థానే: మహారాష్ట్రలో దక్షిణాఫ్రికా నుండి థానేకి తిరిగి వచ్చిన 32 ఏళ్ల ఇంజనీర్‌కి చేసిన కోవిడ్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు కొత్త వైరస్ వేరియంట్ దృష్ట్య కోవిడ్-19 ఐసోలేషన్ సెంటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే సదరు వ్యక్తిని ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు నిర్వహించడంతో అతను కరోనా బారిన పడినట్లు గుర్తించామని కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) అంటువ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ప్రతిభా పాన్ పాటిల్ తెలిపారు. పైగా ఏడు రోజుల తర్వాతే ఫలితాలు తెలుస్తాయని అన్నారు. అయితే ఆ ఇంజనీర్ కాస్త తీవ్ర ఆందోళనకు గురవ్వడంతో కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పాటిల్ వెల్లడించారు.
(చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!)
అంతేకాదు కేడీఎంసీ కమీషనర్ డాక్టర్ విజయ్ సూర్యవంశీ కళ్యాణ్ డోంబివిలి టౌన్‌షిప్ పౌరులను ఈ కొత్త వేరియంట్ దృష్ట్యా ఎటువంటి ఆందోళనలకు గురికావద్దని అన్నారు. పైగా కోవిడ్ ప్రోటోకాల్‌ని కచ్చితంగా పాటించాలంటూ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులు ఎనిమిది మందికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించడమే కాక ఆ ఇంజనీర్‌తో ప్రయాణించిన వారి గురించి కూడా విచారిస్తున్నాం అని అధికారులు అన్నారు. అయితే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ప్రపంచానికి పెను ముప్పు వాటిల్లనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించిన సంగతి తెలిసిందే.
(చదవండి: చపాతీలు కోసం చంపేశారు..!)
Comments
Please login to add a commentAdd a comment