శ్రీలంకతో 2 టెస్ట్‌లు, 3 టీ20ల సిరీస్ జరుగుతుంది. బెంగుళూరులో తొలి టెస్ట్(ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు), మొహాలీలో రెండో టెస్ట్(మార్చి 5 నుంచి 9 వరకు) జరుగుతుంది. మొహాలీ, ధర్మశాల, లక్నోల్లో మూడు టీ20లు వరుసగా 13, 15, 18 తేదీల్లో జరుగుతాయి. ఇక జూన్ 9న భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన మొదలవుతుంది. ఈ పర్యటనలో సఫారీలు టీమిండియాతో 5 టీ20లు ఆడతారు. ఈ మ్యాచ్‌లు జూన్ 9, 12, 14, 17, 19 తేదీల్లో చెన్నై, బెంగుళూరు, నాగపూర్, రాజ్‌కోట్, ఢిల్లీల్లో జరుగుతాయి. చదవండి: ఏ ఇతర భారత క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డు.. కేవలం 71 పరుగుల దూరంలో -
మా పిచ్‌లపై 10-15 మ్యాచ్‌లు ఆడితే వాళ్ల కెరీర్లు ముగిసినట్టే..
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ స్వదేశీ పిచ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢాకాలోని పిచ్‌లు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు పనికిరావని విమర్శించాడు. ఇలాంటి పిచ్‌లపై 10-15 మ్యాచ్‌లు ఆడితే యువ బ్యాట్స్మెన్ల కెరీర్లు అర్ధంతరంగా ముగుస్తాయని ఆరోపించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో టీ20 సిరీస్‌లు ఆడింది. ఈ సిరీస్‌ల్లో ఆ జట్టు 4-1తేడాతో ఆస్ట్రేలియాను.. ఆ తర్వాత 3-2తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. అయితే ఢాకా వేదికగా జరిగిన ఈ పది మ్యాచ్‌ల్లో కనీసం 120 పరుగులు చేయడం కష్టమైన నేపథ్యంలో షకీబ్ ఈమేరకు స్పందించాడు. ఈ సిరీస్‌ల్లో ఢాకాలోని పిచ్‌లపై బంగ్లాదేశ్ సహా పర్యాటక జట్లలోని బ్యాట్స్మెన్లు 100 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. టీ20 మ్యాచ్‌లే అయినప్పటికీ ఒక్కసారి కూడా భారీ స్కోర్లు నమోదు కాలేదు. పిచ్ స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలించింది. ఈ నేపథ్యంలోనే షకీబ్ సోంత పిచ్‌లపై విమర్శలు చేశాడు. ఇలాంటి పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ వైఫల్యాలను పరిగణలోకి తీసుకోరాదని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 రెండో దశ కోసం యూఏఈ చేరుకున్న షకీబ్.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ముగిసిన రెండు రోజుల్లోనే టీ20 ప్రపంచకప్ మొదలుకానున్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడటం ద్వారా పొందిన అనుభవాలను తనతో పాటు ముస్తాఫిజుర్ రెహ్మన్.. బంగ్లాదేశ్ ఆటగాళ్లతో పంచుకుంటామని ఈ సందర్భంగా తెలిపాడు. ఇలా చేయడం టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో షకీబ్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు, ముస్తాఫిజుర్ రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే, వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) 15 మందితో కూడిన జట్టును గతవారం ప్రకటించింది. మహ్మదుల్లా కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లకే బీసీబీ తొలి ప్రాధాన్యం ఇచ్చింది. షకీబ్ ఆల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, ముస్తాఫిజుర్ రెహ్మన్ లాంటి ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోగా.. స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌కు బీసీబీ మొండిచేయి చూపింది. కాగా, ఈ ప్రపంచకప్‌లో బంగ్లా జట్టు తొలుత క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ జట్టు: మహ్మదుల్లా (కెప్టెన్), నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, లిటన్ కుమార్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసైన్, నూరుల్ హసన్ సోహన్, షాక్ మెహదీ హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, సైఫుద్దీన్, షామీమ్ హోసేన్. స్టాండ్ బై ప్లేయర్స్: రూబెల్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం బిప్లాబ్. చదవండి: ధోని సేనకు భారీ షాక్.. ఒకేసారి నలుగురు విదేశీ స్టార్లు దూరం..! -
అప్పటివరకు మేం భారత్‌లో ఆడం
టీమిండియా వచ్చి పాకిస్థాన్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడేవరకు తాము భారతదేశంలో పర్యటించేది లేదని పాక్ క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నజామ్ సేథి స్పష్టం చేశారు. భారతదేశంతో ద్వైపాక్షిక సిరీస్‌ను పునరుద్ధరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అది పాకిస్థాన్ లేదా మరో దేశంలో అయితే ఓకే గానీ భారత్‌లో మాత్రం కాదని ఆయన అన్నారు. ముందుగా తమ దేశంలో ఒక పూర్తిస్థాయి సిరీస్ ఆడితేనే ఆర్థిక నష్టాల నుంచి బయటపడగలమని, భారత్‌తో ఆడకపోవడం వల్ల ఇన్నాళ్లుగా చాలా నష్టపోయామని సేథి చెప్పారు. మార్చిలో భారత్‌లో జరిగే టి20 వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు పీసీబీకి పాక్ ప్రభుత్వం అనుమతించింది. తమ ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోందని, కానీ భారతదేశం కూడా తమకిచ్చిన మాటను ముందుగా నిలబెట్టుకోవాలని సేథి కోరారు. ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో 2007 తర్వాత ఇంతవరకు టీమిండియా వెళ్లి పాకిస్థాన్‌లో సిరీస్ ఆడలేదు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో బీసీసీఐ ఈ దిశగా కొంతవరకు ప్రయత్నాలు చేసినా.. ప్రభుత్వం మాత్రం అందుకు అనుమతించలేదు. ముంబై ఉగ్రదాడుల నుంచి ఇటీవల పఠాన్‌కోట్ దాడి వరకు పదే పదే ఉగ్రవాదులకు ఊతం ఇచ్చే చర్యలకు పాక్ పాల్పడుతుండటంతో ఆ దేశంతో ద్వైపాక్షిక సిరీస్.. అదీ వాళ్ల దేశంలో ఆడేందుకు భారత ప్రభుత్వం సుముఖంగా లేదు.