Rachin Ravindra Become Youngest New Zealand Test Debutant Since Ish Sodhi: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ తరుపున అరంగేట్రం చేసిన ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర సరికొత్త రికార్డు సృష్టించాడు. కీవిస్ తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రవీంద్ర నిలిచాడు. అంతకముందు 2013లో బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేసిన ఇష్ సోధి అతి పిన్న వయస్కుడిగా ఉన్నాడు.
కాగా 22 ఏళ్ల రచిన్ రవీంద్రకు తన సహచర ఆటగాడు టామ్ బ్లండెల్ టెస్ట్ క్యాప్(282)ను అందించాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి బరిలోకి దిగింది. ఇక అజాజ్ పటేల్,రచిన్ రవీంద్ర, ఇష్ సోధి భారతీయ మూలాలు కలిగి ఉన్న వాళ్లన్న సంగతి తెలిసిందే. కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(2021-2023) లో న్యూజిలాండ్‌కు ఇదే తొలి మ్యాచ్. ఇక తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment